हैदराबाद: शहर में आईटी के छापे से हड़कंप मच गया। प्रमुख निर्माता दिल राजू के निवास, कार्यालय, उनकी बेटी, भाई और परिजनों के मकानों पर आईटी अधिकारियों ने एक साथ छापा मारा है। इसी क्रम में अधिकारी दिल राजू के भाई सिरीश, बेटी हंसिता, रिश्तेदारों और व्यापारिक साझेदारों के घरों पर भी छापे मार रहे हैं।
हाल ही में निर्माता दिल राजू ने भारी भरकम बजट के साथ पान इंडिया फिल्म ‘गेम चेंजर’ और ‘संक्रांतिकी वस्तुन्नाम’ का निर्माण किया। ये दोनों फिल्में हाल ही में संक्रांति के अवसर पर रिलीज हुईं और सुपरहिट रहीं। इस संदर्भ में उनके आवास, कार्यालय और रिश्तेदारों के घरों पर आयकर अधिकारियों द्वारा की गई छापेमारी से सब का ध्यान आकर्षित कर रहा है।
बंजारा हिल्स, जुबली हिल्स, कोंडापुर, गच्चीबावली और अन्य इलाकों में 55 आईटी दलों ने छापा मारा और मकानों की तलाशी आरंभर कर दी है। इन आयकर छापों के बारे में अधिक जानकारी अभी तक नहीं मिल पाई है।

ఐటీ దాడులు
హైదరాబాద్: నగరంలో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. నగర వ్యాప్తంగా మొత్తం 8 చోట్ల ఏక కాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేడుతున్నారు. ఏకంగా 55 బృందాలు రంగంలోకి దిగి ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసంతో పాటు ఆఫీసులో మంగళవారం తెల్లవారుజాము నుంచి సోదాలు చేపడుతున్నారు.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలితో సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా దిల్ రాజు సోదరుడు శిరీష్, కుమార్తె హన్సిత, బంధువులు, వ్యాపార భాగస్వాముల ఇళ్లలో కూడా అధికారులు జల్లెడ పడుతున్నారు. ఈ ఐటీ రెయిడ్స్‌పై మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
కాగా, ఇటీవలే నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలను నిర్మించారు. ఆ రెండు మూవీలు కూడా ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఐటీ అధికారులు ఆయన నివాసం, ఆఫీసు, బంధువుల ఇళ్లపై దాడులు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.