हैदराबाद : पार्टी के वरिष्ठ नेता व एमएलसी महेश कुमार गौड़ को तेलंगाना कांग्रेस का अध्यक्ष नियुक्त किया गया है। इस संबंध में पार्टी नेतृत्व ने शुक्रवार को आदेश जारी कर दिया। महेश कुमार गौड़ ने ताजा अपनी नियुक्ति पर प्रतिक्रिया दी है। इस आशय का एक बयान जारी किया है।
बयान में नये अध्यक्ष ने कहा, “मुझ पर अत्यधिक विश्वास करके टीपीसीसी अध्यक्ष की महत्वपूर्ण जिम्मेदारी सौंपने के लिए नेतृत्व को हार्दिक धन्यवाद। एआईसीसी सुप्रीम लीडर सोनिया गांधी, एआईसीसी अध्यक्ष मल्लिकार्जुन खड़गे, संसद में विपक्ष के नेता राहुल गांधी, एआईसीसी महासचिव प्रियंका गांधी, एआईसीसी महासचिव केसी वेणुगोपाल, एआईसीसी प्रभारी दीपादास मुंशी, मुख्यमंत्री रेवंत रेड्डी, उपमुख्यमंत्री भट्टी विक्रमार्क, मंत्री उत्तम कुमार रेड्डी, पार्टी के लिए विकास में महत्वपूर्ण भूमिका निभाने वाले मंत्रियों, सांसदों, एमएलसी, विधायकों, डीसीसी अध्यक्षों, नेताओं और कार्यकर्ताओं को मेरा हार्दिक धन्यवाद।”
अध्यक्ष ने कहा आगे कहा, “पार्टी द्वारा सौंपी गई इस बड़ी जिम्मेदारियों को ईमानदारी और समर्पण से निभाकर पार्टी को मजबूत करूंगा। वह कार्यकर्ताओं और नेताओं के लिए लगातार उपलब्ध रहेंगे और पार्टी तथा सरकार के साथ मिलकर काम करेंगे राज्य के विकास और पार्टी की मजबूती के लिए काम करेंगे। उन नेताओं और कार्यकर्ताओं को धन्यवाद जिन्होंने हर तरह से मेरा समर्थन किया। मैं उन सभी का आभारी हूं जिन्होंने मुझे यह पद दिलाने में मदद की है।”
संबंधित खबर-
తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఫస్ట్ రియాక్షన్
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ నియామకం అయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఆ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా తన నియామకంపై మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
‘నాపై అత్యంత నమ్మకంతో నాకు కీలకమైన టీపీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి హృదయ పూర్వక ధన్యవాదాలు. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, పార్లమెంట్ ప్రతి పక్ష నాయకులు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సి వేణుగోపాల్, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు, డీసీసీ అధ్యక్షులకు, పార్టీ కోసం అనునిత్యం పాటు పడుతున్న నాయకులకు, కార్యకర్తలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.’
‘పార్టీ అప్పగించిన ఈ గొప్ప బాధ్యతలను చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేస్తాను. నిరంతరం కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసి రాష్ట్రాభివృద్ధికి, పార్టీ పటిష్టతకు కృషి చేస్తా. ఇంతకాలం నాకు అన్ని రకాలుగా సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు. నాకు పదవి రావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు’ అని మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటన విడుదల చేశారు. (ఏజెన్సీలు)
గాంధీభవన్ లో సంబరాలు

టీపీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ని నియమించడం పట్ల గాంధి భవన్ లో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడితే పదవులు దక్కుతాయని చెప్పడానికి మహేష్ నియాకమమే చక్కటి ఉదాహరణ అంటూ కాంగ్రెస్ అధిష్టానికి ధన్యవాదాలు తెలుపుతూ స్వీట్లు పంచుకున్న కాంగ్రెస్ శ్రేణులు.

చామల కిరణ్ కుమార్ రెడ్డి శుభాకాంక్షలు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షులుగా ఏఐసీసీ మహేష్ కుమార్ గౌడ్ ను నియమించడం పట్ల భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడితే పదవులు దక్కుతాయని చెప్పడానికి మహేష్ కుమార్ గౌడ్ గారి నియాకమమే చక్కటి ఉదాహరణ అని అన్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమీటీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం పట్ల మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ కు మంత్రి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వం, మహేష్ కుమార్ నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ మరింత బలపడుతుందని అన్నారు. ఆయనకున్న అనుభవం, సిద్ధాంతాలు పార్టీకి ఎదుగుదలకు సాయపడతాయనీ పేర్కొన్నారు.
ఎంపీ మల్లు రవి శుభాకాంక్షలు
మహేష్ కుమార్ గౌడ్ కు పీసీసీ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మల్లు రవి. కాంగ్రెస్ పార్టీ లో క్రియాశీలకంగా పని చేసిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కు టీపీసీసీ పదవి దక్కడం పార్టీ విధేయతకు ఇచ్చిన గౌరవం. నూతన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు. మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నాం.
మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు
పిసిసి అధ్యక్షుడు గా నియామకమైన మహేష్ కుమార్ గౌడ్ కి హృదయ పూర్వక శుభాకాంక్షలు. రాష్ట్ర కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా నియమింపబడ్డ మహేష్ కుమార్ గౌడ్ కి నా హృదయపూర్వక అభినందనలు.NSUI నుండి చాలా కాలంగా పార్టీలో పని చేస్తూ ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎదిగిన వారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు. వారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో రేవంత్ గారి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి తీసుకుపోవడమే కాకుండా పార్టీ పటిష్ఠతకు రాబోయే అన్ని రకాల ఎన్నికలకు సంబంధించి నాయకత్వం వహించి ముందుకు తీసుకుపోతారని ఆశిస్తున్న.పార్టీ బలహీన వర్గాలకు సంబంధించి సముచిత స్థానం ఇవ్వడంలో తగిన ప్రాధాన్యత ఇస్తారని ఆశీస్తూ శుభాకాంక్షలు.
G. Niranjan, TPCC Sr. Vice-President & Chairman, Election Commission Coordination Committee
కాంగ్రేస్ పార్టీ లో NSUI అధ్యక్షుడిగా, వివిద హోదా లలో పనిచేస్తూ, పి సి సి, వర్కింగ్ ప్రెసిడెంట్, organisation ఇంచార్జీ గా విశిష్ట సేవలను అందించిన మహేష్ కుమార్ గౌడ్ ను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడుగా నియమించిన కాంగ్రేస్ అధిష్టానం నకు ధన్యవాదాలు. వెనుకబడిన వర్గాలకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ ను పి సి సి అధ్యక్షుడుగా నియమించడం, కాంగ్రెస్ పార్టీ కి బిసి ల పట్ల ఉన్న నిబద్ధత కు నిదర్శనం. మహేష్ కుమార్ గౌడ్ కు హృదయ పూర్వక అభినందనలు తెలుపుతూ ఆయన ఆధ్వర్యంలో పార్టీ మరింత పటిష్టం అవుతుంది అనే సంపూర్ణ విశ్వాసం ఉన్నది.
Thanks to the Congress leadership for appointing Mahesh Kumar Goud as the State Congress President, who has served as NSUI president and worked in various capacities. As PCC, working president, organization in-charge his services are remarkable. The appointment of Mahesh Kumar Goud, who belongs to the backward communities, as the president of the PCC is a proof of the Congress party’s commitment towards the BCs. Heartfelt congratulations to Mahesh Kumar Goud and we have full confidence that the party will become stronger under his leadership.
