Strong Leader: देश के इतिहास की दुर्लभ घटना, आंध्र प्रदेश में हुआ भव्य ‘पट्टा’ अभिषेकम

हैदराबाद: देश के इतिहास में अमरावती (आंध्र प्रदेश) एक दुर्लभ घटना का मंच बन गया। गरीबों के मकानों के ‘पट्टों’ का अभिषेक हो गया। राजधानी क्षेत्र में कुल मिलाकर 50,793 लोगों को आवास प्रमाण पत्र वितरित किए गये हैं। मुख्यमंत्री वाईएस जगन मोहन रेड्डी ने गुंटूर जिले के तुल्लुूर मंडल के वेंकटपालेम में आयोजित एक जनसभा में ‘नवरत्नालु पेदलंदरिकी इल्लू’ (नवरत्नालु सभी गरीबों को मकान) योजना के तहत महिलाओं को मकानों को पट्टे सौंप दिये।

इस क्षेत्र में आर-5 जोन बनाये गये हैं और कुल 1402.58 एकड़ में 50,793 प्लॉट तैयार किए गए हैं। पट्टों के साथ-साथ सीआरडीए क्षेत्र में 443.71 करोड़ रुपये की लागत से निर्मित 5,024 टिडको आवास भी लाभार्थियों को सौंप दिये गए। कुल 25 लेआउट में से 27,031 लोग एनटीआर जिले से और 23,762 लोग गुंटूर जिले से, को पट्टे सौंप दिये गये हैं।

दिवंगत मुख्यमंत्री वाईएसआर जयंती के अवसर पर 8 जुलाई को मकान बनाने का कार्यक्रम आयोजित किया जाएगा। उन्होंने कहा कि लेआउट में इंफ्रास्ट्रक्चर पहले ही पूरा हो चुका है और 8 जुलाई तक जियो टैगिंग का काम पूरा हो जाएगा। इन मकानों के निर्माण के लिए तीन विकल्प हैं। यदि आप अपना मकान बनाते हैं तो 1 लाख 80 हजार रुपये बैंक खातों में जमा कराये जायेंगे। मकानों के निर्माण के लिए मुफ्त रेत उपलब्ध कराएगी और निर्माण के लिए मजदूर की राशि खातों में जमा की जाएगी। उन्होंने कहा कि स्टील, सीमेंट और डोर फ्रेम सब्सिडी पर उपलब्ध कराए जाएंगे और सामग्री की गुणवत्ता से किसी प्रकार का समझौता नहीं किया जाएगा।

सीएम जगन ने कहा कि चंद्रबाबू के पांच साल के शासन में केवल लूटो, बांटो और खाओ की नीति रही है। उनका समर्थन करने वाल मीडिया एक दत्तक पुत्र है। अब यह लुटेरों का गिरोह तैयार हो जाएगा। उन्होंने कहा कि अमीरों के खिलाफ गरीबों को लड़ने की नौबत आई है। अमरावती में कोई गरीब न रहे इसलिए अदालत में मुकदमे दायर किया गया है। उन्होंने कहा कि चुनाव से पहले किए गए वादों में से 98 प्रतिशत पर अमल किया गया है और 30 लाख से ज्यादा बहनों को मकानों के पट्टे दिये गये हैं। उन्होंने कहा कि अमरावती में सप्ताह भर मकानों का पट्टा उत्सव का आयोजित किया जाएगा। हर लाभार्थियों को ले आउट पर ले जाया जाएगा और वहां उनकी फोटो ली जाएगी।

मुख्यमंत्री जगन ने कहा कि चार साल में बिना भ्रष्टाचार और भेदभाव के 2.11 लाख करोड़ की कल्याणकारी योजनाओं को सीधे डीबीटी के माध्यम से पात्र लोगों तक पहुंचाया गया है। उन्होंने कहा कि कोविड के कठिन समय में भी कहीं पर भी कोई समझौता नहीं किया और नवरत्नालु में दिये गेय हर वादे को लागू किया है। उन्होंने कहा कि चंद्रबाबू ने सभी समुदायों को धोखा दिया है और अब चुनाव नजदीक आते देख फिर से झूठे वादे करना शुरू किया। नरकासूर राक्षस पर भरोसा किया जा सकता है लेकिन नारा चंद्रबाबू पर भरोसा नहीं करना चाहिए। उन्होंने कहा कि 2014 से 2019 तक चंद्रबाबू ने एक व्यक्ति को भी पट्टा नहीं दिया है। उन्होंने कहा कि चंद्रबाबू एक बार फिर से कपटपूर्ण प्रेम दिखाने की तैयारी कर रहे हैं।

హైదరాబాద్: దేశ చరిత్రలోనే అరుదైన ఘట్టానికి అమరావతి (ఆంధ్ర ప్రదేశ్) వేదికైంది. పేదలకు ఇళ్ల ‘పట్టా’ భిషేకం జరిగింది. రాజధాని ప్రాంతంలో ఏకంగా 50,793 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన సభలో ‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇళ్ల పట్టాలను మహిళలకు అందజేశారు.

అమరావతి ప్రాంతంలో ఆర్‌–5 జోన్‌ ఏర్పాటుచేసి మొత్తం 1,402.58 ఎకరాల్లో 50,793 ప్లాట్లను సిద్ధం చేశారు. పట్టాలతో పాటుగా సీఆర్డీఏ ప్రాంతంలో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందజేశారు. మొత్తం 25 లే అవుట్లలో ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన 27,031 మందికి.. గుంటూరు జిల్లాకు చెందిన 23,762 మందికి. పట్టాలను పంపిణీ చేశారు.

దేశ చరిత్రలోనే ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉందని వ్యాఖ్యానించారు సీఎం జగన్. పేదలకు ఇళ్ల పట్టాలు వద్దని కోర్టులకెక్కి కొందరు దుర్మార్గులు, మారీచులు అడ్డుపడ్డారని ధ్వజమెత్తారు. పేదల కోసం సుప్రీంకోర్టులో ప్రభుత్వమే న్యాయపోరాటం చేసి సాధించామని ఇది పేదల విజయంగా అభిప్రాయపడ్డారు. ఈ 50,793మందికి రూ. ఏడు లక్షల నుంచి 10 లక్షల విలువ చేసే ఇంటి స్థలాన్ని మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేస్తున్నామని తెలిపారు. అమరావతి ఇక మీద సామాజిక అమరావతి అవుతుందని అందరి అమరావతి అవుతుందన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ జయంతి సందర్భంగా జులై 8న ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపడతామని ప్రకటించారు. ఇప్పటికే లే అవుట్లలో మౌలిక సదుపాయాలు పూర్తయ్యాయని జులై 8లోగా జియో ట్యాగింగ్‌ పూర్తి చేస్తామన్నారు. ఈ ఇళ్ల నిర్మాణాలకు మూడు ఆప్షన్లు ఉంటాయని సొంతగా ఇళ్లు కట్టుకుంటే రూ. లక్షా 80 వేలు బ్యాంకు ఖాతాల్లో వేస్తామని తెలిపారు. రెండో ఆప్షన్‌లో నిర్మాణ కూలీ మొత్తాన్ని జమ చేస్తామని ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితంగా ప్రభుత్వమే అందిస్తుందని ప్రకటించారు. స్టీల్‌, సిమెంట్‌, డోర్‌ ఫ్రేమ్‌లు సబ్సిడీపై అందిస్తామని మెటీరియల్‌ నాణ్యత విషయంలో రాజీ పడేది లేదన్నారు.

ఐదేళ్ల చంద్రబాబు పాలనంతా దోచుకో, పంచుకో, తినుకో మాత్రమే అని బాబు అనుకూల మీడియాకు తోడు దత్తపుత్రుడు ఉన్నారని ఇప్పుడు గజ దొంగల ముఠా అవుతుందన్నారు. పెత్తందార్లతో పేదవాడు పోరాటం చేయాల్సి వస్తుందని అమరావతిలో పేదవాడు ఉండకూడదని కోర్టులో కేసులు వేశారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేశామని 30లక్షలకు పైగా అక్కచెల్లెమ్మలకు పట్టాలు అందించామన్నారు. అమరావతిలో వారం పాటు ఇళ్ల పట్టాల పండగ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రతి లేఔట్‌ వద్దకు లబ్ధిదారులను తీసుకెళ్లి అక్కడే ఫొటో తీసుకుంటామన్నారు.

నాలుగేళ్లలో అవినీతి, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించామని డీబీటీ ద్వారా నేరుగా 2.11లక్షల కోట్లు అర్హులైన ప్రజలకు అందజేశామన్నారు. కోవిడ్‌ కష్టకాలంలోనూ ఎక్కడా రాజీ పడలేదని నవరత్నాల్లో ప్రతీ హామీని అమలు చేశామన్నారు. చంద్రబాబు మాత్రం అన్ని వర్గాలను మోసం చేశారని ఎన్నికలు రాగానే మళ్లీ మోసపూరిత హామీలు ఇస్తారన్నారు మోసం చేసే చంద్రబాబును నమ్మవద్దన్నారు. నరకాసురిడినైనా నమ్మొచ్చుకానీ నారా చంద్రబాబును నమ్మొద్దన్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఒక్క పట్టా కూడా ఇవ్వలేదన్నారు. మళ్లీ మోసపూరిత ప్రేమ చూపడానికి బాబు సిద్ధమవుతున్నారని విమర్శించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X