హైదరాబాద్ : గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు అందుకున్న డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఎడ్యుకేషన్ విభాగ అధ్యాపకురాలు ప్రొ. జి. మేరీ సునందను విశ్వవిద్యాలయ అధికారులు ఘనంగా సన్మానించారు.

తమ విశ్వవిద్యాలయం నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డును ప్రొ. మేరీసునంద అందుకోవడం గర్వకారణమని విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. అనంతరం అవార్డు గ్రహీత ప్రొ. మేరీసునంద మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అధ్యాపకురాలిగా గుర్తింపు పొందడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డు తన భాధ్యతను మరింత పెంచిందన్నారు.
Also Read-
ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్ప చక్రపాణి, రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణా రెడ్డి; అధ్యాపకులు ప్రొ.డి రబింద్రనాథ్ సోలమన్; ప్రొ. ఆనంద్ పవార్, ప్రొ. పల్లవీ కాబ్దే; ప్రొ. భోజు శ్రీనివాస్; ప్రొ. పి. వెంకట రమణ, ప్రొ. వడ్డాణం శ్రీనివాస్; ప్రొ. మాధురి, ప్రొ. చంద్రకళ; పలు విభాగాల డైరెక్టర్లు, డీన్లు, అధ్యాపకులు, ఉద్యోగ సంఘాల నాయకులు కాంతం ప్రేమ్ కుమార్; విశ్వనాథ్, డా. యకేశ్ దైద; కె. మంజుల తదితరులు పాల్గొని ప్రొ. మేరీసునందను అభినందించి ఘనంగా సన్మానించారు.
