मोहन बाबू विश्वविद्यालय की मान्यता रद्द करने की उच्च शिक्षा आयोग ने सरकार से सिफारिश की, जानें पूरा मामला

हैदराबाद: छात्रों से ज़्यादा फ़ीस वसूलने के आरोपों के बाद आंध्र प्रदेश उच्च शिक्षा आयोग ने सरकार से आंध्र प्रदेश के तिरुपति स्थित मोहन बाबू विश्वविद्यालय की मान्यता रद्द करने की सिफ़ारिश की है। इस संदर्भ में मंचू विष्णु ने अपने विश्वविद्यालय पर लगे आरोपों का जवाब दिया है।

मंचू ने कहा कि उन्होंने छात्रों से अतिरिक्त फ़ीस नहीं ली। उन्होंने कहा कि उन्होंने उतनी ही फ़ीस ली जितनी शैक्षणिक वर्ष के हिसाब से ली जानी चाहिए थी। मंचू विष्णु ने जनता से मोहन बाबू विश्वविद्यालय के ख़िलाफ़ आ रही बेबुनियाद ख़बरों पर विश्वास न करने की अपील की।

गौरतलब है कि आयोग को हाल ही में बड़े पैमाने पर शिकायत मिली थी कि मोहन बाबू विश्वविद्यालय ने पिछले तीन वर्षों में छात्रों से फ़ीस के रूप में 26 करोड़ रुपये अतिरिक्त वसूले हैं। जब इस मामले की जाँच की गई, तो उच्च शिक्षा आयोग ने फ़ीस वसूलने की बात सही पाए जाने पर विश्वविद्यालय पर 15 लाख रुपये का जुर्माना लगाया। साथ ही, छात्रों से वसूले गए 25 करोड़ रुपये 15 दिनों के भीतर छात्रों को वापस करने का आदेश दिया।

మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని సర్కార్‌కు ఉన్నత విద్యా కమిషన్ సిఫారసు

హైదరాబాద్ : విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశలోని తిరుపతిలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని సర్కార్‌కు ఉన్నత విద్యా కమిషన్ సిఫారసు చేసింది.

ఈ నేపథ్యంలోనే తమ యూనివర్సిటీపై వస్తున్న ఆరోపణలపై తాజాగా మంచు విష్ణు స్పందించారు. విద్యార్థుల నుంచి తము అదనపు ఫీజును వసూలు చేయలేదని అన్నారు. అకాడమిక్ ఇయర్ ప్రకారం ఎంత ఫీజు వసూలు చేయాలో అంతే వసూలు చేశామని తెలిపారు. మోహన్‌బాబు యూనివర్సిటీపై వస్తున్న నిరాధరమైన వార్తలను నమ్మవద్దని ప్రజలకు మంచువిష్ణు విజ్ఞప్తి చేశారు.

కాగా, మోహన్‌బాబు యూనివర్సిటీలో గడిచిన మూడేళ్లలో ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచి రూ.26 కోట్లు అదనంగా వసూలు చేశారని కమిషన్‌కు ఇటీవలే పెద్ద ఎత్తున ఫిర్యాదు అందాయి. ఈ అంశంపై విచారణ చేపట్టగా.. ఫీజుల వసూలు నిజమని తేలడంతో యూనివర్సిటీకి ఉన్నత విద్యా కమిషన్ రూ.15 లక్షల జరిమానా విధించింది. అదేవిధంగా విద్యార్థుల నుంచి వసూలు చేసిన రూ.25 కోట్లను 15 రోజుల్లోగా తిరిగి విద్యార్థులకు చెల్లించాలని ఆదేశించింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar