“ముఖ్యమంత్రి కేసిఆర్ రోడ్లు భవనాలు శాఖ ద్వారా ఎన్నో అద్భుతాలు సృష్టించారు”

  • మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

సెక్రటేరియట్: ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆదేశాల మేరకు…తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆర్ అండ్ బి శాఖ సాధించిన విజయాలు,పురోగతి పై రూపొందిస్తున్న డాక్యుమెంటరీ పై శనివారం నాడు డా.బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్షలో ఆర్ అండ్ బి సెక్రెటరీ శ్రీనివాస రాజు,ఈఎన్సిలు గణపతి రెడ్డి, రవీందర్ రావు,సి.ఈ సతీష్,మధుసూధన్ రెడ్డి,డి.సి దివాకర్,పలువురు అధికారులు,డాక్యుమెంటరీ రూపొందించే సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ…

ముఖ్యమంత్రి కేసిఆర్ గారు రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఎంతో దూర దృష్టితో,భవిష్యత్ తరాలకు మేలు జరిగేలా రోడ్లు భవనాలు శాఖ ద్వారా ఎన్నో అద్భుత కట్టడాలు నిర్మించారని అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఉద్యమ సమయంలో ఎదుర్కొన్న అనుభవాలు దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం సాకారం చేసుకున్నాక తెలంగాణ ఎందులో తీసిపోదు,అన్నిట్లో ఒక మెట్టు పైనే అనేవిధంగా పాలన సంస్కరణలు చేపట్టారని అన్నారు. కేసిఆర్ గారి అకుంఠిత దీక్ష,పాలన దక్షతతో తెలంగాణరాష్ట్రం నేడు అతి తక్కువ సమయంలో యావత్ దేశానికే రోల్ మోడల్ గా అవతరించిందని పేర్కొన్నారు.

అందులో భాగంగా ఆర్ అండ్ బి శాఖ అధ్వర్యంలో రాష్ట్రంలో నిర్మాణమైన భవనాలు,రోడ్లు, బ్రిడ్జిలు, డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రతిష్టాత్మకం అయ్యాయన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేవలం ఆర్ అండ్ బి పరిధిలో 30లక్షల చదరపు అడుగులు విస్తీర్ణంలో మాత్రమే నిర్మాణాలు ఉన్నాయని ఈ 9 ఏళ్ల కాలంలో కొత్తగా 1కోటి చదరపు అడుగుల బిల్డింగ్స్ సముదాయం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.మొత్తంగా 1కోటి 30 లక్షల చ.అ విస్తీర్ణం ఉపయోగంలో ఉండగా మరో 1కోటి చదరపు అడుగుల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయన్నారు. ప్రైవేట్ నిర్మాణ రంగంలో ఏడాదికి ఎంతైతే విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతుందో ప్రభుత్వం కూడా అంతే స్థాయి విస్తీర్ణంలో నిర్మాణం చేపడుతుందన్నారు.

దేశంలోనే ఎక్కడ లేని విధంగా 139 కోట్ల నిధులతో 100 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు,పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నూతన జిల్లాలు ఏర్పాటు చేసుకొని అన్ని జిల్లాల్లో దేశమే అబ్బుర పడేలా 1650 కోట్లతో జిల్లా సమీకృత కార్యాలయ భవనాలు నిర్మించామని తెలిపారు.

తెలంగాణ ప్రజలు గర్వించేలా సకల హంగులతో రాష్ట్ర రాజదానిలో 617 కోట్లతో సచివాలయ భవనం నిర్మించుకున్నామని,ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ పట్ల ఉన్న అపారమైన గౌరవంతో పరిపాలనా భవనానికి ఆయన పేరే పెట్టారని అన్నారు. ఈ భవనానికి దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ బిల్డింగ్ గా గోల్డెన్ రేట్ దక్కిందన్నారు.

అదే విధంగా హైదరాబాద్ లో 585 కోట్ల తో 20 అంతస్థుల పోలీస్ కమిషనరేట్ మరియు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనాన్ని నిర్మంచామని తెలిపారు.

146.50 కోట్లతో భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల ప్రపంచంలోనే ఎతైన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. సుమారు 177 కోట్లతో లుంబినీ పార్క్ సమీపంలో తెలంగాణ అమరవీరుల త్యాగాలు నిత్యం స్మరించుకునేలా అమరవీరుల స్మారక చిహ్నం నిర్మించామని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో 30 కోట్లతో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్,మైనార్టీ అనాథ చిన్నారుల కోసం హైదరాబాద్ నాంపల్లిలో 39 కోట్ల వ్యయంతో అనీస్ – ఉల్ – గుర్బా నిర్మించామని తెలిపారు.

రాష్ట్రంలో రహదారులు గత 60 ఏళ్లలో నిర్మించిన వాటికంటే ఈ 9ఏళ్లలో రెట్టింపు అయ్యాయని తెలిపారు. ప్రతి గ్రామానికి బి. టి రోడ్డు,ప్రతి మండల కేంద్రానికి డబుల్ రోడ్డు,జిల్లా కేంద్రం నుండి రాష్ట్ర రాజదాని నాలుగు లైన్ల రోడ్డు ప్రణాలిక ప్రకారం రికార్డు సమయంలో రోడ్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

పేదల ఆత్మ గౌరవ ప్రతీకగా డబుల్ బెడ్రూం ఇల్లు 100 శాతం ప్రభుత్వ సబ్సిడీతో పూర్తి ఉచితంగా అందజేస్తున్నమని, 30 ఏళ్లుగా పేదలకు గృహ నిర్మాణం కోసం ఎంత ఖర్చు చేశారో అంత ఖర్చు కేవలం 9 ఏళ్లలో చేశామని,వెయ్యి కోట్లు ఇంకా అదనంగానే ఖర్చు చేశామని అన్నారు. సుమారు 13 కోట్ల చదరపు అడుగుల నిర్మాణం చేశామని వెల్లడించారు.

ఇలా ప్రతి ఒక్క స్కీమ్ ఎంతో మానవీయ కోణంలో శ్రీకారం చుట్టినవే అని అన్నారు. డాక్యుమెంటరీ రుపొందించేటప్పుడు ఈ అంశాలు అన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X