TRS Women Leaders: ఎంపీ అరవింద్‌పై చర్యలు తీసుకొండి మహిళా కమిషన్‌, పోలీసులకు ఫిర్యాదు

हैदराबाद: टीआरएस महिला विंग की नेताओं ने टीआरएस एमएलसी कल्वाकुंट्ला के कविता पर निजामाबाद के सांसद धर्मपुरी अरविंद की टिप्पणी के खिलाफ कार्रवाई करने के लिए महिला आयोग और बंजारा हिल्स पुलिस स्टेशन में शिकायत दर्ज कराई है। शनिवार को महिला आयोग की अध्यक्ष सुनीता लक्षमारेड्डी से लिखित शिकायत की गई।

Hyderabad: టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పట్ల నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ చేసిన వ్యాఖ్యలపై చర్య తీసుకోవాలంటూ టీఆర్‌ఎస్ మహిళా విభాగం నాయకులు మహిళా కమిషన్‌కు, బంజారాహిల్స్​ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. శనివారం మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునితా లకా్ష్మారెడ్డికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

మహిళ పట్ల అసభ్యంతగా, అభ్యంతర కరంగా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించి మాట్లాడారని టీఆర్‌ఎస్ మహిళా నాయకులు ముక్తవరం సుశీలా రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సిటి సివిల్‌ కోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాలను దిక్కరించి అసభ్యంగా, అభ్యంతరంగా, అవమానించే విధంగా మాట్లాడారని ఫిర్యాదులో తెలిపారు. గతంలోనూ ఎంపీ అరవింద్‌ పిచ్చి పిచ్చిగా మాట్లాడారని తెలిపారు. భవిష్యత్‌లో తప్పుడు వ్యాఖ్యలు చేస్తే టీఆర్‌ఎస్ మహిళా నాయకులు ఉరుకొరని వారు హెచ్చరించారు.

చట్ట పరంగా పోలీసులు, మహిళా కమిషన్‌ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో సుశీలారెడ్డితో పాటుగా మహిళా నాయకురాళ్లు లీలా, సువర్ణా రెడ్డి, గీతా గౌడ్‌, ఉమావతి, ప్రభా రెడ్డి, సుజాతా గౌడ్‌, ప్రీతి రెడ్డి, పద్మ తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X