కార్మికుడిగా మారిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహెచ్ హనుమంతరావు

హైదరాబాద్ : నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్మిస్తున్న స్వాతంత్ర్య ఉద్యమం ఉద్యమకారుల జ్ఞాపకార్థం మారక స్థూప నిర్మాణానికి హనుమంతరావు కూలీగా మరి కంకర సిమెంట్ను నెత్తిపై మోస్తూ కూలీలతో కలిసి పని చేశారు.

1947లో స్వాతంత్ర వచ్చిన అనంతరం శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో 1948లో కొంతమంది విద్యార్థులు జాతీయ జెండాను ఎగరవేసిన కారణంగా అప్పటి నవాబ్ ప్రైవేట్ సైన్యమైన రజాకారులు జెండా ఎగరవేసిన వారిని ప్రభుత్వ పాఠశాలలో కాల్చి చంపారు. వారి జ్ఞాపకార్థం బీహెచ్ హనుమంతరావు ఈ చరిత్రను తెలుసుకొని వారి స్మారకార్థం తుఫాను నిర్మించాలని గత మూడు సంవత్సరాలుగా ఆగస్టు 15వ తేదీన వల్లాల ప్రభుత్వ పాఠశాలకు వచ్చి వారికి నివాళులు అర్పిస్తున్నారు.

గత సంవత్సరం మృతి చెందిన వారి మారక తూపాన్ని నిర్మించి రాబోయే తరాలకు వారి త్యాగాన్ని తెలియజేసేలా చేస్తానని తన సొంత డబ్బులతో తూపాన్ని నిర్మించడానికి పూనుకున్నారు. ఈ రోజు సూపర్ నిర్మాణ ఫౌండేషన్ నిర్మాణానికి పీహెచ్ హనుమంతరావు గారు ఇసక కంకర సిమెంట్ను, తట్టలో వేసుకొని కూలీగా పని చేశారు.

Also Read-

హనుమంతరావు మోస్తున్న తటలో తక్కువ కంకర కూలీలు వేయడంతో నేను ఇంకా ముసలివాన్ని కాలేదు ఇంకా తట్టలో కంకర వేయండిరా బై అంటూ కట్టనిండా కంకరణ నింపించి నెత్తిపై కంకర తట్ట మోస్తూ ఫౌండేషన్ లో వేశారు. స్వాతంత్ర్య సమరయోధుల స్తూపంలో తాను కూలీగా పని చేసినందుకు గర్వంగా ఉందని హనుమంతరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఏ బాసిత్ కాంగ్రెస్ సందేశ్ గ్రామ సర్పంచ్ ఇంతియాజ్ ఎగ్ సర్పంచ్ అశోక్ రెడ్డి శంభుల శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X