“రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్, ఐరన్ లెగ్, క్రిమినల్, చదువుకున్న దొంగ”

రేవంత్ రెడ్డి అసాంఘిక మాటలపై చర్యలు తప్పవు

ప్రజలు కూడా రేవంత్ రెడ్డిని తరిమి కొడుతారు

రేవంత్ మాటలు పార్టీపరమైనవా? వ్యక్తిగతమా? చెప్పాలి

రేవంత్ మాటలపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుందా? లేదా?

రేవంత్ రెడ్డి పాదయాత్రకు ప్రజా స్పందన లేకే ప్రగతిభవన్ పై గ్రెనేడ్ మాటలు

నక్సలైట్లతో గ్రెనేడ్లు వేయిస్తామన్నది కాంగ్రెస్ విధానామా?

పీసీసి అధ్యక్షుడు రేవంత్ పై మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి మండిపాటు

ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపనేని నరేందర్ ఫైర్

హైదరాబాద్: పాదయాత్రలో ప్రజల స్పందన కరువైన తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారం కోసం ప్రగతి భవన్ మీద నక్సలైట్లు గ్రెనేడ్లు వేయాలని చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, ఇలాంటి అసాంఘిక మాటలపై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని, ప్రజలు తరిమికొడుతారని మంత్రులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీమతి సత్యవతి రాథోడ్ , ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపనేని నరేందర్ కలిసి హెచ్చరించారు.

ములుగులో పాదయాత్ర మొదలు పెట్టిన రేవంత్ రెడ్డి ప్రజల నుంచి స్పందన లేక, నర్సంపేటలో జనం తిరగబడితే వాహనంలో ఎక్కి పారిపోయి ప్రగతి భవన్ పై నక్సలైట్లు గ్రెనేడ్లు వేయాలని మహబూబాబాద్ లో మాట్లాడడంపై నేడు అసెంబ్లీలోని బిఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. వెంటనే క్షమాపణలు చెప్పకపోతే తగిన పరిణామాలుంటాయన్నారు.

రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? వ్యతిరేకిస్తుందా? ఆ పార్టీ సీనియర్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి మాటలు పార్టీపరమైనవి అయితే ఒకవిధానంలో, వ్యక్తిగతమైనవి అయితే మరొక విధానంలో వ్యవహరించాల్సి వస్తుందన్నారు.

నక్సలైట్లను నిషేధించిన కాంగ్రెస్ పార్టీ విధానాన్ని రేవంత్ రెడ్డి ఈ మాటలతో వ్యతిరేకిస్తున్నారా స్పష్టం చేయాలన్నారు.

గాంధేయవాదంతో వ్యవహరించే కాంగ్రెస్ నేడు తెలంగాణలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన గాడ్సే విధానంలో వెళ్తుందన్నారు. పిసిసి అధ్యక్షుడుగా ఆ పార్టీని సర్వనాశనం చేస్తున్నారని చెప్పారు.

మీడియా సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి మాటలు…

• రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడుగా పెట్టుకోవడమే కాంగ్రెస్ కు ముప్పు.
• ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఖతం.
• బిజెపిలో ఉంటే అక్కడ పార్టీ లేవలేదు.
• తెరాస పార్టీలో ఉన్నపుడు ఉద్యమం లేవలేదు.
• బయటకు వెళ్లగానే ఉద్యమం ఊపందుకుంది.
• టిడిపికి వచ్చి దానిని నాశనం చేశాడు.
• రేవంత్ రెడ్డిని ఐటెం సాంగ్ గా చూస్తారు.
• ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని సర్వ నాశనం చేసింది రేవంత్ రెడ్డినే.
• రేవంత్ దగ్గర ఉంది కిరాయి మనషులు.
• కాంగ్రెస్ నాయకులు ఈయన వెంట ఉండరు.
• పాదయాత్ర చేస్తే దానిని కొనసాగించాలి.
• రాహుల్, రాజశేఖర్ రెడ్డిలు పాదయాత్ర కొనసాగించాలి.
• నేను కూడా పాదయాత్ర చేశాను. కాలు బెణికినా కుంటుకుంటు హైదరాబాద్ కి వచ్చా.
• ములుగులో మొదలు పెట్టి, నర్సంపేటకు వచ్చి అక్కడ పాదయాత్ర ఎందుకు చేయలేదు.
• వెహికల్ ఎక్కి దిగావు అది కూడా పాదయాత్రనా?
• నువ్వు ఒక బ్రోకర్ వు
• నీ చరిత్ర అందరికీ తెలుసు
• ఇపుడు ఒక స్థాయిలో ఉన్నావు హందాను మరిచి పిచ్చి, పిచ్చిగా మాట్లాడడం మంచిది కాదు.
• నా కింద పని చేసినప్పుడు కూడా ఏయే పనులు చేస్తే తిట్టేది.
• పిసిసి అధ్యక్షుడు ఈయనకు ఇవ్వడమే తప్పు.
• నీ మాటలు ఎంత గలీజుగా ఉన్నాయి.
• గ్రెనెడ్స్ తో పేల్చాలని అన్నావు. ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.
• నక్సలైట్లను నిషేధించింది కాంగ్రెస్.
• నీ పార్టీ విధానాలు నీకు నచ్చలేదా?
• ఛత్తీస్ ఘడ్ లో నక్సలైట్లను ఎన్ కౌంటర్ లు చేస్తున్నారు.
• నక్సలైట్ విధానం అయితే రాహుల్ గాంధీ తో ఆ మాట అనిపించాలి కదా.
• ఇంగితం లేకుండా మాట్లాడే బ్రోకరిజం బంద్ పెట్టాలి.
• కేసిఆర్, కేటీఆర్ మీద ఇష్టం వచ్చినట్లు అంటున్నావు.
• ప్రజలు తరిమి కొడతారు.
• ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని ఉండు.
• ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటాం.
• ప్రజలు కూడా తరిమి కొడతారు.
• ప్రగతి భవన్ కు ప్రజల వస్తున్నారు.
• మీడియా వస్తున్నారు..సమావేశాలు పెడుతున్నారు.
• సచివాలయం లేదు కాబట్టి ప్రగతి భవన్ దగ్గర అన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి.
• రాజశేఖర్ రెడ్డి, చంద్ర బాబు దగ్గర కొన్ని ప్రవర్తనలు ఉన్నాయి.
• ప్రజల అవసరాలు తెల్సుకుని నిర్ణయాలు తీసుకునే సీఎం కేసీఆర్ గారు.
• నక్సలైట్ అజెండా తప్పు కాదు. దుర్మార్గులను శిక్షించాలి అని అందులో ఉంటుంది.
• అసలైన దుర్మార్గుడు రేవంత్.
• బ్లాక్ మెయిలర్.
• నాకు చదువు రాదని అన్నాడు.
• చదువు రాకుండానే ఏడుసార్లు గెలిచానా?
• చదువు ఉండి దోపిడీ, దొంగతనాలు వక్ర మార్గాలు నీవి
• ఆయన మాటలు సక్కగా ఉన్నాయా?
• తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
• సీఎం, హోం,పోలీస్ ల దృష్టికి తీసుకెళ్తాం.

మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి మాటలు…

• గొంతు చించుకుని మాట్లాడితే అబద్దం, నిజం అవుతుందని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు.
• వ్యవస్థ మీద నమ్మకం, విశ్వాసం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి.
• నీ మాటలు వ్యక్తిగతమా? పార్టీ అభిప్రాయమా? చెప్పాలి.
• నక్సలైట్ లను చర్చలకు పిలిచి కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీయే కదా.
• ఈరోజు వారి భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు.
• అనర్హుడికి అధ్యక్షుడుగా ఇస్తే ఇలాంటి గతి పట్టింది అనే దానికి నీ మాటలు నిదర్శనం.
• ప్రజలను ఉసి గొల్పే నీ మార్గం మంచిది కాదు.
• ప్రగతి భవన్ 4 కోట్ల మంది సంక్షేమం కోసం కృషి చేస్తున్న భవన్.
• ప్రగతి భవన్ బద్దలు కొట్టి అధికారంలోకి వస్తాను అని ఒకనాడు అన్నావు.
• రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాలో తిరుగుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.
• కాంగ్రెస్ నేతలు కూడా దీనిని గమనించాలి.
• పేదల అవసరాలు గుర్తించి సీఎం మంచి పాలన అందిస్తుంటే ఇక్కడ ఏమి అమలు చేస్తున్నారో దేశం దానిని ఆచరిస్తుంది.
• నక్సలైట్లకు, ప్రజలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి.

పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మాటలు…

• రేవంత్ రెడ్డి తన పాదయాత్ర ములుగులో తెలంగాణ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చారు.
• పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ మాట్లాడిన మాటలు బి.ఆర్.ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.
• ఆదరణ కరువై, ప్రజలు రావడం లేదని పత్రికల్లో ప్రచారం కోసం అసంఘటిత శక్తులు మాట్లాడే మాటలు రేవంత్ మాట్లాడారు.
• అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసిన వేదిక ప్రగతి భవన్.
• ప్రగతి భవన్ మీద గ్రెనేడ్స్ విసిరి బ్లాస్ట్ చేయాలని నక్సలైట్స్ ను కోరడం గతంలో ఎవరూ చేయలేదు.
• ఇది శిక్షార్హం. దీనిపై క్రిమినల్ కేసులు, పిడి కేసులు పెట్టాలి.
• అసాంఘిక శక్తిగా మారారు.
• నర్సంపేట భగ్గుమంది.
• ప్రజాస్వామ్య వాదులు ముందుకు వచ్చి నిరసన తెలిపారు.
• పిసిసి అధ్యక్షుడు రేవంత్ సమాధానం చెప్పాలి.
• నక్సలైటు లు పేల్చితే మాకు అభ్యంతరం లేదు.. అన్నది ఏఐసీసీ కి వర్తిస్తాయా? వీటిని సమర్ధిస్తారా?
• పార్టీ లైనా? వ్యక్తిగతమా? చెప్పాలి. వ్యక్తిగతంగా అయితే చర్యలు ఉంటాయా?
• తెలంగాణ అభివృద్ది పై ఈ మాటలు తీవ్ర ప్రభావం చూపుతాయి.
• పార్టీ దీనిపై నైతిక బాధ్యత వహించాలి.
• రేవంత్ మాటలపై పోలీస్ చర్యలు తీసుకుంటారు.
• రేవంత్ ఐరన్ లెగ్.
• కాంగ్రెస్ గాంధేయ వాదా?
• గాంధీ నుంచి గాడ్సే వైపు పయనిస్తుంది.
• రేవంత్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా?

ఎమ్మెల్యే అరూరి రమేష్ గారి మాటలు...

• నిన్న సమ్మక్క -సారక్క సాక్షిగా పాదయాత్ర చేపట్టి ములుగులో ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు రేవంత్ రెడ్డి.
• అనేక సంక్షేమ ఫలాలు అందిస్తున్న ప్రగతి భవన్ ను గ్రెనేడ్స్ తో పేల్చాలని అనడం తీవ్రంగా ఖండిస్తున్నాం.
• పేద, బడుగు, బలహీన వర్గాల్లో మార్పు తీసుకువచ్చిన భవన్ ప్రగతి భవన్.
• గొప్ప, గొప్ప పథకాలు రూపొందించిన భవన్ పేల్చాలని అనడం దుర్మార్గం.
• నీకు పిసిసి అధ్యక్షుడుగా కొనసాగే అర్హత ఉందా?
• మీ పార్టీయే కదా నక్సలైట్స్ ను నిషేధించింది?
• తప్పకుండా నీ పాదయాత్ర వల్లే పార్టీకి కలిసి రావడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X