100 లక్షల కోట్ల అప్పు చేసిన కేంద్రం తెలంగాణ పై విమర్శలా ??

నిర్మల సీతారామన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కల్వకుంట్ల కవిత

హైదరాబాద్: ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ ప్రజలపై భారాన్ని మోపి రూ. 100 లక్షల కోట్ల మేర అప్పులు చేసిన మోడీ ప్రభుత్వం తెలంగాణ రుణాలపై మాట్లాడడం ఏంటని వీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిలదీశారు. తెలంగాణ అప్పులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు.

కవిత మాట్లాడుతూ… 2014 నాటికి రూ.55 లక్షల కోట్ల అప్పు ఉంటే ఇప్పుడు దాదాపు రూ. 155 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. మోడీ ప్రభుత్వం దాదాపు 100 లక్షల కోట్ల అప్పు చేసిందని స్పష్టం చేశారు. కాబట్టి అప్పుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన దానికి కేంద్ర ప్రభుత్వం చేసిన పొంతనేలేదని అన్నారు.

ఈ దేశంలో ఒక్కో వ్యక్తిపై 3 రేట్ల అధిక అప్పును మొదీ మోపారని తెలిపారు. అత్యంత ధనవంతులు 3 శతం జీడీపీకి తోడ్పడుతున్నారని, మిగితా మొత్తం పేద సామన్య వ్యక్తులు మాత్రమేనని చెప్పారు. 8. 5 కోట్ల మందికి జాబ్ కార్డులు ఉన్నాయని, వారికి ఉపాధి కల్పించే బాధ్యత కేంద్రానికి ఉందని, కానీ వాళ్లకు ఉపాధి కల్పించకపవడమే కాకుండా చేయాల్సినదానికన్నా ఎక్కువ ఖర్చు చేశామని నిర్మలా సీతారామన్ అంటున్నారని, లేనిపోని సాకులతో ఉపాధి హామీ కార్మికుల జాబ్ కార్డులను తగ్గించి పేదల పొట్టపొట్టే ప్రయత్నం చేస్తున్నదని, పెద్దవాళ్లకు దోచిపెట్టే కుట్ర చేస్తోందని విమర్శించారు.

కొత్త రాష్ట్రానికి ప్రత్యేక అవసరాలు ఉంటాయని, కాబట్టి దయచేసి అన్ని రకాలుగా ఆదుకోవాలని సీఎం కేసీఆర్ కోరారని , అయనా కూడా కేంద్రం పట్టించుకోలేదని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల ఏర్పాటులోనూ వివక్ష చూపించిందని అన్నారు. రాష్ట్రాల అవసరాలను చూడకుండా బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకుంటున్నదని విమర్శించారు.

కొత్త జిల్లాల్లో నవోదయా పాఠశాలలు, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. తలసరి ఆదాయాన్ని ఆర్థిక సర్వేలో వెల్లడించకపోవడం దారుణమని స్పష్టం చేశారు. జనగణన ఇంకా చేయలేదని, దేశ ప్రజల వివరాలే కేంద్రం వద్ద లేదని చెప్పారు. కర్నాటక మెట్రోతో పాటు ఉత్తర ప్రదేశ్లో చిన్న చిన్న పట్టణాలకు మెట్రో ప్రాజెక్టులను ఎలా మంజూరు చేశారని ప్రశ్నించారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటే ఇదేనా అని నిలదీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X