हैदराबाद: केंद्रीय मंत्री बंडी संजय ने सनसनीखेज टिप्पणी की कि शिक्षा व्यवस्था को शहरी नक्सलियों ने बंधक बना लिया है। उन्होंने स्नातक एमएलसी चुनाव संकल्प यात्रा में भाग लेने वाले छात्रों को संबोधित करते हुए यह टिप्पणियां की। उन्होंने आगे कहा कि अर्बन नक्सल छात्रों को बंदूकें देकर कोंडापल्ली सीतारामय्या और चंद्रपुल्ला रेड्डी को सत्ता में लाने की कोशिश कर रहे हैं। उन्होंने कहा कि छात्रों को अंबेडकर, पटेल और छत्रपति जैसे आकार देने के लिए नई शिक्षा नीति लाई गई है। संजय ने सवाल किया कि क्या बंदूकों का राज्य चाहिए या कलम का राज्य चाहिए।
केंद्रीय मंत्री संजय ने सवाल किया कि कांग्रेस ने बेरोजगारों को 4,000 रुपये की सहायता देने का वादा किया था क्या दिया है। उन्होंने यह भी सवाल किया कि कांग्रेस ने इंतजार कर रहे है कर्मचारियों को एक महीने के भीतर पीआरसी देने का वादा किया था क्या दिया है। कांग्रेस ने बालिकाओं को स्कूटी देने का वादा किया था क्या उसने वास्तव में यह वादा पूरा किया है।

कांग्रेस ने 2,500 रुपये पेंशन देने का वादा किया था क्या दिया है। शून्य पेंशन दिया है। कांग्रेस ने कहा था कि चार हजार रुपये पेंशन देंगे क्या दिया है। कांग्रेस ने किसानों को रैतु भरोसा देने का वादा किया था, लेकिन कुछ भी नहीं किया। अब रिटर्न गिफ्ट देने का समय आ गया है। संजय ने भविष्यवाणी की कि तेलंगाना की जनता आने वाले चुनावों में रेवंत रेड्डी को भी शून्य देगी।
అర్బన్ నక్సల్స్ చేతిలో విద్యావ్యవస్థ బందీ: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ : అర్బన్ నక్సల్స్ చేతిలో విద్యావ్యవస్థ బందీ అయిందని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టభద్రుల సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన విద్యార్థులనుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులకు తుపాకులు ఇచ్చి కొండపల్లి సీతారామయ్య, చంద్రపుల్లారెడ్డిని తయారు చేయాలని చూస్తున్నారన్నారు. విద్యార్థులను అంబేద్కర్, పటేల్, ఛత్రపతిలా తీర్చిదిద్దేందుకే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తెచ్చామన్నారు. గన్నుల రాజ్యం కావాలా.. పెన్నుల రాజ్యం కావాలా అని బండి సంజయ్ ప్రశ్నించారు.
నిరుద్యోగులకు నాలుగు వేల భృతి ఇస్తామన్న కాంగ్రెస్ ఇచ్చిందా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఉద్యోగులు ఎదురుచూస్తున్న పీఆర్సీని నెలలో ఇస్తామన్న కాంగ్రెస్ ఇచ్చిందా అని నిలదీశారు. ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామన్న కాంగ్రెస్ ఇచ్చిందేందో చెప్పాలన్నారు. రెండు వేల ఐదు వందల పెన్షన్ ఇస్తామన్న కాంగ్రెస్ ఇచ్చింది గుండు సున్నానే అని విమర్శిమంచారు.
నాలుగు వేల ఆసరా పెన్షన్ ఇస్తామన్నారని, అది ఏమైందని ప్రశ్నించారు. రైతు భరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇచ్చింది కూడా సున్నానే అని ఎద్దేవా చేశారు. ఇప్పుడిక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే సమయం వచ్చేసిందన్నారు. ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు ఇచ్చేది కూడా గుండు సున్నానే అని బండి సంజయ్ జోస్యం చెప్పారు. (ఏజెన్సీలు)