Karnataka: “భజరంగ్ దళ్ ను నిషేధించడమంటే హనుమంతుడిని చెరసాలలో బంధించడమే”

-కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నిరసిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

-కాంగ్రెస్ కార్యాలయాలు, పార్టీ నేతల ఇండ్ల ముదు హనుమాన్ చాలీసా పఠనం చేయాలని బీజేపీ నిర్ణయం

లికాన్ఫరెన్స్ లో పార్టీ నేతలకు పిలుపునిచ్చిన బండి సంజయ్ కుమార్

హైదరాబాద్ : భజరంగదళ్ ను నిషేధించడమంటే హనుమంతుడిని చెరసాలలో బంధించడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనను నిరసిస్తూ రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ఎదుట ప్రజాస్వామ్యబద్దంగా ‘‘హనుమాన్ చాలీసా’’ పఠనం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కొద్దిసేపటి క్రితం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జ్ లు, వివిధ మోర్చాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులోని ముఖ్యాంశాలు….

• కర్నాటకలో అధికారంలోకి వస్తే పీఎఫ్ఐపై నిషేధం ఎత్తేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ భజరంగ దళ్ ను నిషేధిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం దుర్మార్గం. ఈ విషయంపై దేశవ్యాప్తంగా హిందూ సమాజం ఆగ్రహంతో ఉంది. కాంగ్రెస్ పార్టీ హిందూ ద్రోహి.

• హిందూ ధర్మానికి ఆపదొస్తే ముందుండి పోరాడే సంస్థ భజరంగ్ దళ్. గోరక్షణ కోసం నిరంతరం క్రుషి చేస్తున్న సంస్థ భజరంగదళ్ ను నిషేధించాలనుకోవడం దుర్మార్గం. ఇప్పుడు అడ్డుకోకపోతే తెలంగాణలో కూడా భజరంగ్ దళ్ ను నిషేధించే ప్రమాదం ఉంది.

• కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ఎదుట, కాంగ్రెస్ నేతల ఇళ్ల నేతల ఎదుట హనుమాన్ చాలీసా పఠనం చేయడం ద్వారా శాంతియుత నిరసన తెలపాలి. అందులో భాగంగా ప్రతి కార్యకర్త కాషాయ కండువా ధరించి నిరసన తెలపాలి. పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తే అక్కడే హనుమాన్ చాలీసా పఠిస్తూ నిరసన తెలపాలి.

• రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త, మోర్చా కార్యకర్తల కాషాయ జెండా, కండువాలు ధరించి హనుమాన్ చాలీసా పారాయణం ద్వారా నిరసన తెలపాలి.

జవాన్ మరణంపట్ల బండి సంజయ్ దిగ్ర్బాంతి

-కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన సంజయ్

-అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా

జమ్మూకాశ్మీర్ లో హెలికాప్టర్ ప్రమాదంలో కరీంనగర్ జిల్లా బోయినిపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన పబ్బ అనిల్ మరణించడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే బండి సంజయ్ కుమార్ అనిల్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి విలపిస్తున్న కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు యత్నించారు. అక్కడే ఉన్న జిల్లా నేతలతో మాట్లాడుతూ అనిల్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండాలని ఆదేశించారు. అంతిమ సంస్కార ఏర్పాట్లతోపాటు తదుపరి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X