తెలంగాణ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నిర్ణయం (More News From BRS)

వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేయడం, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, నగరంలో మెట్రో భారీ విస్తరణ వంటి అంశాల నేపథ్యంలో ఎక్కడికక్కడ సంబరాలు చేయాలని నిర్ణయం

పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్

అనాధల పాలసీని తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కేటీఆర్ సూచన

హైదరాబాద్: గౌరవ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు గారి నాయకత్వంలో నిన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అద్భుతమైన ప్రజానుకూల నిర్ణయాలను ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లేలా ప్రయత్నించాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పార్టీ శ్రేణులను కోరారు.

ఈరోజు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జనరల్ సెక్రటరీలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో ఒక టెలికాన్ఫరెన్స్ సమావేశాన్ని నిర్వహించారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వము కూడా గతంలో ఎన్నడు తీసుకొని విధంగా ఉద్యోగుల పట్ల ఎంతో ఔదార్యంతో తీససుకున్న నిర్ణయాన్ని ఆయా వర్గాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉన్నదని కేటీఆర్ ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు.

తాజాగా 21 వేల మంది వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మానవీయతను చాటుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా ఆర్టీసీ ఉద్యోగులందర్నీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా  గుర్తించడం వారి పట్ల ప్రభుత్వానికి ఉన్న మానవీయతను చాటి చెబుతుందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బస్సు డిపోల ముందర ఆర్టీసీ కార్మికులతో కలిసి సంబరాలు నిర్వహించాలని పార్టీ నాయకులకు కేటీఆర్ కోరారు.

దీంతోపాటు ఒకటి రెండు రోజుల్లో అటు వీఆర్ఏల కుటుంబాలతోను, ఆర్టీసీ కార్మికులతోను ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్చార్జి లకు కేటీఆర్ సూచించారు. కేవలం ఉద్యోగుల పట్లనే కాకుండా రాష్ట్రంలో ఉన్న అనాధల అందరిని ఒక పాలసీ కిందకు తీసుకువచ్చి, వారి  బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకునేలా తీసుకున్న నిర్ణయం కూడా అత్యంత మానవీయమైన పరిపాలన నిర్ణయం అని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు

ఇక రాష్ట్ర రాజధానిలో ప్రస్తుతం 70 కిలోమీటర్లు ఉన్న మెట్రోను 415 కిలోమీటర్లకు విస్తరించేలా భారీ ప్రణాళికను ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎక్కడికక్కడ బిఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కేటీఆర్ సూచించారు. ముఖ్యంగా విస్తరణ తర్వాత మెట్రో అందుబాటులోకి వచ్చే నియోజకవర్గాల్లో స్థానిక పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలని కేటీఆర్ సూచించారు.  రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థ మరింతగా బలోపేతం అవుతుందని, నగర విస్తరణకు అనేక సానుకూల అంశాలు ఏర్పడతాయన్న అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.

మెట్రో విస్తరణ పూర్తి అయితే హైదరాబాద్ చుట్టుపక్కలున్న సుదూర ప్రాంతాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతాయన్న విశ్వాసాన్ని ప్రజలకు  అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల వలన ఇబ్బందులు పాలైన ప్రజలకు ఉపశమనం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయంగా ప్రకటించిన 500 కోట్ల రూపాయలు ప్రజలకు ఉపయుక్తంగా ఉంటాయన్న విశ్వాసాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. 

నిన్న రాష్ట్ర ప్రభుత్వం  తీసుకున్న నిర్ణయాలన్నింటినీ పైన ఎక్కడికక్కడ జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకి ప్రభుత్వ  ఆలోచనలను తీసుకువెళ్లాలన్నారు. 

——————–

షెడ్యూల్డ్‌ ఏరియాల్లో చట్టాల అమలుపై దృష్టిసారించాలి.

గిరి వికాసం పకడ్బందీగా అమలుకు ఆదేశం

ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆశ్రమ స్కూళ్లు, గురుకులాల్లో చదివే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

సీజనల్ వ్యాధులు బారిన పడకుండా గిరిజన సంక్షేమ శాఖ విద్యాలయాల్లో ప్రత్యేక చర్యలు

ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా మెడికల్‌ క్యాంప్‌లు నిర్వహించాలి

గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులతో సత్యవతి రాథోడ్ సమీక్ష.

హైదరాబాద్: ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆశ్రమ స్కూళ్లు, గురుకులాల్లో చదివే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో గురుకుల విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నాణ్యమైన ఆహారం, నీరు అందజేయాలన్నారు. మంగళవారం రోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ లో గిరిజన సంక్షేమ శాఖ కార్యకలాపాలపై గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్, అదనపు కార్యదర్శులు సర్వేశ్వర్ రెడ్డి, గురుకుల విద్యాసంస్థ‌ల సొసైటీ కార్య‌ద‌ర్శి న‌వీన్ నికోల‌స్ లతో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన గిరిజన ప్రజలకు మేలు చేసేలా అధికారులు ప్రభుత్వ పథకాలను క్షేత్రస్ధాయిలో పటిష్టంగా అమలు చేయాలని అన్నారు. విద్య, వైద్య సౌకర్యాలతో పాటు ఆర్ధికంగా సామాజికంగా ఎదిగేలా కృషి చేయాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్న వివిధ విద్యా సంస్ధల ద్వారా లక్షల్లో విద్యార్ధులు చదువుకుంటున్నారని, వారికి నాణ్యమైన విద్య అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఏడాది భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు బారిన పడకుండా గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

గురుకుల విద్యాలయాల్లో ఫీవర్ సర్వేలు నిర్వహించాలని, అవరమైతే వైద్య శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. అంతే కాకుండా మరుగుదొడ్లు, భోజనశాలలు, వంట గదుల్లో పారిశుధ్యం మెరుగ్గా ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. వరదల కారణంగా గురుకుల విద్యాలయాల్లో ఎక్కడైనా సమస్యలు ఉంటే యుద్ధ ప్రాతిపదికన వాటి పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని అన్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు సమకూర్చాలని సూచించారు. సీఎం ఎస్టీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్ మెంట్ ద్వారా గిరిజనులలో ఉన్న స్కిల్స్ ను ఐడెంటిఫై చేసి వారిలో ఉన్న ప్రతిభను మెరుగుపరచి, ఆర్థికంగా మరింత మేలు జరిగేలా చూడాలన్నారు.

గిరివికాస పథకాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆదేశించారు. అందుకు తక్షణమే కార్యాచరణ రూపొందించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా మెడికల్‌ క్యాంప్‌లు నిర్వహించాలని తెలిపారు. గిరిపోషణతో పాటు, కేసీఆర్‌ న్యూట్రిషన్‌, బాలామృతం ఆదివాసీలకు

—————-

సంక్షేమం పేరుతో ఎపిలో సంక్షోభ పాలన
-అభివృద్ది పట్టని వైకాపా సర్కార్
-భారాస ఎపి చీఫ్ తోట ఫైర్

హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ లో మధ్యం,గంజాయి విచ్చలవిడిగా లభ్యమౌతున్నా ఏమాత్రం పట్టనివైకాపా సర్కార్ సంక్షేమం పేరుతో సంక్షోభ పాలన కొనసాగిస్తుందని బిఆర్ఎస్ ఎపి చీఫ్ డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. మంగళవారం గురజాల ,విజయవాడ నియోజకవర్గాలకు చెందిన తెల్లపోగు ఆదాం,ఉమామహేశ్వరరావు ,నాగేళ్ల కోటేశ్వరరావు,ఎం.బి.చంద్రపాల్ సహా పలు జిల్లాలకు చెందిన నేతలు తోట సమక్షంలో భారాస తీర్ధం పుచ్చుకున్నారు.

ఈ సంధర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డి యువతకు ఉపాధి హామీలు కల్పించక వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నవరత్నాల పేరుతో ప్రజల్ని నయవంచన చేస్తూ రాష్ట్రాన్ని దివాళా దిశగా తీసుకెళ్తున్నారని ధ్వజమెత్తారు.విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ , ప్రభుత్య ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని దయనీయ స్తితి ఎపి లో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.

వైకాపా ప్రభుత్వ రాక్షస పాలనలో అన్నీ రంగాలు నిర్వీర్యమైయ్యాయని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో ఎపి లో కెసిఆర్ నేతృత్వంలో బిఆర్ఎస్ ప్రత్యామ్న్యయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ కీలక పాత్ర పోషించనుందని ధీమా వ్యక్తం చేశారు.

——————–

కరీంనగర్ లో ఆర్టీసీ కార్మికుల సంబరాలు

సీఎం కేసీఆర్,మంత్రి గంగుల చిత్రపటాలకు పాలాభిషేకం..

ఆర్టీసీ 1 డిపో నుండి తెలంగాణ చౌక్ వరకు బస్సులకు సీఎం కేసీఆర్ మంత్రి గంగుల కటౌట్లతో భారీ ర్యాలీ.

పటాకులు కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు నిర్వహిస్తున్న కార్మికులు.

రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయంతో ఆర్టీసీ కార్మికులు కరీంనగర్ లో సంబరాలు నిర్వహించుకున్నారు.

టిఎస్ఆర్ టి సి ప్రభుత్వంలో విలీనం విలీనం చేయడంతో కార్మికుల సంబరాలు అంబరాన్ని అంటాయి. కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ వన్ డిపో ముందు కార్మికులు సీట్లు పంచుకొని పటాకులు కాల్చి సంబరాలు నిర్వహించుకుంటున్నారు.

—————

హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా మాల్యాల గ్రామంలో కృషి విజ్ఞాన్ కేంద్రం(కేవీకే)కి అనుసంధానంగా హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్‌ మంజూరు అయింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మాల్యాల గ్రామంలో ఉద్యానవన డిగ్రీ కళాశాల మంజూరు కావడంపై రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారిని కలిసి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ ….రాష్ట్రంలోనే మొట్టమొదటి హార్టికల్చర్ డిగ్రీ కళాశాల మహబూబాబాద్ కు మంజూరు అవ్వడం ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు. గతంలో చాలా వెనుకబడ్డ ప్రాంతంగా ఉన్న మహబూబాబాద్‌ను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జిల్లా చేయడంతో ఇప్పుదు జిల్లా అయ్యాక అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. మారుమూల ప్రాంతాల విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ వారికి ఉన్నత విద్యను చేరువ చేసి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రి సత్యవతి రాథోడ్ గారు మరో సారి ధన్యవాదాలు తెలియజేసారు.
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

మీరే తెలంగాణ భవిష్యత్

ఎంటెక్ చేసి బొప్పాయి సాగు

లండన్ ఉద్యోగం వదిలి అవకాడో పండిస్తున్నాడు

అందరికీ ఆదర్శంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల యువ రైతులు

ఎంటెక్ చదివి 10 ఎకరాలలో బొప్పాయి, జామ, దొండ, వరి సాగు చేస్తున్న ఎంటెక్ చదివిన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం అగర్ మియా గూడ యువరైతు అదీప్ అహ్మద్

మొజాయిక్ వైరస్ తో బొప్పాయి సాగుకు దూరమవుతున్న రైతులు

దేశీ బొప్పాయి సాగుతో కేజీ రూ.30కి అమ్ముతూ 10 మందికి ఉపాధి కల్పిస్తున్న ఆదీప్ అహ్మద్

సివిల్ ఇంజనీరింగ్ చేసి లండన్ లో ఎంబీఏ చదివి ఉద్యోగం వదిలేసి ఎకరా 10 గుంటలలో అవకాడో పంట పండిస్తున్న కందుకూరు మండలం దెబ్బడగూడ తండా వాసి జైపాల్ నాయక్

ఎకరాకు రూ.5 నుండి రూ.10 లక్షల వరకు లాభాలు

అవకాడో పంట సాగులో అద్భుతాలు సృష్టిస్తున్న రైతు జైపాల్ నాయక్

యూట్యూబ్ ద్వారా వ్యవసాయ విజయాలను ప్రపంచానికి తెలియజేస్తున్న కల్వకుర్తికి చెందిన వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థి శివకుమార్

లక్ష మంది సబ్ స్క్రైబర్లతో విజయవంతంగా రైతుల విజయాల ప్రచారం

మీలాంటి యువతే రేపటి తరానికి ఆదర్శం

వ్యవసాయమే ఈ ప్రపంచ దిక్సూచి .. వ్యవసాయ రంగం సుభిక్షంగా ఉంటేనే ఈ ప్రపంచం సురక్షితంగా ఉంటుంది

సాగుకు దూరమవుతున్న యువత మీలాంటి వారిని చూసి మళ్లీ వ్యవసాయాన్ని ప్రేమించాలి. మట్టి పరిమళాన్ని ఆస్వాదించాలి

సాగు మీద దృష్టి పెట్టి పంటల ఉత్పత్తిలో అద్భుతాలు సృష్టించాలి

సమాజ ఆలోచనా విధానాన్ని సంపూర్ణంగా మార్చాలి .. దానికి మీరు పునాదిరాళ్లు .. మీ నేతృత్వంలో మరింతమందిని ఇటు వైపు మళ్లించాలి

హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో తనను కలిసిన యువరైతులు అదీప్ అహ్మద్, జైపాల్ నాయక్ , యూ ట్యూబర్ శివకుమార్ లను అభినందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, సమావేశంలో నాగర్ కర్నూలు జిల్లా జడ్పీ చైర్మన్ బాలాజీ సింగ్, రంగారెడ్డి జిల్లా ఉద్యాన అధికారి సునంద తదితరులు.

—————–

నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీని స్థాపించండి

గ్లోబల్ లాజిక్ కంపెనీని కోరిన ఎమ్మెల్సీ కవిత

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సంస్థ ప్రతినిధుల భేటి

నిజామాబాద్ లో కంపెనీ ఏర్పాటుకు అన్ని సౌకర్యాలను కల్పిస్తామని కవిత హామీ

సానుకూలంగా స్పందించిన కంపెనీ ప్రతినిధులు

మంగళవారం ఐటీ హబ్ ను సందర్శించనున్న కంపెనీ ప్రతినిధులు

కాలిఫోర్నియాలో గ్లోబల్ లాజిక్ సంస్థ ప్రధాన కార్యాలయం… హైదరాబాద్ కార్యాలయంలో దాదాపు 3 వేల మంది ఉద్యోగులు

హైదరాబాద్ : ఇటీవల ప్రారంభమైన నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీని స్థాపించాలని అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. సోమవారం రోజు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ గురు కమకొలను, కంటెంట్ ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రసిడెంట్ కృష్ణ మోహన్ వీరవల్లి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బాజీరెడ్డి గొవర్ధన్, షకీల్ కూడా పాల్గొన్నారు. కవిత విజ్ఞప్తిని పరిగణించిన ఆ కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.

నిజామాబాద్ ఐటీ హబ్ గురించి సుదీర్ఘంగా చర్చించారు. అక్కడి రవాణా, నీరు, విద్యత్తు వంటి సౌకర్యాలతో పాటు శాంతి భద్రత గురించి కంపెనీ ప్రతినిధులకు కవిత వివరించారు. రవాణా సౌకర్యం విషయంలో ఆర్టీసీ బస్సులను ఐటీ హబ్ వరకు వేయించడానికి కృషి చేస్తానని బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. నిజామాబాద్ లో తాము కల్పించే ఉద్యోగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో కంపెనీని తెలంగాణ లోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని పేర్కొన్నారు. మంగళవారం నాడు కంపెనీ ప్రతినిధులు నిజామాబాద్ ఐటీ హబ్ ను సందర్శించనున్నారు.

అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్లోబల్ లాజిక్ సంస్థకు హైదరాబాద్ లో రెండు క్యాంపస్ లు ఉన్నాయి. గచ్చిబౌలి, జూబ్లిహిల్స్ లో వారి కంపెనీలో ప్రస్తుతం దాదాపు 3 వేల మంది పనిచేస్తున్నారు.

ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ… ఐటీ హబ్ లో కంపెనీని ఏర్పాటు చేయాలని తాను చేసిన విజ్ఞప్తికి గ్లోబల్ లాజిక్ కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించడం సంతోషంగా ఉందని చెప్పారు. యువతకు స్థానికంగానే ఉద్యోగావకాలు కల్పించాలనే ఉద్ధేశంతో సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ అన్ని జిల్లాల్లో ఐటీ హబ్ లను ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేసి అమలు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ దార్శనికతకు ఇదే నిదర్శనమని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఐటీ హబ్ లో ఏర్పాటు చేయబోయే కంపెనీలకు అన్ని సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో నిజామాబాద్ లో మరిన్ని కంపెనీలు ఏర్పాటు అవుతాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. స్థానిక యువత ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని కవిత కోరారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ గ్లోబల్‌ కోఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల గుప్తా కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X