రేపటితో బండి సంజయ్ 1400 KM పాదయాత్ర పూర్తి, కరీంనగర్ లో రేపే బీజేపీ భారీ బహిరంగ సభ, ముఖ్య అతిథిగా జేపీ నడ్డా

  • ముఖ్య అతిథిగా జేపీ నడ్డా రాక
  • హాజరు కానున్న తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సహా అగ్రనేతలు
  • భారీ ఎత్తున జన సమీకరణకు బండి కసరత్తు
  • స్వచ్ఛందంగా వెళ్లేందుకు సిద్ధమైన వేలాది యువత, హిందుత్వ అభిమానులు
  • సభ సక్సెస్ తో బీఆర్ఎస్ పతనానికి కరీంనగరే నాంది కాబోతోందనే సంకేతాలు పంపనున్న బీజేపీ
  • బీజేపీ ప్రభుత్వమేననే సంకేతాలు పంపడమే రాబోయేది బండి లక్ష్యం
  • స్వచ్ఛందంగా ప్రజలు తరలిరావాలని సంజయుడి పిలుపు
  • రేపటితో 1400 కి.మీలు పాదయాత్ర చేసిన బండి సంజయ్
  • మొత్తం 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి
  • కరీంనగర్ బహిరంగ సభలో 6వ విడత ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ప్రకటించే అవకాశం

హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ఈనెల 15 నాటికి ముగియనుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ లోని రేపు (గురువారం) SRR కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాశ్ నడ్డా ముఖ్య అతిథిగా వస్తున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్, మధ్యప్రదేశ్ వ్యవహారాల ఇంఛార్జీ మురళీధర్ రావు సహా పలువురు ముఖ్య నేతలు ఈ బహిరంగ సభకు వస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమయ్యే ఈ సభ సాయంత్రం ముగియనుంది.

• ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేలా పార్టీ నాయకులు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని పార్టీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యులంతా హాజరయ్యేలా ప్రణాళిక రూపొందించడంతోపాటు వారి రవాణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎస్సారార్ మైదానంతోపాటు కరీంనగర్ యావత్తు జన సంద్రం అయ్యే అవకాశాలున్నాయి.

• ఈ బహిరంగ సభను సక్సెస్ చేయడం ద్వారా రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది బీజేపీయేననే సంకేతాలను పంపాలని భావిస్తోంది. అత్యధిక సంఖ్యలో జనం అట్లాగే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు కాలం చెల్లిందనే భావన పాదయాత్రతో అనేక మార్పులు సంభవించాయి. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి కేసీఆర్ గ్రాఫ్ అమాంతంగా పెరగడానికి బీజం వేసింది కరీంనగరే. ఎక్కడైతే కేసీఆర్ కు రాజకీయ భవిష్యత్తుకు అగ్రపీఠం వేసిన కరీంనగర్ లోనే సభను సక్సెస్ చేయడం ద్వారా బీఆర్ఎస్ పనైపోయిందనే సంకేతాలు ప్రజల్లోకి పంపాలని బండి సంజయ్ యోచిస్తున్నారు.

• తెలంగాణ ప్రజలంతా స్వచ్ఛందంగా తరలిరావాలని ఈ సందర్భంగా సంజయ్ పిలుపునిచ్చారు. మరోవైపు తెలంగాణ యువత, హిందుత్వ భావజాలమున్న ప్రజలంతా స్వచ్ఛందంగా కరీంనగర్ బహిరంగ సభకు వెళ్లాలని యోచిస్తుండటం గమనార్హం.

• మరోవైపు ఈనెల 15న నాటికి బండి సంజయ్ చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర పూర్తి కానుంది. కేసీఆర్ కుటుంబ-అవినీతి-నియంత పాలనకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ గత 4 విడతల్లో చేపట్టిన పాదయాత్ర 13 ఎంపీ, 48 అసెంబ్లీ, 21 జిల్లాల మీదుగా సాగింది. మొత్తం 1178 కి.మీలు నడిచారు.

• తాజాగా మైసా (బైంసా) నుండి ప్రారంభమైన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర నిర్మల్, ఖానాపూర్, కోరుట్ల, జగిత్యాల, కొండగట్టు, గంగాధర మీదుగా సాగి కరీంనగర్ ఎస్సారార్ కళాశాలవద్ద ముగిసింది. 8 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 222 కి.మీలు నడిచారు. తద్వారా మొత్తం ఐదు విడతల్లో బండి సంజయ్ మొత్తం 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1400 కి.మీలు నడిచారు.

• మరోవైపు కరీంనగర్ లో జరిగే బహిరంగ సభ వేదికపైనా 6వ విడత ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ను ప్రకటించేందుకు పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు.

• భాగ్యలక్ష్మీ అమ్మవారి పాదాల చెంత బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించినప్పటి నుండి ఎల్లుండి కరీంనగర్ లో నిర్వహించబోయే సభ వరకు మొత్తం 14 భారీ బహిరంగ సభలు, వందకుపైగా మినీ సభలతోపాటు పెద్ద ఎత్తున రచ్చబండలు, స్థానిక నేతలతో ఇంట్రాక్షన్ చర్చలు జరిగాయి. భారత దేశ చరిత్రలో ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఇంత తక్కువ కాలంలో ఈ స్థాయిలో భారీ బహిరంగ సభలు నిర్వహించిన దాఖాల్లేవని మనోహర్ రెడ్డి తెలిపారు.

శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేడు తేదీ 14 డిసెంబర్ 2022న హైదరాబాదులో విడుదల చేసిన ప్రకటన

బిజెపి రాష్ట్ర పదాధికారుల సమావేశం, కోర్ కమిటీ సమావేశం గురువారం 16 డిసెంబర్ 2022న ఉదయం హైదరాబాద్ లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరగనుంది ఈ సమావేశానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ అధ్యక్షత వహిస్తారు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ ఛుఘ్ పాల్గొంటారు.

ఈ సమావేశంలో బిజెపి జాతీయ నాయకులు (రాష్ట్రానికి చెందిన), బిజెపి రాష్ట్ర పదాధికారులు బిజెపి జిల్లా అధ్యక్షులు జిల్లా ఇన్చార్జులు పాల్గొంటారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ప్రజా సంగ్రామ యాత్ర ఐదో విడత చేపట్టిన విధానం ప్రజల నుంచి వచ్చిన విశేష స్పందన, రాబోయే రోజుల్లో పార్టీ తీసుకోబోయే కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల ప్రజలలోకి తీసుకెళ్లడం తదితర అంశాలను చర్చించడం జరుగుతుంది.

బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర ఐదో విడత ముగింపు సభ కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ గ్రౌండ్ లో జరగనున్న బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. కర్ణాటక నుండి బయలుదేరి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకుంటారు. దాదాపు అరగంట పాటు రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు స్వాగతం పలికిన అనంతరం శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉంటారు.

అనంతరం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి కరీంనగర్ కు హెలికాప్టర్లో మూడున్నర గంటల ప్రాంతంలో చేరుకుంటారు. కరీంనగర్ లో జరుగు బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా దాదాపు గంట పాటు ఉంటారు. కరీంనగర్ నుండి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో హెలిక్యాప్టర్లో బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాదు నుండి ఢిల్లీకి బయలుదేరుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X