బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు తెలంగాణ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు

హైదరాబాద్ : రావణుడిని సంహరించిన అనంతరం విజయోత్సాహంతో రాముడు అయోధ్యకు వచ్చిన సందర్భంగా జరుపుకునే పండుగ దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పర్వదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పండుగ మీ కుటుంబానికి సుఖశాంతులను, సమృద్ధిని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ఈ దీపావళి నిజంగా ప్రత్యేకమైనది – #GSTBachatUtsav అదనపు పొదుపు మరియు అదనపు ఆనందంతో ఇళ్లను వెలిగిస్తోంది! ప్రధానమంత్రి @narendramodi గారి GST 2.0 సంస్కరణల వల్ల గృహోపకరణాలు మరింత సరసమైనవిగా మారాయి. ‘భారతదేశంలో తయారు చేసిన’ ఉత్పత్తులు గతంలో కంటే మెరుగ్గా ప్రకాశిస్తున్నాయి.

Also Read-

భారతీయ ఉత్పత్తులను ఎంచుకోవడం, స్థానిక చేతివృత్తులవారికి మద్దతు ఇవ్వడం మరియు ఆత్మనిర్భర్ భారత్ వెలుగును వ్యాప్తి చేయడం ద్వారా స్వదేశీ స్ఫూర్తితో ఈ దీపావళిని జరుపుకుందాం.

SOME PARTIES DISTORTED AND CONCEALED THE HISTORY

Hyderabad: Telanganan state BJP President N Ramchander Rao today alleged that some political parties have suppressed historical facts and failed to educate our generation about the role played by Sardar Vallabhbhai Patel to keep the country united.

He was addressing a workshop organised to commemorate the 150th Birth Anniversary of Sardar Vallabhbhai Patel at party office here. Rao said Sardar Vallabhbhai Patel, known as “ a man of steel” had played major role in keeping country united by merging 560 small regions into India under one flag. Telangana (a erstwhile Nizam region) was one of the region which was merged after interference and police action by Sardar Patel, he reminded and asserted that there was a need to create awareness among the youth about the historical facts.

The people of Telangana were filled with pride upon hearing the name of Sardar Vallabhbhai Patel, as it was due to his efforts that Telangana is a part of India today, he said and alleged that while some political parties distorted history and concealed the truth for political gain. But BJP is clearly conveying the true history to the people, he said. Even though the Telangana state governments have not officially celebrated September 17, the day the State of Hyderabad was merged in 1948 into India, the Narendra Modi government and the BJP are celebrating it as “Hyderabad Liberation Day”, Rao said.

“Yek Bharat- Atma Nirbhar Bharat” is one of the commitments of Modi government which was consistently working to achieve the target, he said adding that India which was at 11th position in the world economy came to fourth position and now soon it will reach to third position in the world.

Calling upon people particularly party workers to take inspiration of Sardar patel life who had advocated and encouraged for “ “Swadeshi” the state BJP chief asserted that Prime Minister Narendra Modi government was also working for Self-reliant Bharat and encouraging people to buy local made .products with a slogan of “ Local for Vocal and Local to Global” .

While Sardar Patel had worked to keep the country united, Congress party was trying to disintegrate the country by using issues of caste, region, religion, rivers and language, Rao said.He alleged that some political parties have forgot Sardar Pate, but the patriotic BJP party would always remember him. Though he was a Congress leader, his service to the nation was an inspiration to us.

The BJP president alleged that some foreign powers are currently conspiring against the country. Individuals like George Soros are funding the Congress party and attempting to divide the nation. While Sardar Patel united the country, some within the same Congress party were trying to dismember the country today.

Referring to elimination of naxalism , Rao said under the leadership of our modern-day Sardar Patel, Union Home Minister Amit Shah, Left Wing Extremism (Naxalism) has been almost eradicated from the country. However he expressed concern on the revealation by top surrendered naxalites. He said a surrendered naxalites have revealed that some political leaders in Telangana were still maintaining connections with Maoists.

Stating that revelation by naxalites was a serious matter, Rao urged the state Congress government to immediately investigate into the matter and reveal the facts to the people as they wanted to know who is encouraging naxalism which has claimed hundred of lives of police personnel.

He asked party workers to participate in the programme organized on the occasion of Sardar Patel’s 150 the Birth Anniversary as this is not a party program , it concerns the nation. As citizens of India, it is our collective responsibility to participate in this program for the advancement and unity of India.

ఘనంగా సర్దార్ @150 రాష్ట్రస్థాయి కార్యశాల

హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షన సర్దార్ @150 రాష్ట్రస్థాయి కార్యశాల ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు రాంచందర్ రావు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు మాట్లాడూతూ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం “ఏక్ భారత్ – ఆత్మనిర్భర్ భారత్” కార్యక్రమాన్ని అక్టోబర్ 6న లాంఛనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమం అక్టోబర్ 31 వరకు కొనసాగుతుంది. దీనిలో భాగంగా అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో వివిధ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో కూడా ఈ కార్యక్రమంపై ప్రత్యేక వర్క్‌షాప్ జరిగింది.

సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పేరు వింటే తెలంగాణ ప్రజల హృదయాలు గర్వంతో నిండుతాయి. ఎందుకంటే ఆయన కృషి వల్లే ఈరోజు తెలంగాణ భారతదేశంలో భాగమైంది. చరిత్రను వక్రీకరించి రాజకీయ లాభం కోసం కొన్ని పార్టీలు సత్యాన్ని దాచిపెట్టినా, భారతీయ జనతా పార్టీ మాత్రం నిజమైన చరిత్రను ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తోంది. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌ రాష్ట్రం భారతదేశంలో విలీనం అయిన రోజును తెలంగాణ ప్రభుత్వాలు అధికారికంగా జరపకపోయినా, నరేంద్ర మోదీ ప్రభుత్వం, బీజేపీ ఆధ్వర్యంలో “హైదరాబాద్ విమోచన దినోత్సవం”గా జరుపుతోంది.

దేశ ఏకీకరణలో సర్దార్ పటేల్ గారి పాత్ర అమోఘం. 560 సంస్థానాలను ఒక్క జెండా కింద కలిపి భారతదేశాన్ని ఏకం చేశారు.
“ఐరన్ మాన్ ఆఫ్ ఇండియా” అనే బిరుదులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సరిపోయేవి. జూనాగఢ్‌, హైదరాబాద్ , కాశ్మీర్‌ వంటి ప్రాంతాలను కూడా భారతదేశంలో విలీనం చేసిన నాయకుడు ఆయనే. ఇతర రాజకీయ పార్టీలు ఆయనను మర్చిపోయినా, దేశభక్తి గల భారతీయ జనతా పార్టీ మాత్రం ఆయనను ఎప్పటికీ స్మరిస్తుంది. ఆయన కాంగ్రెస్ నాయకుడైనా, ఆయన దేశ సేవ మనకు స్ఫూర్తి.

ఇప్పుడు ఈ దేశం మీద విదేశీ శక్తులు కుట్రలు పన్నుతున్నాయి. జార్జ్ సోరోస్ వంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి నిధులు సమకూర్చి దేశాన్ని విడదీయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు సర్దార్ పటేల్ దేశాన్ని ఏకం చేస్తే, అదే పార్టీలోని కొంతమంది ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మన అభినవ సర్దార్ పటేల్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారి నాయకత్వంలో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం (నక్సలిజం) దేశంలో దాదాపు నిర్మూలనైంది.

మన్మోహన్ సింగ్ గారి హయాంలో “నక్సలిజం నిర్మూలించడం కష్టం” అనే పరిస్థితి ఉండగా, నేటి హోంమంత్రి అమిత్ షా గారి నేతృత్వంలో నక్సలిజాన్ని పూర్తి నిర్మూలిస్తామన్న మాట నిలబెట్టుకున్నారు. అమిత్ షా గారు ఈ తరం సర్దార్ పటేల్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన కఠినమైన నిర్ణయాలతో దేశం అంతటా శాంతి స్థాపన సాధించారు. తెలంగాణలో కొంతమంది రాజకీయ నాయకులు ఇంకా మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తున్నారని ఇటీవలే సరెండర్ అయిన నక్సలైట్లు వెల్లడించారు. ఇది చాలా సీరియస్ విషయం.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దానిపై విచారణ జరిపి ప్రజలకు వాస్తవాలను వెల్లడించాలి. పోలీసు కుటుంబాలు, కానిస్టేబుళ్ల ప్రాణాలను బలిగొన్న నక్సలిజాన్ని ఎవరు ప్రోత్సహించారు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేశ ఏకత్వం కోసం సర్దార్ పటేల్ గారు చేసిన త్యాగం భావితరాలకు తెలియజేయడం మనందరి బాధ్యత. “ఏక్ భారత్ – ఆత్మనిర్భర్ భారత్”… కేవలం ప్రభుత్వమే కాదు, ప్రతి పౌరుడు పాల్గొనాల్సిన జాతీయ ఉద్యమం. ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉన్న భారత్‌, ఇప్పుడు నాలుగో స్థానంలో ఉంది. త్వరలోనే మూడో స్థానంలోకి చేరుతుంది.

అందుకే సర్దార్ పటేల్ స్వదేశీ భావజాలాన్ని మనం కొనసాగించాలి — వొకల్ ఫర్ లోకల్, లోకల్ టు గ్లోబల్ అనే ఆత్మవిశ్వాసంతో.
భారతదేశం ఒక్కటే దేశం. కులం, మతం, భాష, ప్రాంతం అనే పేర్లతో దేశాన్ని విభజించాలనుకునే ఎవరి కుట్రలూ విజయం సాధించవు. దేశ ఏకత్వాన్ని కాపాడేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమం కేవలం పార్టీ కార్యక్రమం కాదు, ఇది భారత ప్రభుత్వానికి చెందిన జాతీయ కార్యక్రమం. అయినప్పటికీ, పార్టీ కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాను. తెలంగాణ ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి – ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనండి.

ఈ కార్యక్రమంలో మార్చ్‌లు, సెమినార్‌లు, చర్చలు వంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకుని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలి. మనకు ముందున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు, అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు —భారతీయ జనతా పార్టీకి మంచి అవకాశాలు. కానీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది. 42% రిజర్వేషన్ల అమలుపై తామే తప్పు చేసినా, ఇప్పుడు ఆ బాధ్యతను ప్రజలపై మోపే ప్రయత్నం చేస్తున్నారు. “తప్పు కాంగ్రెస్ చేస్తే, ప్రజలపై నెట్టే రాజకీయాలను ప్రజలు ఇక సహించరు.

నీతివంతమైన రాజకీయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే, సర్దార్ వల్లభభాయి పటేల్ వంటి మహనీయుల జీవితం మనకు స్ఫూర్తి కావాలి. మనం వారి ఆదర్శాలనుంచి ప్రేరణ పొందాలి — we must get inspiration from such people. ఈరోజు జరుగుతున్న ఈ వర్క్‌షాప్‌లో కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు వెల్లడించడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను.

ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా, కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ఇది పార్టీ కార్యక్రమం కాదు — దేశానికి సంబంధించినది. మనం భారత పౌరులం కాబట్టి, భారతదేశ అభ్యున్నతి కోసం, దేశ ఏకత కోసం ఈ కార్యక్రమంలో పాల్గొనడం మనందరి బాధ్యత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X