తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ దీనికి మాత్రం గంట సమయాన్ని అదనం

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్‌లో బార్లు, పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్ల వ్యాపార వేళలను అధికారులు నిర్ణయించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు సాధారణ సమయాన్ని ఇచ్చిన అధికారులు వీకెండ్‌లో మాత్రం గంట సమయాన్ని అదనంగా ఇచ్చారు.

సాధారణ రోజుల్లో హోటళ్లు, రెస్టారెంట్లను ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అనుమతిచ్చిన అధికారులు బార్ అండ్ రెస్టారెంట్లతో పాటు పబ్‌లకు ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 వరకు అనుమతి ఇచ్చారు. అయితే వీకెండ్‌ రోజుల్లో మాత్రం బార్ అండ్ రెస్టారెంట్లతో పాటు పబ్‌లకు అదనంగా మరో గంట అంటే ఒంటి గంట వరకు పర్మిషన్ ఇచ్చారు.

అయితే దుకాణాలకు మాత్రం అన్ని రోజుల్లోనూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అనుమతి ఇచ్చారు అధికారులు. కాగా మద్యం దుకాణాలకు కూడా ఎప్పటిలాగే అన్ని రోజుల్లోనూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మకాలు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే తాము నిర్ణయించిన సమయానికి దుకాణాలు రెస్టారెంట్లు, పబ్బులు తెరిచినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X