కర్ణాటక ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్పందన

హైదరాబాద్: కర్ణాటక ఫలితాలే తెలంగాణలో పునరావృతం కాబోతున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. భారత్ జోడోయాత్రతో కాంగ్రెస్ లో జోష్ వచ్చిందన్నారు. జోడో యాత్ర తర్వాత  కాంగ్రెస్ వరుస విజయాలు సాధిస్తోందన్నారు. హిమాచల్ లో తొలి విజయం, కర్ణాటకలో  రెండో విజయం, తెలంగాణలో మూడో విజయం సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు రేవంత్. 

కర్ణాటకలో మత రాజకీయాలను  ప్రజలు తిప్పికొట్టారని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మతం ఒక విశ్వాసమే కానీ.. రాజకీయ అంశం కాదన్నారు. మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్న బీజేపీని ప్రజలు తిప్పి కొట్టి  మోడీ నాయకత్వాన్ని ఓడించారని తెలిపారు. 

జేడీఎస్ ను ఓడించి కేసీఆర్ ను తిరస్కరించారని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్న కుమారస్వామిని ఓడించారని చెప్పారు. కర్ణాటక ఫలితాలే తెలంగాణలో పునరావృతం కాబోతున్నాయన్నారు.   కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు బీఆర్ఎస్ కు ఇష్టం లేదని. అందుకే కర్ణాటక ఫలితాలు తెలంగాణలో పునరావృతం కాబోవని కేటీఆర్ ట్వీట్ చేశారన్నారు.

మనిక్ రావ్ ఠాక్రే..టీ పీసీసీ ఇంఛార్జి

బి ఆర్ ఎస్ పార్టీ కర్ణాటకలో కుమార స్వామి కి మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ ఓటమి కి ప్రయత్నించింది. తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రానుంది.

ఎంపీ ఉత్తమ్ కుమార్

కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ లో ప్రభావితం చేస్తాయి. కాంగ్రెస్ తెలంగాణ లో అధికారం లోకి వస్తుంది. కర్ణాటక బీజేపీ కి చెంపపెట్టు రిజల్ట్ ఇచ్చారు. కర్ణాటక మాధిరే తెలంగాణ లో కూడా అసమర్థత, అవినీతి నడుస్తుంది.

VH హనుమంతరావు

మా నేతలు ఇగో లు పక్కకు పెట్టాలి. మనిక్ రావ్ ఠాక్రే తో మాట్లాడుకొని గ్యాప్ లేకుండా చూసుకోవాలి. 2024 లో రాహుల్ దేశ ప్రధాని అవుతారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ని నమ్ముతున్నారు.

పొన్నాల లక్ష్మయ్య

2024 లో 1980 చరిత్ర రిపీట్ అవుతుంది. ప్రజలు కాంగ్రెస్ ఎం చేసింది.. ఎం చేయబోతోంది.. చెబుదాం.

జానారెడ్డి

నియంతృత్వ నికి, అహంకారానికి తీర్పు ఇచ్చారు. కర్ణాటక నేతల మధ్య గ్యాప్ ఉన్న అందరూ కలిసి కట్టుగా పని చేశారు. ఇలానే తెలంగాణ లో కూడా పని చేయాలి. కర్ణాటక మాదిరి తెలంగాణ లో పంథా ని కొనసాగించాలి. అన్ని వర్గాల వాళ్ళు మాతతత్వనికి వ్యతిరేకంగా బీజేపీ, బి ఆరేస్ ని కూడా ఓడించాలి. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టాలి. మేము అందరం కలిసి కట్టుగా పని చేస్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X