అఖిల భారత రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

హైదరాబాద్ : అఖిల భారత రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ (AIRRF) సెంట్రల్ కార్యాలయం, చిల్కల్గూడలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ మధ్య రైల్వే ప్రధాన ముఖ్య వైద్య దర్శకులు శ్రీమతి నిర్మలా రాజారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్, అమీర్పేట్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పలువురు మహిళలు, పురుషులు ఆరోగ్య పరీక్షలు చేయించుకుని ప్రయోజనం పొందారు.

మహిళా దినోత్సవ సభకు ఎఐఆర్ఆర్ఎఫ్ ఉపాధ్యక్షులు శ్రీమతి కృష్ణ కుమారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు ఎస్. శ్రీధర్, స్వామి, ఎన్.ఆర్.సి. రాజు, శివకుమార్, గోపాల్ నాయుడు, గిరిజ, డాక్టర్ గుంజి తదితరులు మాట్లాడుతూ, నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారాలు, వరకట్న వేధింపులు, లింగ అసమానత వంటి సమస్యలు ఇంకా తీవ్రంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు.

Also Read-

ఈ ఏడాదికి ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన ‘హక్కులు, న్యాయం, చర్య’ (Rights, Justice, Action) అనే ఇతివృత్తాన్ని వివరించిన వక్తలు, మహిళా రక్షణ, లింగ సమానత్వ విషయాల్లో భారత్ ప్రపంచ ర్యాంకింగ్స్లో చాలా దిగువన ఉండటం సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు, రిటైర్డ్ రైల్వే ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య శిబిరంలో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం వైద్య శిబిరంలో సేవలందించిన ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ సిబ్బందిని సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X