హైదరాబాద్: ప్రముఖ కవులు కవియాత్ర వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు కవి కారం శంకర్, కవియాత్ర ప్రధాన కార్యదర్శి, వ్యాఖ్యాత బి. వెంకట్, సూర్యాపేట జిల్లా నడిగూడెంలోని జాతీయ పతాకం రూపశిల్పి పింగళి వెంకయ్య రూపకల్పన జేసిన, గ్రంథాలయ ఉద్యమమునకు రూపునిచ్చిన కొమర్రాజు లక్ష్మణరావు నివసించిన రాజావారి కోటలో ఆంద్రప్రదేశ్ జానపద అకాడమీ పూర్వ చైర్మన్ పొట్లూరి హరికృష్ణ, ముఖ్య అతిథిగా హాజరుకాగా సిలివేరు సాహితీ సేవా కళాపీఠం అధ్యక్షులు సిలివేరు లింగమూర్తి, ఆధ్వర్యంలో ఆదివారవాము (11వ ఫిబ్రవరి) నిర్వహించిన కవి యాత్రలో సినీ గేయ రచయిత సాధనాల వెంకట్ స్వామి నాయుడు పాల్గొన్నారు.
ప్రేమ శాంతి జ్ఞానం అనే అంశంపై కవులు, రచయితలు కవితలను చదివి వినిపించారు. కోదాడలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి కవియాత్ర ప్రారంభమైనదని, కోమరబండ, ఆకుపాముల, ముకుందాపురం, సరికొత్త గూడెం, మునగాల, కృష్ణానగర్, నడిగూడెం డాక్రి సంస్థ వరకు కవియాత్ర వరకు కొనసాగిన ఈ కవియాత్రలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కవులు 70 మంది కవులు పాల్గొన్నారని సిలువేరు సేవ కళా పీఠం అధ్యక్షులు సిలువేరు లింగమూర్తి తెలిపారు. ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రాల కవులు వారిదైనా సాహితీ పాత్రను పోషించారు. అక్కడి నాలుగు కూడళ్ళు మధ్యలో, ప్రజల మధ్యలో, కవితాగానం జేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, హైదరాబాదు, అమలాపురం, విజయవాడ, విజయనగరం, విశాఖపట్టణం, వరంగల్ తదితర ప్రాంతాల నుండి కవులు, కవయిత్రులు, కళాకారులు తదితరులు పాల్గొని కవితలను ఆసక్తి గా వినిపించారు.
కోదాడ కవియాత్రలో సిరికొండ నరసింహారాజు రచించిన తల్లడిల్లే తల్లివేరు కవితా సంపుటి, ముక్కామల జానకీరాం రచించిన ఆఫ్ లైన్ బాలల కథల సంపుటిని పొట్లూరి హరికృష్ణ ఆవిష్కరించారు. కోదాడ నుండి నడిగూడెం రాజావారి కోట వరకు జరిగిన 6 వ కవియాత్ర శాంతియుతంగా, ఆహ్లాదకరంగా జరిగిందని చెప్పారు. కోదాడలోని తేజం విద్యాలయమునకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు కవియాత్రకు ఘనమైన స్వాగతం పలికారు. అనంతరం తేజ విద్యాలయంలో కవులకు అభినందన సభను నిర్వహించారు. తేజ విద్యాలయ విద్యార్థినులు ఈ కవియాత్రలో పాల్గొనడం విశేషం. కవులందరిని ఆత్మీయ సన్మానాలను, ప్రశంసాపత్రాలను అందజేశారు. కోదాడ సిలివేరు సాహితీ సేవా సంస్థ అధ్యక్షులు సిలివేరు లింగమూర్తి పూర్తి సహకారము అందించారని చెప్పారు. అట్లే డాక్రి సంస్థ అధ్యక్షులు కుర్ర జితేంద్రబాబు, కోదాడ రచయితల సంఘం అధ్యక్షులు పుష్పాల కృష్ణమూర్తి, కోశాధికారి శ్రీనివాసరావులు పూర్తి సహకారము అందించారని చెప్పారు.
ఇది కూడా చదవండి:
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ నుండి నడిగూడెం వరకు ప్రేమ శాంతి జ్ఞానం అనే అంశంపై కవియాత్ర ఎంతో ఆసక్తికరంగా కొనసాగిందని ఎస్. శ్రీనివాస్ అన్నారు. రమ్య భారతి సంపాదకులు, కవి, రచయిత చలపాక ప్రకాష్ అతిథిగా పాల్గొన్నారు. విజయవాడ రచయితల సంఘం అధ్యక్షులు చదలవాడ ప్రకాశ్ రావు,ఖమ్మం సాహితీ సంస్థలు కవులు, హైదరాబాదు అక్షర కౌముది సాహితీ సంస్థ అధ్యక్షులు తులసి వెంకటరమణాచారి, ప్రముఖ నటులు, కవి డా. ఆలూరి విల్సన్, పిల్లలమర్రి పినవీరభద్ర గ్రంథాలయం అధ్యక్షులు అవిలేను, ప్రముఖ కవి అబ్దుల్ రషీద్ తదితరులు ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు.