“కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలనపై జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు, అబద్ధాల విజయోత్సవాలు”

హైదరాబాద్: బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలనపై మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలనపై జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు, అబద్ధాల విజయోత్సవాలు జరుపుకోవాలి.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఫసల్ భీమా యోజన పథకాన్ని అమలు చేయకపోవడంతో ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు వేలకోట్ల రూపాయలు నష్టపోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు అభయహస్తం పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలో వివిధ రకాల రైతు హామీలు ఇచ్చారు.

రైతు కూలీలలకు రూ.12వేలు రాలే…రైతు బీమా అమలు కాలే.. పది పంటలకు బోనస్ అన్నరు…ఒక్క పంటకు కూడా ఇయ్యలే.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు దీనికి సమాధానం చెప్పిన తర్వాత విజయోత్సవాలు జరపాలి. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండానే ఏ మొఖం పెట్టుకొని విజయోత్సవాలు నిర్వహిస్తున్నారో సమాధానం చెప్పాలి.

Also Read-

నిజాం షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్నరు.. ఇంతవరకు చేయలే. కేంద్రప్రభుత్వ సహకారంతో నిజామాబాద్ లో పసుపు పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వలన రైతులకు ఎంతో మేలు జరగనుంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పి..రైతులకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డిసెంబర్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు చేస్తున్న రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమించేలా కార్యక్రమాలు చేపడుతాం. కాంగ్రెస్ ఏడాది పాలనలో రైతులకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తాం. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఊ అంటే ఫాంఆయిల్ గురించే మాట్లాడుతున్నాడు. కానీ, కేంద్రం ఇస్తున్న రూ.10,500 సబ్సీడీ గురించి మాత్రం చెప్పడం లేదు. లగ్ పతి దీదీ యోజన పేరుతో ప్రధాని నరేంద్రమోదీ మహిళా సంఘాలకు సబ్సీడీలో డ్రోన్లు అందించి శిక్షణ ఇస్తుంటే… డ్రోన్ టెక్నాలజీని రాష్ట్ర ప్రభుత్వమే తెచ్చినట్టు తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతున్నారు.

రాష్ట్రంలో వ్యవసాయ పనిముట్లకు కేంద్రం ఇచ్చే సబ్సీడీని రాష్ట్ర ప్రభుత్వం అందినివ్వడం లేదు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని వ్యవసాయ పంటలకు అనుసంధానం చేస్తామన్నరు..ఇంతవరకు చేయలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఒప్పుకొని రాష్ట్ర రైతులకు మేలు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎరువుల మీద ఎకరాకు రూ.18వేల సబ్సీడీ అందిస్తోంది. ఉత్పత్తిని పెంచి రైతుల ఖర్చును తగ్గించడానికి నానో యూరియా, డీఏపీ ఇస్తోంది.

చిరుధాన్యాలను ప్రోత్సహించడానికి ఆర్థికసహకారం అందించే ప్రయత్నం నరేంద్రమోదీ ప్రభుత్వం చేస్తోంది. గత పది సంవత్సరాలలో ధాన్యానికి రూ.1000 పైగా మద్దతు ధరలు పెంచింది. కానీ ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యింది. కేంద్రప్రభుత్వం 2013-14లో ధాన్యం కొనుగోలుకు రూ.3వేల కోట్ల ఖరీదుతో వ్యవసాయ పంటలను ఖరీదు చేస్తే నేడు రూ.27వేల కోట్లు వెచ్చిస్తోంది. ఇన్ని చేస్తున్నా కూడా సరైన సమయంలో రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా విజయోత్సవాలు చేసుకునేందుకు సిద్ధమైంది.

రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోయినా తెలంగాణ ప్రజల అభివృద్ధే లక్ష్యం అని నరేంద్రమోదీ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తున్నది. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పార్లమెంటు సభ్యులు నిరంతరం చేసే కృషితోనే ఇతోదికంగా మన రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం సహకారం అందిస్తున్నది. గతంలో ప్రధాని నరేంద్రమోదీ వరంగల్ కు స్వయంగా వచ్చి రైల్వే వ్యాగన్ ఓవర్ హాలింగ్ యూనిట్ కి శంకుస్థాపన చేశారు. ఇది కేవలం వర్క్ షాపే కాదు….రైల్ ఇంజిన్లను కూడా ఇక్కడే తయారు చేస్తమని మోదీ చెప్పారు.

ఇటీవల కేంద్రం నుండి ఖాజీపేటలో రైల్ ఇంజిన్ ల ఉత్పత్తి, పెట్టెల తయారీ కోసం పూర్తి చర్యలు తీసుకొమ్మని రైల్వే జోనల్ మేనేజర్ కి ఆదేశాలు వచ్చాయి. దీని విషయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున, తెలంగాణ ప్రజల పక్షాణ ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి కోసం కేంద్రం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలోని రామప్ప ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు సాధించటానికి మోదీ ప్రభుత్వం కృషి చేసింది.

రామప్ప టూరిజం సర్య్యూట్ (Ramappa Region Sustainable Tourism Circuit) కోసం రూ. 73.74 కోట్ల నిధులు, సోమశిల పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టు (Somasila Wellness & Spiritual Retreat Nallamala)కు రూ. 68.10 కోట్ల నిధులు మంజూరు చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి, కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కొత్త ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెంది, స్థానికులకు మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కే అవకాశం ఉంది. కేంద్రం ఇంత అభివృద్ధి చేస్తున్నా కూడా…రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వాళ్లే చేస్తున్నట్టు గప్పాలు కొట్టుకోకుండా… కేంద్ర ప్రభుత్వం చేసే అభివృద్ధిని స్వాగతించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X