BRAOU కాంట్రాక్టు అధ్యాపకులతో ప్రభుత్వం చర్చలు జరపాలి : వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి

హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న డా బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కాంట్రాక్టు అధ్యాపకులు ధర్నా చేస్తున్న డా బి ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రాంతానికి వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి వచ్చారు. ధర్నా లో ఉన్న కాంట్రాక్టు అధ్యాపకులకు తన సంఘీభావాన్ని ప్రకటించారు. వారి న్యాయమైన డిమాండ్లను సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని వీసీ ప్రో ఘంటా చక్రపాణి హమీ ఇచ్చారు. ప్రొ. చక్రపాణి మాట్లాడుతూ కాంట్రాక్టు అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వం తక్షణమే స్పందించి వారితో చర్చలు జరపాలని సూచించారు. వారి సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని ప్రభుతవానికి సూచించారు.

Also Read-

డా బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘము అధ్యక్షుడు డా. కె. అవినాష్, ప్రధాన కార్యదర్శి డా. ఎం. కిషోర్, సలహాదారులు డా. కె యాదగిరి, డా. కాసం విజయ్, ఉపాధ్యక్షురాలు కె. ఉమాదేవి, సంయుక్త కార్యదర్శి డా. పి. రాధాకృష్ణ, కోశాధికారి డా. వై. కుమార్, కాంట్రాక్టు అధ్యాపకులు డి. కోటేశ్వర రావు, డా. పడాల లక్ష్మణ్, డా. సునీల్ కుమార్, డా. విజయ ఉషశ్రీ , డి శ్రీవేణి, డా. అరుణ సిద్ధాంతి, డా. కురుమేటి దయాకర్, నర్సయ్య భట్టు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X