हैदराबाद: तेलंगाना में नये साल के जश्न के दौरान शराब की बिक्री से आबकारी विभाग को बड़ी आय हुई है। दो दिन में 680 करोड़ रुपये से ज्यादा शराब बिकी है। 30 दिसंबर को 402 करोड़ और 31 दिसंबर को 282 करोड़ रुपये शराब की बिक्री हुई है।
इसके अलावा, उत्पाद शुल्क प्रवर्तन निदेशक वीवी कमलासन रेड्डी ने कहा कि उत्पाद शुल्क विभाग के तत्वावधान में 40 विशेष टीमों का गठन किया गया है और विशेष अभियान चलाया गया है। मंगलवार रात 9 से बुधवार अलसुबह 2 बजे के बीच चार मामले दर्ज किए गए हैं। दो स्थानों पर 313 ग्राम गांजा जब्त किया गया और एक पब के आसपास दो लोगों का ड्रग्स परीक्षण में सकारात्मक पाया गया।
रेड्डी ने कहा यह भी बताया कि नए साल के जश्न के लिए उत्पाद विभाग के तत्वावधान में 287 आयोजनों की अनुमति दी गई। इनसे 56.46 लाख रुपये की सरकार को आय हुई। हैदराबाद और रंगारेड्डी जिलों में 243 अनुमतियां दी गईं, जबकि बाकी जिलों में 44 अनुमतियां दी गईं। जबकि साल 2023 में 44.76 लाख की आय हुई। इसके लिए 224 आयोजनों के लिए परमिट दिये गये थे।
यह भी पढ़ें-
రెండు రోజుల్లో రూ. 680 కోట్ల లిక్కర్ సేల్స్
హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకల వేళ మద్యం అమ్మకాలతో ఎక్సయిజ్ శాఖకు భారీ ఆదాయం సమకూరింది. రెండు రోజుల్లో రూ. 680 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 30న రూ. 402 కోట్లు, డిసెంబర్ 31న రూ. 282 కోట్ల అమ్మకాలు జరిగినట్లు అధికారులు తెలిపారు.
అంతేకాకుండా ఎక్సయిజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 40 బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టినట్లు ఎక్సయిజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వీవీ కమలాసన్ రెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి తొమ్మిది నుంచి బుధవారం తెల్లవారుజామున రెండు గంటల వరకు చేసిన దాడుల్లో నాలుగు కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రెండు చోట్ల 313 గ్రాముల గంజాయి పట్టుకోవడంతోపాటు ఒక పబ్బు పరిసర ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు.
నూతన సంవత్సర వేడుకలకు ఎక్సయిజ్ శాఖ ఆధ్వర్యంలో 287 ఈవెంట్స్ కు అనుమతులిచ్చారు. వీటి ద్వారా రూ. 56.46 లక్షల ఆదాయం సమకూరింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 243 అనుమతులు ఇవ్వగా, మిగిలిన జిల్లాల్లో 44 అనుమతులు ఇచ్చారు. కాగా, 2023 లో 224 ఈవెంట్స్ కు అనుమతులకు ఇవ్వగా 44.76 లక్షల ఆదాయం వచ్చింది. (ఏజెన్సీలు)