हैदराबाद: भारत राष्ट्र समिति पार्टी (बीआरएस) के विस्तार के तहत रविवार को महाराष्ट्र के नांदेड़ शहर में होने वाले जनसभा के लिए सब कुछ तैयार है। बीआरएस के नेताओं ने मंच में भव्य रूप से सजाया है। हालांकि इस जनसभा से चंद किलोमीटर दूर भूकंप आने की घटना चर्चा का विषय बन गई है। बीआरएस के मुख्यमंत्री केसीआर की जनसभा से 60 किमी दूर रविवार सुबह भूकंप आया।
पिछले दिनों महाराष्ट्र में लातूर भूकंप की घटना से सभी वाकिफ हैं। ताजा भूकंप हिंगोली जिले में आया है जो उसी बेल्ट में है। अधिकारियों ने पाया कि भूकंप का केंद्र उस जिले का नांदापुर है। रिक्टर पैमाने पर इसकी तीव्रता 3.1 बताई जा रही है। बताया जाता है कि भूकंप का असर सुबह करीब 8 बजे के करीब था और इसके झटके करीब 25 मिनट तक रहे हैं।

कहा गया है कि इस भूकंप का असर हिंगोली जिले के आसपास के इलाके वाले नांदेड़, लातूर, जालना, परभणी और तेलंगाना के निजामाबाद और संयुक्त आदिलाबाद जिलों के पास देखा गया है। लेकिन अब सीएम केसीआर की जनसभा बेहद करीब भूकंप की घटना चर्चा का विषय बन गई है।
भूकंप सुबह आया। मगर उसका ज्यादा असर नहीं दिखाई नहीं दिया। भूकंप का असर ज्यादा नहीं होने से पार्टी के नेता और कार्यकर्ताओं ने राहत की सांस ली। फिर भी महाराष्ट्र के अधिकारियों और स्थानीय निवासियों ने कहा है कि इससे पहले भी नांदापुर के केंद्र में छोटे-छोटे भूकंप आए हैं।
दूसरी ओर, नांदेड़ शहर और बीआरएस जनसभा की ओर जाने वाली तमाम सड़कें किलोमीटर तक गुलाबी हो गई हैं। कतार में लगे बड़े-बड़े होर्डिंग, गुब्बारे और स्टीकर सभी को प्रभावित कर रहे हैं। इसी क्रम में तेलंगाना के मंत्री इंद्रकरण रेड्डी ने शनिवार को जनसभा परिसर का निरीक्षण किया। वहां चल रही व्यवस्थाओं का जायजा लिया। भारत राष्ट्र समिति महाराष्ट्र में अपनी पहली जनसभाआयोजित कर रही है। सीएम केसीआर के साथ इस बैठक में बड़ी संख्या में पार्टी के नेता शामिल हो रहे हैं। महाराष्ट्र के साथ-साथ अन्य राज्यों के नेता पार्टी में शामिल हो रहे हैं।
చర్చనీయాంశంగా మారింది భారత్ రాష్ట్ర సమితి పార్టీ సభకు కిలోమీటర్ల దూరంలో భూకంపం
హైదరాబాద్ : భారత్ రాష్ట్ర సమితి పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఆదివారం జరగబోయే సభకు సర్వం సిద్ధమైంది. సభాస్థలి వేదికను బీఆర్‌ఎస్ శ్రేణులు ఘనంగా ముస్తాబు చేశారు. అయితే ఈ సభకు ఇప్పుడు కొన్ని కిలోమీటర్ల దూరంగా భూకంపం రావడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్‌ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్న నాందేడ్ బహిరంగ సభకు 60 కిలోమీటర్ల దూరంలో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది.
గతంలో మహారాష్ట్రలోని లాతూర్ భూకంపం ఘటన అందరికీ తెలిసిందే. అదే బెల్ట్‌లో ఉన్న హింగోలి జిల్లాలో తాజాగా భూకంపం సంభవించింది. ఆ జిల్లాలోని నాందాపూర్ కేంద్రంగా భూకంపం సంభవించినట్లు అధికారులు గుర్తించారు. రిక్టర్ స్కేల్ పై 3.1 గా నమోదయినట్లు సమాచారం. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో భూకంపం సంభవించగా దాని ప్రకంపనల ప్రభావం సుమారు 25 నిమిషాల వరకు ఉన్నట్లు చెబుతున్నారు.
హింగోలి జిల్లా పరిసర ప్రాంతాలైన నాందేడ్, లాతూర్, జాల్న, పర్భని తెలంగాణలోని నిజామాబాద్ , ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల సమీపం దాకా దీని ప్రభావం కనిపించిందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న బహిరంగ సభకు అత్యంత సమీపంలోనే భూకంపం రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
భూకంపం ఉదయం సంభవించగా… దీని ప్రభావం పెద్దగా చూపలేదు. భూకంపం ప్రభావం ఏమంతగా లేకపోవడంతో పార్టీ శ్రేణులు ఊపీరి పీల్చుకున్నారు. అయితే నాందాపూర్ కేంద్రంగా గతంలోనూ స్వల్ప భూకంపాలు సంభవించినట్లు అధికార వర్గాలతో పాటు మహారాష్ట్ర వాసులు చెబుతున్నారు.
మరోవైపు బీఆర్ఎస్ సభతో నాందేడ్ పట్టణంతోపాటు సభ స్థలికి వెళ్లే దారులన్నీ కిలోమీటర్లమేర గులాబీ మయమయ్యాయి. అక్కడ వరుస క్రమంలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు, బెలూన్లు, స్టిక్కర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు సభా స్థలిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శనివారం పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. మహారాష్ట్రలో తొలి సభను భారత రాష్ట్ర సమితి నిర్వహిస్తుండడం ఈ సభకు సీఎం కేసీఆర్‌తో పాటు భారీ సంఖ్యలో పార్టీ ప్రముఖులు హాజరు అవుతుండడం మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల ప్రముఖులు కొందరు పార్టీలో చేరుతున్నారు. (ఏజెన్సీలు)