హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఎఫ్.ఏ.యూ) కేటాయించాలనే ప్రభుత్వ ఆలోచనను నిరసిస్తూ అంబేద్కర్ వర్షీటీ ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు నిరసనకు దిగారు. అధ్యాపక, అధ్యాపకేతర, ఉద్యోగ సంఘాల నేతలు మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో విశ్వవిద్యాలయంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు, నల్లని మాస్క్ లు ధరించి మౌనంగా నిరసన తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమంలో జేఎసే ఛైర్పర్సన్ ప్రొ. పల్లవీ కాబ్డే; కన్వీనర్ ప్రొ వడ్డాణం శ్రీనివాస్; సెక్రటరీ జనరల్ మహేష్ గౌడ్, అధ్యాపకేతర ఉద్యోగుల సంఘం నేతలు ఎండి హబీబుద్దిన్, షబ్బీర్, డా. అవినాష్, డా. రాఘవేందేర్, కిషోర్, కుమార్, రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Also Read-
డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరికీ తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా అంబేద్కర్ వర్షిటీ ఐక్య కార్యాచరణ సమితి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగానే ఈ రోజు నిరసన కార్యక్రమం చేయడము జరిగింది.