हैदराबाद: साहित्य उत्सव-2022। तीन दिनों का यह एक ऐसा कार्यक्रम है जहां साहित्य के क्षेत्र और सिनेमा के क्षेत्र में काम करने वाले एक ही मंच दिखाई देंगे। तेलंगाना के भाषा और संस्कृति विभाग के सहयोग से ‘पाटकु जेजेलु’ नाम से यह कार्यक्रम 20, 21 और 22 नवंबर को सुंदरय्या विज्ञान केंद्र, बाग लिंगमपल्ली में आयोजित किया जा रहा है। आप सबका स्वागत है।
Hyderabad: పాటకు పట్టం కడదాం రండి. ఒక భావోద్వేగం ఎదుటి వారికి అర్ధమయ్యే రీతిలో చెప్పాలంటే పాట కావాలి. ఒక ఉద్యమం జనబాహుళ్యంలోకి చొచ్చుకొని పోవాలంటే పాట కావాలి. పండిత పామరులను అలరించే శక్తి పాట సొంతం. పల్లవి, అనుపల్లవి, చరణం అంటూ తెలిసిన వారు భాగాలు చేశారు కానీ, అవేవీ లేకుండానే జనజీవనంలో పాటది ప్రధాన పాత్ర. పుట్టుక నుంచి చావు దాకా రకరకాల పాటలతో మమేకమై ఉన్నాం మనం. సాధారణ మాటకు రాని స్పందన పాట ద్వారా వస్తుంది.
జానపదాలు, కలుపు పాటలు, బతుకమ్మ పాటలు, భజన పాటలు, లాలి పాటలు, పెళ్ళి పాటలు, మంగళ హారతుల పాటలు, దేవుని పాటలు, సినిమా పాటలు… ఇంకా ఎన్నో రకాల పాటలు. మాటలనే అందంగా రాగయుక్తంగా పాడటమే పాట కావొచ్చు. అయినా చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ అలరించే పాటకు ప్రాముఖ్యం ఎక్కువ. ఇటువంటి పాట గురించిన విస్తృత స్థాయి చర్చ ఎంతో అవసరం కదూ. ఈ రోజుల్లో యువత సినీ రంగంవైపుకు ఎంతో ఉత్సాహంగా అడుగులు వేస్తోంది. పాటలు రాసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. మరి సినిమాకు ఎలాంటి పాటలు అవసరమో చెప్పేవారెవరు? ఏ రకమైన పాటలు ప్రజల నోట్లో నానుతాయి? పాటల ద్వారా అందించాల్సింది వినోదం మాత్రమేనా? విజ్ఞానం అవసరం కూడా ఉందా?
సినీరంగం వైపుకు అడుగులు వేసే వారిలోనూ ఇలాంటి అనేకానేక సందేహాలు పట్టి పీడిస్తుంటాయి. ఇలా సందేహాలతో సతమతమవుతున్న వారినీ, ఇప్పటికే ఆ మాయా సముద్రాన్ని ఈదుతున్న వారిని ఒకేచోట చేర్చి ఓ అవగాహన కలిగిస్తే…? ఇలాంటి ఆలోచనే ‘తెలంగాణ సాహితి’కి వచ్చింది. ఆ ఫలితమే ఈ ఏడాది నిర్వహిస్తున్న లిటరరీ ఫెస్ట్-2022. ఈ నెల 20 నుంచి 22దాకా మూడు రోజుల పాటు సాహితీ రంగంలో కృషి చేస్తున్నవారిని, సినీ రంగంలో కృషి చేస్తున్నవారి ఒకే వేదికపై కూర్చోబెడుతున్న కార్యక్రమం ఇది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ‘పాటకు జేజేలు’ పేరుతో నవంబర్ 20, 21, 22వ తేదీల్లో బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే రెండు రాష్ట్రాల నుంచీ విశేష స్పందన రావడం సంతోషకరమైన విషయం. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరు కావొచ్చు. ఇదే మా ఆహ్వానం.
– తెలంగాణ సాహితి కమిటీ (From Social Media)