सीडब्ल्यूसी ने पारित किया 14 सूत्री प्रस्ताव, इनमें यह हैं खास

हैदराबाद: कांग्रेस कार्य समिति (सीडब्ल्यूसी) ने 14 सूत्री प्रस्ताव पारित किया है। शनिवार को हुई अपनी दो दिवसीय बैठक के पहले दिन यह प्रस्ताव पारित किया है। इसकी शुरुआत जम्मू-कश्मीर में आतंकियों से मुठभेड़ के दौरान शहीदों को श्रद्धांजलि दी गई है। साथ मल्लिकार्जुन खरगे के अध्यक्ष के रूप में एक साल के कार्यकाल और राहुल गांधी की भारत जोड़ो यात्रा की तारीफ की गई है। सीडब्ल्यूसी ने केंद्र सरकार से मांग की कि 18 सितंबर से शुरू हो रहे संसद के पांच दिवसीय विशेष सत्र में महिला आरक्षण विधेयक पारित किया जाए। प्रस्ताव में जातिगत जनगणना की मांग भी उठाई गई है और कहा गया है कि अनुसूचित जाति, अनुसूचित जनजाति और अन्य पिछड़े वर्गों (ओबीसी) के लिए आरक्षण की मौजूदा अधिकतम सीमा को बढ़ाया जाए।

कांग्रेस कार्य समिति ने आरोप लगाया गया कि भाजपा सरकार के आने के बाद से संसदीय बहस और स्क्रूटनी लगभग गायब ही हो गई है। कई महत्वपूर्ण और दूरगामी कानूनों को उचित स्क्रूटनी और चर्चा के बिना जल्दबाजी में पास कराया गया। संसद में पेश किया गया मुख्य चुनाव आयुक्त और अन्य चुनाव आयुक्त (नियुक्ति आदि) विधेयक स्वतंत्र एवं निष्पक्ष चुनाव कराने के लिए चुनाव आयोग की स्वतंत्रता से गंभीर समझौता करने वाला है। सीडब्ल्यूसी ने कहा कि सरकार कभी भी अचानक संसद का विशेष सत्र बुला लेती है।

कांग्रेस संसदीय दल की अध्यक्ष सोनिया गांधी ने प्रधानमंत्री को पत्र लिखकर सार्वजनिक चिंता और महत्व से जुड़े नौ गंभीर मुद्दों को उठाया, जिन पर इस विशेष सत्र में चर्चा की आवश्यकता है। कांग्रेस कार्यसमिति महिला आरक्षण बिल को संसद के इस विशेष सत्र में पारित करने की मांग करती है। जाति जनगणना की मांग उठाते हुए कहा कि पूरे देश से जाति जनगणना की मांग उठ रही है। इस मांग को मानने से भाजपा के इन्कार ने सामाजिक और आर्थिक न्याय के प्रति उसकी प्रतिबद्धता की कमी के साथ-साथ पिछड़े वर्गों, दलितों एवं आदिवासियों के प्रति उनकी सोच को सबके सामने ला दिया है।

सीडब्ल्यूसी ने एक प्रस्ताव में इंडियन नेशनल डेवलपमेंटल इन्क्लूसिव अलायंस (इंडिया) की निरंतर एकजुटता का स्वागत किया। समिति ने कहा कि विपक्षी गठबंधन की एकजुटता से प्रधानमंत्री और भाजपा बौखलाई हुई हैं। प्रस्ताव में कहा गया कि सीडब्ल्यूसी इंडिया की पहल को वैचारिक और चुनावी रूप से सफल बनाने के लिए कांग्रेस पार्टी के संकल्प को दोहराती है ताकि हमारा देश विभाजनकारी और ध्रुवीकरण की राजनीति से मुक्त हो, सामाजिक समानता और न्याय में विश्वास रखने वाली ताकतें मजबूत हों और लोगों को एक उत्तरदायी, संवेदनशील, पारदर्शी, जवाबदेह और जिम्मेदार केंद्र सरकार मिले।

इसी तरह एक अन्य प्रस्ताव में कहा गया कि सीडब्ल्यूसी सांप्रदायिक एकता, सामाजिक, आर्थिक समानता, नौजवानों की अपेक्षाओं व एक सशक्त भारत की गौरव यात्रा में देशवासियों के साथ मजबूती से खड़ी है। कार्यसमिति यह प्रण लेती है कि वह एक ऐसे देश का निर्माण करेगी जिसमें हर जाति व धर्म के लोग, अमीर, गरीब, नौजवान और बुजुर्ग सब गौरवान्वित महसूस करें। सीडब्ल्यूसी ने बढ़ती बेरोजगारी और विशेष रूप से आवश्यक वस्तुओं की कीमतों में लगातार वृद्धि पर गंभीर चिंता व्यक्त की। कहा कि वादे के अनुसार हर साल दो करोड़ नौकरी देने में विफल रहने के बाद प्रधानमंत्री का तथाकथित रोजगार मेला तमाशा के अलावा कुछ नहीं है। यह पूरी प्रक्रिया सिर्फ और सिर्फ धोखा है।

कांग्रेस कार्य समिति ने मोदी सरकार को एमएसपी और अन्य मांगों के मुद्दों पर किसानों एवं किसान संगठनों से किए गए वादों की याद दिलाई। कहा कि किसान बढ़ते कर्ज के बोझ तले दबे हुए हैं। कृषि और ग्रामीण अर्थव्यवस्था गहरे संकट में है। नोटबंदी की मार और सरकार से किसी भी तरह का सपोर्ट न मिलने के कारण एमएसएमई सबसे खराब दौर में हैं। एक्सपोर्ट मार्केट सिकुड़ गया है और निर्यात में गिरावट आई है। निवेश और उपभोग का इंजन मंद पड़ा हुआ है। सरकार अर्थव्यवस्था को पुनर्जीवित करने में विफल रही है। आर्थिक परिदृश्य निराशाजनक बना हुआ है। ऐसा लगता है कि इस सरकार की एकमात्र चिंता सिर्फ हेडलाइन मैनेजमेंट है।

समिति ने अदाणी कारोबारी समूह के लेनदेन पर अबतक हुए और अभी भी लगातार हो रहे गंभीर एवं चौंकाने वाले खुलासों की जांच के लिए जेपीसी की मांग दोहराई। कहा कि अदाणी समूह प्रधानमंत्री की घनिष्ठ मित्रता और सरकार की पक्षपातपूर्ण नीतियों एवं प्रशासनिक उदारता का प्रमुख लाभार्थी रहा है।

दूसरी ओर सीडब्ल्यूसी ने कहा कि एक देश, एक चुनाव का प्रस्ताव देश के संघीय ढांचे पर एक और हमला है। मोदी सरकार ने राज्यों के कर राजस्व हिस्सेदारी में कमी कर, राज्यपाल के कार्यालयों का दुरुपयोग कर, विपक्षी दलों के शासित राज्यों में योजनाओं और कार्यक्रमों को लागू करने में बाधाएं उत्पन्न कर सुनियोजित ढंग से संघवाद को कमजोर कर दिया है। केंद्र ने विपक्षी राज्यों को इमरजेंसी फंड और आपदा राहत देने से भी इन्कार किया है। हिमाचल इसका प्रत्यक्ष उदाहरण है, जहां बाढ़ और भूस्खलन से काफी नुकसान पहुंचा है।

इसी क्रम में सीडब्ल्यूसी ने प्रस्ताव में कहा कि वह स्पष्ट शब्दों में चीन के भारतीय क्षेत्र में घुसपैठ और नक्शे में अरुणाचल प्रदेश तथा भारत के अन्य हिस्से को शामिल करने जैसी उकसावे की नीति की निंदा करती है। यह बेहद अफसोसजनक है कि 19 जून, 2020 को चीन को क्लीनचिट देकर और भारतीय क्षेत्र पर कब्जे की बात से इन्कार कर प्रधानमंत्री ने देश को गुमराह किया। उनका वह बयान न सिर्फ हमारे जवानों की शहादत का अपमान है बल्कि उससे चीन को सीमा का उल्लंघन जारी रखने के लिए भी प्रोत्साहन मिला है। समिति सरकार से चीन के साथ सीमा विवाद पर स्थिति स्पष्ट करने और भारतीय क्षेत्र की अखंडता सुनिश्चित करने के लिए किसी भी चुनौती के खिलाफ मजबूत रुख अपनाने की अपील करती है। (एजेंसियां)

సీడబ్ల్యూసీ మీటింగ్‌లో 14 తీర్మానాలు

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డిమాండ్ చేసింది. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ విధానం రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలిగించేదని, సహకార సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించింది. కేంద్రం చట్టాలను ఉల్లంఘిస్తున్నదని, రాష్ట్రాల డివొల్యూషన్ (పన్నుల్లో వాటా)ను తగ్గించేస్తున్నదని ఆరోపించింది. గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తు్ందని, విపత్తు నిర్వహణ నిధిపై పెత్తనం చెలాయిస్తున్నదని విమర్శించింది. ప్రజలను వాస్తవిక సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల పేరుతో హడావిడి చేస్తున్నదని వ్యాఖ్యానించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లు తీసుకొచ్చి దాని స్వయం ప్రతిపత్తిని దెబ్బ తీస్తున్నదని ఆరోపించింది.

హైదరాబాద్‌: సీడబ్ల్యూసీ సమావేశంలో మొత్తం 14 తీర్మానాలను ఆమోదించింది. బీసీ జన గణన చేపట్టాలని, నిష్పత్తి ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అప్పర్ రిజర్వేషన్ లిమిట్‌ను పెంచాలని డిమాండ్ చేసింది. జనాభా లెక్కల సేకరణను చేపట్టకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించి ఇప్పటికీ 2011 లెక్కలే ప్రామాణికం కావడంతో దాదాపు 14 కోట్ల మంది రేషన్ కార్డులు పొందలేకపోయారని, ప్రభుత్వం నుంచి రేషను సరుకులు అందుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించింది. పార్లమెంటులో చర్చలు జరగకుండా ఏకపక్ష విధానాలను అవలంబిస్తూ ప్రజాస్వామిక స్వభావాన్ని నీరుగారుస్తున్నదని ఆరోపించింది. ప్రజాస్వామిక మూల సూత్రాలను తుంగలో తొక్కుతూ రాష్ట్రాల హక్కులను హరిస్తున్నదని పేర్కొన్నది.

14 తీర్మానాలు

జమ్ము కశ్మీర్‌లో ఉగ్రదాడిలో భారత జవాన్లు చనిపోవడం బాధాకరం. ఇలాంటి సమయంలో ప్రధాని, ప్రభుత్వ పెద్దలు జీ20 విజయోత్సవాల్లో మునిగిపోవడం దేశానికి అవమానకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.

ఏఐసీసీ అధ్యక్షుడిగా ఏడాదిగా పనిచేస్తున్న మల్లికార్జున్ ఖర్గే సేవలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆయన చేస్తున్న కృషికి అభినందనలు.

భారత్ జోడో యాత్రతో దేశ ప్రజలను ఏకం చేయగలుగుతున్నాం. జాతీయ రాజకీయాల్లో మార్పునకు నాంది పలికాం. విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా పోరాడే వారిని ఐక్యం చేయగలిగాం. పెరుగుతున్న అసమానతలు, పడిపోడుతున్న తలసరి ఆదాయం, పెరుగుతున్న నిరుద్యోగం, ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ప్రజాస్వామిక వ్యవస్థలను ఆక్రమించడం, సహకార సమాఖ్యపై దాడులు, ప్రతిపక్ష నేతలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించడం, రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడడం, నియంతృత్వ విధానాలు పెరిగిపోవడం.. ఇలాంటివాటన్నింటికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నవారిని ఐక్యం చేయగలుగుతున్నాం.

మణిపూర్‌లో శాంతిభద్రతలు చేయిదాటిపోయాయి. రాజ్యాంగ వ్యవస్థ స్థంభించిపోయింది. వివిధ జాతులు, గ్రూపుల మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని, హోంమంత్రి వైఫల్యమే కారణం. మణిపూర్ నుంచి అశాంతి ఈశాన్య రాష్ట్రాలకు పాకుతోంది. కేంద్ర పారామిలిటరీ బలగాలకు, రాష్ట్ర పోలీసులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. శాంతిని నెలకొల్పడం తక్షణావసరం. ఇప్పటివరకు ప్రధాని ఆ రాష్ట్రంలో పర్యటించ లేదు. ముఖ్యమంత్రిని తక్షణం బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలి.

కులం, మతం, ప్రాంతీయ విభేదాలను నిర్మూలిస్తామంటూ ప్రధాని మోదీ తన తొలి పంద్రాగస్ట్ ప్రసంగంలో పేర్కొన్న దానికి విరుద్ధంగా తొమ్మిదేళ్ల పాలనలో మరింత పెరిగేలా వ్యవహరించారు. విద్వేష ప్రసంగాలు, విచ్ఛిన్నకర శక్తుల హింసా కార్యకలాపాలను కేంద్రం పెంచి పోషిస్తున్నది. తొలి ప్రధాని నెహ్రూ కృషిని ఉద్దేశపూర్వకంగానే చిన్నచూపు చూస్తుంది. దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రతీకారంతో ఉసిగొల్పుతుంది. సహకార సమాఖ్య సూత్రాలను ఉల్లంఘిస్తుంది. వీటికి వ్యతిరేకంగా పోరాటాలను కొనసాగించాలి.

ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తానని ప్రగల్బాలు పలికిన ప్రభుత్వం ఇప్పుడు రోజ్‌గార్ మేళాలతో కంటితుడుపు చర్యలకు పాల్పడుతుంది. వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోడానికి ఈ తంతుకు శ్రీకారం చుట్టింది. ధరల పెరుగుదల నియంత్రణకు తీసుకున్న చర్యలు శూన్యం. జన గణన చేపట్టకపోవడం వైఫల్యం మాత్రమే కాక సిగ్గుచేటు. వెనకబడిన తరగతుల, దళితుల, ఆదివాసీ-గిరిజనుల పట్ల వ్యతిరేక స్వభావానికి ఇది నిదర్శనం. సామాజిక, ఆర్థిక అసమానతలను పరిగణనలోకి తీసుకుని అప్పర్ రిజర్వేషన్ లిమిట్‌ను పెంచాలి.

రైతులకు కనీస మద్దతు ధర లభించడంలేదు. వారి సంక్షేమం, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కేంద్రం నుంచి తగిన సహకారం అందడంలేదు. వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. నోట్ల రద్దుతో ఎంఎస్ఎంఈ రంగం నిర్వీర్యమైంది. ఎగుమతులు తగ్గిపోయాయి. ఆర్థిక రంగం కోలుకునే దిశగా చర్యలు లేవు. వీటిని గాడిలో పెట్టేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం.

రాజ్యాంగాన్ని పునర్ నిర్మించాలన్న ప్రయత్నాన్ని సీడబ్ల్యూసీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగ మూల స్వభావాన్ని, పునాదిని దెబ్బతీసే ప్రయత్నాలు ఏ రూపంలో ఉన్నా దానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయం తీసుకున్నాం. అన్ని ప్రజాస్వామిక శక్తులతో కలిసి ఐక్య పోరాటాన్ని చేపట్టాలి.

పార్లమెంటులో చర్చల సందర్భంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా, ప్రభుత్వ బిల్లులపై కనీస చర్చ లేకుండా, స్క్రూటినీ జరిపే పరిస్థితి లేకుండా కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణిని అమలు చేస్తున్నది. ఎలక్షన్ చీఫ్ కమిషనర్, ఇతర కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును పెట్టడం ద్వారా ఆ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయకుండా చూస్తున్నది. స్పెషల్ సెషన్‌లో మహిళా బిల్లును ప్రవేశపెట్టి చర్చించి ఆమోదింపజేయాలని డిమాండ్ చేస్తున్నాం.

వన్ నేషన్.. వన్ ఎలక్షన్ విధానం రాష్ట్రాల హక్కులకు విఘాతం కలిగిస్తుంది. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రాలకు పన్నుల వాటాను కేంద్రం తగ్గించింది. కర్ణాటకకు బియ్యం కోటాను నిరాకరించింది. హిమాచల్‌ప్రదేశ్ వరదలకు విపత్తు నిర్వహణ నిధులు ఇవ్వకుండా ఇబ్మంది పెడుతున్నది. రాష్ట్రాల హక్కులను హరించడాన్ని ఖండిస్తున్నాం.

అరుణాచల్‌‌ప్రదేశ్‌లో చైనా ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. చైనా ఆక్రమణలు లేవంటూ 2020 జూన్ 19న చైనాకు ప్రధాని క్లీన్ చిట్ ఇచ్చారు. ఇది ఆ దేశానికి అడ్వాంటేజ్‌గా మారింది. భారత భూభూగాన్ని దురాక్రమించే ఆ దేశ చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. దేశ సరిహద్దు వివాదాలపై చైనాతో నిర్దిష్టమైన కార్యాచరణకు ప్రభుత్వం సిద్ధం కావాలి. దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలగకుండా చూడాలి.

దేశంలో యువత ఆకాంక్షలకు అనుగుణంగా మత సామరస్యం, సామాజిక, ఆర్థిక అంశాల్లో ప్రజలకు కాంగ్రెస్ అండగా నిలబడుతుంది. కుల-మత, పేద-ధనిక, చిన్న-పెద్ద తేడా లేకుండా దేశ పౌరులంతా శాంతియుత వాతావరణంలో జీవించే పరిస్థితులకు మద్దతు పలుకుతాం.

అదానీ వ్యాపారాల్లోని అవకతవకలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు అవసరం.

బీజేపీకి వ్యతిరేకంగా భావసారూప్యత కలిగిన పార్టీలతో ‘ఇండియా’ కూటమిగా సమిష్టిగా పోరాడతాం. భావజాలపరంగా ఐక్యంగా ఉంటూ ఎన్నికల పోరులో పైచేయి సాధిస్తాం. విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా సమిష్టిగా కొట్లాడతాం. సామాజిక సమానత్వం, న్యాయం కోసం బలపడతాం. కేంద్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి వ్యతిరేకంగా పోరాడతాం. ప్రజలకు జవాబుదారీగా ఉండే వ్యవస్థకు అండగా ఉంటాం. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X