తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ లో ఘనంగా వేడుకలు, పరేడ్ గ్రౌండ్ లో…

హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సేవాదల్ చైర్మన్ జితేందర్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరగినాయి.

కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, అమీర్ అలీఖాన్, బలమురి వెంకట్, వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, మాజీ ఎంపీ లు అంజన్ కుమార్ యాదవ్, వి.హనుమంతరావు, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ లు నూతి శ్రీకాంత్, మెట్టు సాయి కుమార్, అజ్మత్, కొత్వాల్, తహర్ బీన్ అహ్మదాని తదితరులు పాల్గొన్నారు.

Also Read-

తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు: టిపిసిసిఅధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ స్వరాష్ట్ర సాధన

ఆరు దశాబ్దాల నిరీక్షణకు తెరదించిందీ కాంగ్రెస్‌ పార్టీ.

ఎన్నో ప్రాణత్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.

ఇంధిరమ్మ ఆశయాలకు న్యాయం జరిగిందీ తెలంగాణ ద్వారా.

పునర్నిర్మాణ దిశగా కాంగ్రెస్ పాలన

బీఆర్‌ఎస్ పదేళ్ల ఆర్థిక విధ్వంసాన్ని అధిగమిస్తూ…

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి మరియు సంక్షేమం బాటలో తెలంగాణ.

అభివృద్ధి, సంక్షేమం — రెండు కళ్ల సిద్ధాంతంతో పాలన సాగుతోంది.

సామాజిక న్యాయం – కాంగ్రెస్ సంకల్పం

శాస్త్రీయ కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్లు.

ఎస్సీ వర్గీకరణతో దేశానికే మార్గదర్శకం.

దేశవ్యాప్తంగా కుల సర్వే జరగాలన్న రాహుల్ గాంధీ ఆకాంక్ష.

ఒక్క ఏడాదిలోనే 65,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది

రాజీవ్ యవ వికాస్ ద్వారా 5 లక్షల యువతకు ఆర్థిక సాయం.

మహిళా సాధికారత దిశగా మహాలక్ష్మి పథకం ప్రారంభం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు – 50 లక్షల కుటుంబాలకు లబ్ధి.

రూ.500 గ్యాస్ సబ్సిడీ – 40 లక్షల కుటుంబాలకు ఉపశమనం.

రైతుల సంక్షేమం కోసం రూ. 21,000 కోట్ల రుణమాఫీ తో 25 లక్షల రైతులకు ఉపశమనం.

రూ.500 వరి బోనస్ తో సన్న బియ్యం ఉత్పత్తి పెరుగుదల.

2.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య దిగుబడితో దేశంలో ప్రథమ స్థానంలో తెలంగాణ.

అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్‌ నివాళి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తోంది. ఈ మేరకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌కు వెళ్లారు. అనంతరం అక్కడ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం సీఎం నేరుగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుగుతోన్న పరేడ్ గ్రౌండ్స్ కు వెళ్లారు. అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలను ప్రత్యేక అతిథులుగా జపాన్ బృందం హాజరైంది. పరేడ్ గ్రౌండ్స్‌లో పోలీసు కవాతు అనంతరం ఉత్తమ సేవలందించిన పోలీసు సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి మెడల్స్ అందజేయనున్నారు. ఆ తరువాత ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కట్టుబడి ఉన్నాం.. సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు సీఎం రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పత్యేక రాష్ట్ర సాధనలో అమరులైన వారి త్యాగాలను స్మరించుకున్నారు. ‘తెలంగాణను ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్నారు. 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగుపెట్టాం. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్‌ నినాదాన్ని ఇచ్చాం. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచేలా భవిష్యత్తు ప్రణాళికలు తీర్చిదిద్దుతున్నామని అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

పదేళ్లయినా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్స్‌లో మాట్లాడుతూ.. పదేళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని కామెంట్ చేశారు. దశాబ్దాలుగా పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. తాము అధికారం చేపట్టే నాటికి వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రాన్ని పునర్నిర్మంచే దిశగా అడుగులు వేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది తమ లక్ష్యమని అన్నారు. ఆడబిడ్డలకే ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నామని.. వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచితం ప్రయాణించే అవకాశం కల్పించామని తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. అన్నదాతలకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామి అన్నారు. వారికి ఉచిత విద్యుత్ కోసం ఏటా రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఆత్మీమ భరోసా ద్వారా రూ.12 వేలు సాయం చేస్తున్నామని గుర్తు చేశారు. మరోవైపు సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలోనూ తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలిచిందని సీఎం అన్నారు.

దేశానికి అన్నం పట్టే రైతన్నకు భూ సమస్యలు లేకుండా చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి. అందుకే తాము భూభారతిని అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ధరణి కొందరికి చుట్టమైతే.. భూభారతి ప్రజలకు రక్షణ చట్టమైందని ఆయన అభివర్ణించారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సలు నిర్వహిస్తున్నామని అన్నారు. అధికారులు నేరుగా అన్నదాతల ఇళ్లకే వెళ్లి వారి సమస్యలను పరిష్కరించే వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు.

దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని అన్నారు. ఏడాదిలోనే 60 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు. పెట్టుబడుల ద్వారా లక్ష మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించామని అన్నారు. ఉద్యగా భర్తీలో నిరుద్యోగుల విశ్వాసాన్ని చూరగొన్నామని పేర్కొన్నారు. యంగ్ ఇండియా స్కూల్స్ ద్వారా విద్యార్థులకు నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. దేశంలో కోట్లలో యువత ఉన్న ఒలింపిక్స్‌లో ఒక్క గోల్డ్ మెడల్ రాకపోవడం బాధకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X