కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ గారి డిస్టిబొమ్మ దహనం

హైదరాబాద్ : నిన్న పార్లమెంట్ లో టీపీసీసీ అధ్యక్షులు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారు హిందీలో మాట్లాడితే కేంద్ర మంత్రి నిర్మల్ సీతారామన్ గారు అవమానించడం జరిగింది. ఈ రోజు హస్తినాపురం కాంగ్రెస్డి పార్టీ డివిజన్ అధ్యక్షులు దెంది శశిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ గారి డిస్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమం లో లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి గారు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మెరుగు రమేష్ రెడ్డి గారు, లింగోజిగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లారపు శ్రీను,నర్సింహా, శ్రీను నాయక్, సచిన్ నాయక్, లత గౌడ్, బ్రహ్మ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, క్కాంగ్రెస్ పార్టీ నాయకులు మెరుగు నారాయణ రెడ్డి, ధ్యాప కొండల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సాయి రాం రెడ్డి, గంగు రాం మరియు nsui నాయకులు పాల్గొన్నారు.

లింగోజిగూడ డివిజన్

లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయం లో సోమవారం మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ల మధ్య జరిగిన సంవాదం విషయం లో, ఈ రోజు హస్తినాపురం నందు లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యం లో నిర్వహించిన ధర్నా లో ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ గౌరవనీయులైన అనుముల రేవంత్ రెడ్డి గారిని హిందీ రాదని తోటి పార్లమెంటేరియన్ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అవమానించటం జరిగిందని, మా భావం ముఖ్యమా బాష ముఖ్యమా అని అడగటం జరిగింది. డాలర్ కి 66 రూపాయలు అయినప్పుడు ఐ.సి.యూ ఉంది అన్నారు మీరు మరి ఇప్పుడు డాలర్ 83 రూపాయలు అయ్యింది మార్చురీలో ఉందా అని రేవంత్ రెడ్డి గారు అడగటం జరిగింది అని అన్నారు.

దానికి సమాధానం చెప్పకుండా మీ బాషా కి తగ్గట్టుగా మీకు సమాధానం ఇస్తా అని అనటం కరెక్ట్ అని అడగటం జరిగింది నరేంద్ర మోడీ గారు యునైటెడ్ నేషనల్ లో మాట్లాడినపుడు వచ్చి రాణి ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నప్పుడు, వాలు అలాగే హేళన చేస్తున్నారా అని అడగటం జరిగింది. ప్రజలు లోన్స్ కట్టలేక ఇబ్బందిపడ్తున్నారు, నిరుద్యోగం పెరిగిపోయింది, వీటి గురుంచి పట్టించుకోకుండా ప్రాంతాలని బాషా పరంగా విడగొడదామాని ఆలోచిస్తున్నారు అని అన్నారు. రేవంత్ రెడ్డి గారికి జరిగిన అవమానం ఈ రోజు తెలుగు జాతికి జరిగిన అవమానం అని ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి గారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar