కోదాడ నుండి నడిగూడెం వరకు కవియాత్ర, సామాజిక చైతన్యమే లక్ష్యం, పోస్టర్లు ఆవిష్కరణ

హైదరాబాద్: సూర్యాపేట జిల్లా కోదాడ నుండి నడిగూడెం వరకు సాగే కవియాత్ర పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇదే క్రమములో నిర్మల్ (తెలంగాణ) నర్సింగ్ హోం లో ఏర్పాటు చేసిన కోదాడ కవియాత్ర పోస్టర్లు (గోడ ప్రతులు) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ దామెర రాములు మాట్లాడుతూ సామాజిక చైతన్యం కోసమే కవియాత్ర పుట్టిందని అన్నారు. జాతీయ కవియాత్ర వ్యవస్థాపక అధ్యక్షులు కారం శంకర్ మాట్లాడుతూ సమాజంలోని అజ్ఞాన తిమిరాలని కవి యాత్ర ద్వారా తొలగించడం సాధ్యమన్నారు అన్నారు.

ప్రేమ, శాంతి, జ్ఞానాన్ని పంచడమే కవియాత్ర లక్ష్యమని ప్రధాన కార్యదర్శి, వ్యాఖ్యాత బి. వెంకట్ అన్నారు. ఈ కార్యక్రమంలో డా. దామెర రాములు, డా. ఉప్పు కృష్ణంరాజు, డా. వేణుగోపాలకృష్ణ, పత్తి శివప్రసాద్, నేరెళ్ల హన్మంతు, అంబటి నారాయణ, పోలిస్ భీమేశ్, కారం శంకర్, శ్రీమతి నివేదిత న్యాయవాది, బి. వెంకట్ కవి పాల్గొన్నారు.

ఈ నెల 11 వ తేది (ఆదివారము) తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ నుండి నడిగూడెం వరకు కొనసాగే కవియాత్ర కరపత్రాలను నిర్మల్ లోని దామెర సాహిత్య క్షేత్రంలో ఆవిష్కరించిన అనంతరం వక్తలు మాట్లాడారు. వారు మాట్లాడుతూ ప్రజల వద్దకు వెళ్లి వారి మధ్యన కవిత్వం వినిపించడం దీని ప్రత్యేకత అని కవులు, రచయితలు, సమాజ సేవకులు, శ్రేయోభిలాషులు చట్టాన్ని గౌరవించే వావరైనా సరే ఇందులో నిరభ్యంతరంగా పాల్గొనవచ్చని ఎలాంటి ప్రవేశ రుసుము చెల్లించే అవసరంలేదని కవియాత్ర జాతీయ చైర్మన్, న్యాయవాది నివేదిత అన్నారు.

కవియాత్ర ఆవిర్భావం 20019 తర్వాత ఎన్నో పేర్లతో రకరకాల యాత్రలు పుట్టుకొచ్చాయని ప్రధానంగా రాజకీయం, మొదలుకొని ఆధ్యాత్మిక యాత్రల దాకా చెప్పుకోవచ్చని అన్నారు. ఇది కవియాత్ర మాత్రమేనని, పాదయాత్ర కాదని అన్నారు. శాస్త్రీయ దృక్పథం కలిగిన కవియాత్ర అని అన్నారు.

సూర్యాపేట జిల్లా కోదాడలో కొనసాగే కవియాత్ర కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని, మార్గమధ్యలో కొన్ని పాయింట్లలో జనం మధ్య కవిత్వం చదువుతారని ఢాక్రీ సంస్థ అధ్యక్షులు కుర్రా జితేందర్ బాబు అన్నారు. కవియాత్రలో కవితలు చదివిన కవులకు, కళాకారులకు రుచికరమైన భోజనాలు ఏర్పాట్లు చేయబోతున్నామని, అక్షర ప్రేమికులందరూ సకాలంలో హాజరై కవియాత్రను విజయవంతం చేయాలని సిలువేరు లింగమూర్తి కోరారు.

గతంలో మొట్టమొదటి కవియాత్ర నిర్మల్ నుండి బాసర వరకు, రెండవ కవియాత్ర నిర్మల్ నుండి ఆసిఫాబాద్ వరకు, మూడవ కవియాత్ర ఆసిఫాబాద్ నుండి చెన్నూరు వరకు, నాల్గవ కవియాత్ర నిర్మల్ నుండి నిజామాబాద్ వరకు ఐదవ కవియాత్ర హైదరాబాద్ గన్ పార్క్, రవీంద్రభారతి నుండి గోల్కొండ ఫోర్ట్ దాకా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సారథ్యంలో అనేక సంస్థలను కలుపుకొని వందలాది కవులు, కవయిత్రులతో కవియాత్ర సంచలనంగా కొనసాగిందన్నారు.

ఇప్పుడు కోదాడ నుండి నడిగూడెం ఆరవ కవియాత్ర అవుతుందని, ఈ కవియాత్ర ఇది వరకు జరిగిన కవియాత్రలానే వుంటుందని, కోదాడ నుండి పింగళి వెంకయ్య జాతీయ జెండాకు రూపకల్పన చేసిన చారిత్రక ప్రదేశం నడిగూడెం వరకు జరిగే ఈ కవియాత్రకు సిలివేరు లింగమూర్తి, సిలివేరు సాహితీ సంస్థ తరపున, డాక్రీ సంస్థ తరపున అధ్యక్షులు కుర్ర జితేందర్ బాబు పూర్తి సహకారం అందిస్తున్నారని అన్నారు.

పుస్తకావిష్కరణలు వుంటాయని, సూర్యాపేట జిల్లాలో కవియాత్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారని అన్నారు. కవియాత్ర సమాజంలో ప్రేమ-శాంతి-జ్ఞానం కోసం చేసే అక్షర మహాయజ్ఞం. ఇది నిరంతరంగా నిర్విరామంగా కొనసాగే ప్రక్రియయని కవియాత్ర ముగింపులేనిదని నిర్వాహకులు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X