“పంచాయతీ నిధులను తస్కరించిన దొంగ కేసీఆర్, జీతాలే ఇయ్యలేనోడు తెలంగాణను అభివ్రుద్ది ఏం చేస్తాడు?”

సీఎం, మంత్రిసహా అధికారులపై నాన్ బెయిలెబుల్ కేసులు నమోదు చేయాలె

తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలె

బెంగాల్ తరహాలో తెలంగాణలో బీజేపీ కార్యకర్తలపై దాడులకు టీఆర్ఎస్ కుట్ర

దేవుళ్లను, హిందూ మతాన్ని కించపర్చే వాళ్లను తరిమికొట్టండి

8 నెలల్లో ఎన్నికలెప్పుడైనా రావొచ్చు…. సిద్ధంగా ఉండండి

భాగ్యనగర్ ప్రజలందరినీ ఓటు బ్యాంకుగా మార్చండి

ఈనెల 19న ప్రధాని పర్యటనను విజయవంతం చేయండి

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలతో ప్రిపరేటరీ మీటింగ్ లో బండి సంజయ్ వ్యాఖ్యలు

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులను మంజూరు చేస్తే ఆయా నిధులను తస్కరించిన దొంగ ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్, సంబంధిత మంత్రి, అధికారులపై నాన్ బెయిలెబుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, కంపా నిధులు సహా కేంద్రం తెలంగాణకు ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ అభివ్రుద్ధికి పెద్ద ఎత్తున నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా…. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సహకరించడం లేదని అన్నారు.

తెలంగాణలో ఉద్యోగులకు జీతాలే సక్రమంగా ఇవ్వలేని దుస్థితిలో ఉన్న కేసీఆర్… తెలంగాణను ఏ విధంగా అభివ్రుద్ధి చేస్తారని ప్రశ్నించారు. ఈ విషయంపై జరుగుతున్న చర్చను దారి మళ్లించేందుకే పదేపదే కేంద్రం తెలంగాణకు నిధులివ్వడం లేదనే అబద్దాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ కు దమ్ముంటే తెలంగాణకు కేంద్రం ఏయే పథకానికి ఎన్ని నిధులిచ్చిందనే అంశంపై బహిరంగ చర్చకు సిద్దం కావాలని సవాల్ విసిరారు. ఈనెల 19న ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో ఈ పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈరోజు సాయంత్రం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల నేతలతో మోదీ పర్యటన ఏర్పాట్లపై ప్రిపరేటరీ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బండి సంజయ్ తోపాటు పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, ఉమారాణి, హైదరాబాద్ సెంట్రల్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు గౌతమ్ రావు, బొక్క నర్సింహారెడ్డిసహా పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…..

• ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది. రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అభివ్రుద్ధి ఏమీ లేదు. అందుకే ప్రధానిని, కేంద్రాన్ని తిడుతూ చర్చను దారి మళ్లిస్తున్నారు. దమ్ముంటే కేసీఆర్…. తెలంగాణలో జరిగిన అభివ్రుద్ధిపై చర్చకు సిద్ధమా? కేంద్ర సహకారం లేకుండా భాగ్య నగర్ కు ఎన్ని నిధులు వెచ్చించారో చెప్పే దమ్ముందా? అట్లాగే రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా?

• గ్రామ పంచాయతీలకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులిస్తే… ఆ నిధులను ఎత్తుకుపోయిన దొంగ కేసీఆర్. సర్పంచ్ అకౌంట్లో వేసిన నిధులను దొంగిలించారు. అలాంటి సీఎంసహా సంబంధిత శాఖ మంత్రి, అధికారులపై చీటింగ్, దొంగతనం కేసు నమోదు చేయాలి. ఇవ కాదు… స్మార్ట్ సిటీ నిధులను దారి మళ్లించారు. జాతీయ ఉపాధి హామీ నిధులు, కంపా నిధులను కూడా దారి మళ్లించారు.

• భాగ్యనగర్ కార్యకర్తలు రాబోయే తరానికి కాబోయే నాయకులు… కేంద్రం తెలంగాణకు, భాగ్యనగర్ కు ఎన్ని నిధులిచ్చిందనే విషయంపై ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలి.

• తెలంగాణను కష్టపడి సాధించుకున్నం. అభివ్రుద్ధికి కేంద్రం మరిన్ని నిధులిచ్చేందుకు సిద్ధం. కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదేపదే చెబుతున్నారు. కేంద్రం తెలంగాణకు ఇస్తున్న నిధులకు మ్యాచింగ్ గ్రాంట్లను కూడా కేసీఆర్ ఇవ్వడం లేదు.

• ఈరోజుకు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేదు. ఉద్యోగుల పిల్లలంతా…‘‘ మా నాన్నకు శాలరీ ఎప్పుడిస్తావ్’’అని అడుగుతున్నరు. అయినా కేసీఆర్ పట్టించుకోవడం లేదు.

• కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని ఏ పథకానికి ఎన్ని నిధులిచ్చింది? తెలంగాణకు మొత్తంగా ఎన్ని నిధులిచ్చిందో చర్చించేందుకు సిద్ధం? దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి.

• ప్రధానమంత్రిని ఏనాడూ అభివ్రుద్ధి గురించి, నిధుల గురించి అడగని కేసీఆర్… ఇయాళ కేంద్రాన్ని బదనాం చేసేందుకు అబద్దాలు వల్లిస్తున్నారు.

• ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారాన్ని కాపాడుకోవడానికి, పేరు ప్రతిష్టల కోసమే తప్ప తెలంగాణ అభివ్రుద్ధి గురించి, ప్రజల గురించి పట్టించుకోవడం లేదు.

• రాష్ట్ర ప్రజలు కడుతున్న పన్నులు ఏం చేస్తున్నవ్? జీతాలివ్వలేని, పెన్షన్ ఇవ్వలేని, రుణమాఫీ, దళిత బంధు, దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేని పరిస్థతి ఎందుకొచ్చింది?

• 2014లో లిక్కర్ ఆదాయం రూ.10 వేల కోట్లుంటే…. నేడు రూ.40 వేల కోట్లు దాటింది. రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు రూ.20 వేల కోట్లకు మించి ఖర్చు కావడం లేదు? మిగిలిన సొమ్ము ఏం చేస్తున్నట్లు?

• కేసీఆర్ కుటుంబం చేయని దందా లేదు. లిక్కర్, పత్తాల, ల్యాండ్, శ్యాండ్ దందాలు సహా అన్నీ చేస్తున్నరు.

• జీతాలే ఇయ్యలేనోడు తెలంగాణను అభివ్రుద్ది ఏం చేస్తాడు? బీజేపీ కార్యకర్తలారా, నాయకులారా…. ఈ విషయంపై టీఆర్ఎస్ నేతలకు సవాల్ విసరండి. భాగ్యనగర్ అభివ్రుద్ధి నిధులపై చర్చించడానికి రావాలని సవాల్ విసరండి. భాగ్యనగర్ లో అధికారం త్రుటిలో తప్పింది. మేయర్ అవకాశం బీజేపీకి ఇవ్వకపోవడంపట్ల ప్రజలు బాధపడుతున్నరు. సిటీలో మార్పు కోరుకుంటున్నరు. మోదీ లాంటి నిజాయితీ పాలన కావాలి. సంఘ విద్రోహశక్తులను అణిచివేసే బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నరు.

• కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. కార్పొరేటర్లు అహంకారాన్ని విడనాడాలి. టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇండ్ల ముందు ఇసుక, కంకర కుప్పలు కన్పిస్తే లంచం అడుగుతున్నారు. ప్రజల పక్షాన ఉంటూ కొట్లాడాలి.

• ఈనెల 19న ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ వస్తున్నందున ఈ పర్యటనను విజయవంతం చేయాలి. ప్రతి ఒక్కరూ హాజరు కావాలి. అట్లాగే అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలి.

• 8 నెలల్లో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు. మనం అన్ని విధాలా సిద్ధంగా ఉండాలి. బెంగాల్ మాదిరిగా బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నడు. ఇక్కడున్నది తెలంగాణ కార్యకర్తలు. తరిమితరిమి కొడతారనే సంగతి తెలుసుకునేలా చేయాలి. నాపైనే 11 నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టారు. ప్రజల కోసం కేసులు లెక్క కాదు. జైలుకు పోయేందుకు సిద్ధంగా ఉన్నం. క్రమశిక్షణ ఉన్న పార్టీ, కొట్లాడే పార్టీ, టీఆర్ఎస్ ను ఎదిరించే పార్టీ బీజేపీ.

• రజాకార్ల రాజ్యం పోవాలె… రామరాజ్యం రావాలనే భావనతో ప్రజలున్నరు. అయ్యప్పను, భాగ్యలక్ష్మీ అమ్మవారిని, శ్రీరాముడిని కించపరిచినా స్పందించలేదంటే హిందూ సమాజం మనల్ని క్షమించదు. హిందూ ధర్మాన్ని కించపరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. తరిమి తరిమి కొట్టాలే. భాగ్యనగర్ ప్రజలంతా ఓటు బ్యాంకుగా మారినందునే బీజేపీని గెలిపిస్తున్నారనే సంగతిని గుర్తుంచుకోవాలి. లేనిపక్షంలో మన గెలుపు వ్రుథా అయినట్లే. మనం బీజేపీ కార్యకర్తలం కానట్లే. హిందూ ఓటు బ్యాంకును కాపాడుకోవాలి.

Chief Minister K Chandrasekhar Rao of looting the funds sanctioned by the Centre for the development of gram panchayats

Hyderabad: Telangana Bharatiya Janata Party president Bandi Sanjay Kumar on Monday accused Bharat Rashtra Samithi president and chief minister K Chandrasekhar Rao of looting the funds sanctioned by the Centre for the development of gram panchayats.

Addressing the preparatory meeting of the party leaders of Hyderabad and Ranga Reddy districts for Prime Minister Narendra Modi’s visit to Hyderabad on January 19, the BJP president demanded that non-bailable cases should be booked against the chief minister, panchayat raj minister Errabelli Dayakar Rao and the officials concerned for siphoning of the panchayat funds.

Sanjay alleged that the Telangana government was diverting funds released by the Centre to the local bodies under various schemes like Smart City Mission, National Rural Employment Guarantee Programme and Compensatory Afforestation Fund Management and Planning Authority (CAMPA).

“The Prime Minister is ready to extend further financial assistance to the state in a big way, but the state government is not cooperating with the Centre,” he said.

Stating that KCR was not in a position to give even salaries to the employees on time, Sanjay wondered how the chief minister was boasting of developing the state as No. 1 in the country. He alleged that the state government was not able to release pensions to the pensioners and Rythu Bandhu amount to the farmers and implement the crop loan waiver scheme.

The BJP president reiterated his challenge that the chief minister should come for a public debate on how much money the Centre had released under what scheme. “In a bid to divert the attention of the people from his failures, he is repeatedly spreading canards against the Centre alleging that it was not releasing funds to the state,” he said.

He called upon the party workers to make the visit of the Prime Minister to Hyderabad on January 19 a big success. He also asked the party workers in Hyderabad to make a door-to-door campaign on the welfare schemes and funds released by the Centre.

Stating that the elections to the state assembly could be held anytime in the next eight months, Sanjay called upon the party workers to be battle-ready. “As the elections approach, the KCR government is conspiring to trouble the BJP workers, as was done in West Bengal in the past, by foisting false cases against them. Let us not get scared of such tactics. Let us be prepared to go to jail, as we are a party of disciplined cadre. We can go to any extent to fight against the BRS,” he said.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X