Hyderabad: 5వ రోజు దిగ్విజయంగా ముగిసిన బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర”. ఇవాళ మొత్తం 12.1 కిలోమీటర్ల మేర కొనసాగిన బండి సంజయ్ పాదయాత్ర. ఈరోజు రాంపూర్ గ్రామ శివారులలో బండి సంజయ్ రాత్రి బస. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం లోని రాంపూర్ గ్రామంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించిన బండి సంజయ్.
బండి సంజయ్ ప్రసంగంలోని ముఖ్యంశాలు:
“రాంపూర్ లో అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వచ్చాయా? కెసిఆర్ కి మళ్ళీ ఒకసారి ఓటు వేస్తారా? మనం రోడ్లమీద తిరుగుతుంటే… ఈ సమయానికి కేసీఆర్ 6 పెగ్గులు వేసి ఉంటాడు. పాదయాత్రలో మేము ఎక్కడికి వెళ్లినా… ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి, మాకు ఘనస్వాగతం పలుకుతున్నారు. మనం కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాంపూర్ కి మిషన్ భగీరథ నీళ్లు కూడా ఇవ్వడం లేదు. ఇక్కడ తాగునీరు అంతా కూడా… మురుగు నీరే వస్తుంది. రైతులకు రుణమాఫీ చేయలేదు. దళితులకు 3 ఎకరాలు, దళిత బంధు ఇవ్వలేదు. ఎంతసేపు రాంపూర్ వాళ్ళ కొంప ముంచాలనే కేసీఆర్ చూస్తాడు. తెలంగాణ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుగా మార్చిండు. పుట్టబోయే బిడ్డ నెత్తి పై కూడా లక్ష రూపాయలు అప్పు పెట్టిండు.”
“ఢిల్లీలో కేసీఆర్ కూతురు లిక్కర్ దందా చేసింది. రాంపూర్ గ్రామంలో గుడి, బడి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లేకపోయినా… కేసీఆర్ షాపులు మాత్రం 10, 15 వరకు ఉంటున్నాయి. తెలంగాణ సొమ్ము దోచుకుని కేసీఆర్ కూతురు ఢిల్లీలో లిక్కర్ దందా చేస్తోంది. లంగ దండాలు… దొంగ దందాలు అన్నీ కెసిఆర్ కుటుంబానివే. 1400 మంది పేదోళ్ల ఆత్మబలి దానాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, కెసిఆర్ అనే మూర్ఖుడి చేతిలో పెట్టినాం. కెసిఆర్ కుటుంబం పాలించడానికి మనం తెలంగాణ రాష్ట్రం సాధించామా? కెసిఆర్ కూతురు లంగ దందా.. దొంగ దందా చేస్తే, కవితపై కేసు పెట్టదంట. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్… నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిండా ముంచిండు. తెలంగాణకు రెండు లక్షల 40వేల ఇండ్లను మోడీ మంజూరు చేశారు. మోడీ మంజూరు చేసిన ఇండ్లను కూడా కేసీఆర్ కట్టించడం లేదు. టిఆర్ఎస్ నేతలకు కబ్జాలు చేయడం తప్ప, అభివృద్ధి చేయడం తెలియదు. ధరణి పోర్టల్ పేరుతో పేదోళ్ల జాగాలను గుంజుకుంటున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల కోట్ల రూపాయల విలువ చేసే జాగాలను కబ్జా చేసేందుకే ధరణి పోర్టల్ తెచ్చిండు. కెసిఆర్ మోసపూరిత మాటలను నమ్మొద్దు.”
“నేను చెప్పే వివరాలు తప్పైతే… నాపై కేసు పెట్టండి. ఉచిత బియ్యం మోడీ ఇస్తుంటే… రేషన్ షాపుల వద్ద కేసీఆర్ తన ఫోటో పెట్టుకుంటున్నాడు. కిలోకు 29 రూపాయలు భరిస్తున్న కేంద్ర ప్రభుత్వం గొప్పదా…? రూపాయి వసూలు చేస్తున్న కేసీఆర్ గొప్పోడా? చివరికి బాత్రూంల వద్ద కూడా కేసీఆర్ తన ఫోటో పెట్టించుకుంటున్నాడు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే. కెసిఆర్ కు టీఆర్ఎస్ నేతలకు మోడీని తిట్టడం తప్ప, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకాదు. కెసిఆర్ గడీలను బద్దలు కొట్టాలి. ఇప్పుడు ఎన్నికలు లేవు… నేను ఓట్ల కోసం రాలేదు. నేను ఇక్కడ పోటీ చేసే వాడిని కాను. కుటుంబాలను వదులుకొని మీకోసమే సంవత్సరం నుంచి పాదయాత్ర చేస్తున్నాం. పేదోళ్ల రాజ్యం రావాలి… మీ బతుకులు బాగుపడాలి. మీ కోసం కొట్లాడుతాం… మీ కోసం ఉద్యమిస్తాం. రామరాజ్యం రావాలి. జై శ్రీరామ్.”
అనంతరం బండి సంజయ్ సమక్షంలో బిజెపిలో చేరిన పలువురు టిఆర్ఎస్ నేతలు. టిఆర్ఎస్ నేతలకు కాషాయ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించిన బండి సంజయ్.
BREAKING
చిలుక, దళిత బాధితురాలు@నర్సాపూర్, నిర్మల్ జిల్లా
తెలంగాణ ముద్దుబిడ్డ బండి సంజయ్ –
దళిత బంధు గురించి ప్రశ్నిస్తే నాపై కేసును పెట్టారు…
నైట్ ఇంద్రకరణ్ రెడ్డి వచ్చిండు
బతుకమ్మ చీరలు పంచడానికి వచ్చిండు
పోలీసోళ్ళని పెట్టుకొని వచ్చిండు
నా కార్యకర్తలకు ఇస్తాను, ఏం చేసుకుంటావో చేసుకో అని నన్ను బయటికి గెంటేశారు
గల్లీల కొడితే.. ఢిల్లీకి ఉరకాలి బిడ్డ
దళితుల హక్కుల కోసం అడిగితే నా పైన కేసులు పెడతావా?
ఇక్కడ సీఐ ఏం చేస్తావని నన్ను హెచ్చరిస్తాడా?
నిర్మల్ లో కొడితే… ప్యాంట్ ఇప్పుకుని ఉరకాలి బిడ్డా ఇంద్రకరణ్ రెడ్డి
భయపడే ప్రసక్తే లేదు… అండగా బండి సంజయ్ ఉన్నారు
నా మీద ఎన్ని కేసులు పెట్టినా… నా ఎంటికతో సమానం
నిర్మల్ లో నీపై పోటీ చేస్తా బిడ్డా
తగ్గేదే లే ఐకే రెడ్డి – చిలుక, దళిత బాధితురాలు
కేసీఆర్ బిడ్డకు నోటీసులిస్తే…. తెలంగాణ ఎందుకు ఉద్యమించాలే?
తెలంగాణ ప్రజలు నీ కుటుంబాన్ని జైలుకు పంపడానికే సిద్ధమైనరు
ట్రిపుల్ ఐటీ మూసివేతకు కేసీఆర్ మహా కుట్ర
అందుకే సౌకర్యాలు కల్పించకుండా పొమ్మనలేక పొగబెడుతున్నరు
దళితబంధు అడిగితే పేద మహిళలపై నాన్ బెయిలెబు కేసులు పెట్టిస్తరా?
వత్తాసు పలుకుతున్న పోలీసులారా…..మిమ్ముల్ని వదిలపెట్టే ప్రసక్తే లేదు
దళితులపై దాడి చేయించిన మంత్రి, బాధ్యులపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిస్తా
సీఎం, మంత్రులు కండ కావరమెక్కి అధికార మదంతో కొట్టుకుంటున్నరు
ఈ జిల్లాలో మంత్రుల, టీఆర్ఎస్ నేతల భూకబ్జా చిట్టా మా వద్ద ఉంది
బీజేపీ అధికారంలోకి రాగానే ఆ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతాం
బిడ్డా కేసీఆర్…. తెలంగాణ కోసం ఉద్యమించిన బీజేపీ సమైక్యాంధ్ర పార్టీ అంటావా?
సమైక్యాంధ్ర పార్టీలతో, మతోన్మాద ఎంఐఎంతో జట్టు కట్టిన నువ్వా బీజేపీని విమర్శించేది?
టీఆర్ఎస్ అరాచకాలను ప్రశ్నిస్తూ ఎదిరించడానికే ప్రజా సంగ్రామ యాత్ర
కేసీఆర్ సర్కార్ పై మరోసారి నిప్పులు చెరిగిన బండి సంజయ్ కుమార్
కేంద్రం చేస్తున్న అప్పులపై ధీటుగా సమాధానమిచ్చిన బండి
అప్పు చేసినా గ్రామాలకు నిధులిస్తోంది కేంద్రమే
5 లక్షల కోట్ల అప్పు చేసి కేసీఆర్ చేసిందేమిటని నిలదీసిన సంజయ్
ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులు, టీఆర్ఎస్ నేతలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. కేసీఆర్ కుటుంబంతోపాటు మంత్రులు, టీఆర్ఎస్ నేతలకు కండ కావరమెక్కి అధికార మదంతో కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. దళితబంధు అడిగిన పాపానికి మహిళలని చూడకుండా నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ధ్వజమెత్తారు. నిర్మల్ నియోజకవర్గంలో మంత్రి ఆగడాలపైనా ధ్వజమెత్తారు. నర్సాపూర్ లో దళిత మహిళలపై దాడిచేసి కేసులు పెట్టిన పోలీసులతోపాటు బాధ్యుడైన మంత్రిపైనా ఎస్సీఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసేదాకా వదిలపెట్టే ప్రసక్తే లేదన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ మూసివేతకు సీఎం కేసీఆర్ కుట్రకు తెరదీశారని అన్నారు. అందులో భాగంగానే విద్యార్థులకు సరైన తిండి, కనీస సౌకర్యాలు కల్పించకుండా పొమ్మనలేక పొగబెడుతున్నారని మండిపడ్డారు. లిక్కర్, డ్రగ్స్, పత్తాల, అవినీతి కేసుల్లో కేసీఆర్ కుటుంబం నిండా మునిగిపోయిందన్నారు. లిక్కర్ స్కాంలో కేసీఆర్ బిడ్డకు ఈడీ నోటీసులిస్తే తెలంగాణ సెంటిమెంట్ రగిలించేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. లిక్కర్ దందాలో అడ్డంగా దొరికిన కేసీఆర్ బిడ్డ కోసం తెలంగాణ ప్రజలు ఎందుకు ఉద్యమించాలని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తూ ఎదిరించడానికే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నామని తెలిపారు. నరేంద్రమోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేస్తోందంటూ టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపైనా ధీటుగా సమాధానమిచ్చారు. అప్పులు చేసినా తెలంగాణ లోని గ్రామ పంచాయతీలన్నింటికీ నిధులిస్తూ అభివ్రుద్ది చేస్తోంది కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వమేనని చెప్పారు. 5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన కేసీఆర్ ప్రభుత్వం సాధించిందేమిటో సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 5వ రోజు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కొద్దిసేపటి క్రితం నిర్మల్ నియోజకవర్గంలోని నర్సాపూర్ గ్రామానికి విచ్చేశారు. స్థానిక ఉప సర్పంచ్ సహా పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా హాజరైన భారీ జన సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు….
పోలీసు వ్యవస్థకి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు
కొంతమంది పోలీసులు మాత్రమే… టిఆర్ఎస్ కి వత్తాసు పలికి, వాళ్ల మోచేతి నీళ్లు తాగుతారు
కానిస్టేబుల్స్ అయితే గొడ్డు చాకిరీ చేస్తున్నారు
వాళ్లకి ప్రమోషన్లు లేవు
ఉఫ్ అని ఊదితే . ఊడిపోయే ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం
కెసిఆర్ ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉంది
బిజెపి ప్రభుత్వాన్ని పక్కా రప్పిస్తాం
ముఖ్యమంత్రికి కండకావరం తలకెక్కి, ఇష్టం వచ్చినట్టు బలుపుతో మాట్లాడుతున్నారు
చిలుక అక్క ఏం చేసింది?
నర్సాపూర్ కు జూనియర్ కాలేజీ కూడా ఇవ్వని దద్దమ్మ కేసీఆర్
‘ప్రాణహిత-చేవెళ్ల’ నిర్వాసితులకు పైసలు కూడా ఇవ్వలేదు
రైతు రుణమాఫీ లేదు
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లేవు
దళిత బంధు, దళిత సీఎం, దళితులకు 3 ఎకరాల భూమి హామీ ఏమైంది?
పోడు భూముల సమస్య పరిష్కరించలేదు
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు కనీసం తిండి కూడా పెట్టడం లేదు
బాసర ట్రిపుల్ ఐటీ ని కుట్రలో భాగంగా మూసేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడు
బాసర విద్యార్థులను పొమ్మనలేక పొగ పెడుతున్నాడు
బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డాక, బాసర ట్రిపుల్ ఐటిని ఎలా కాపాడుకోవాలో… విద్యార్థులను ఎలా కాపాడుకోవాలో కాపాడుకుంటాం
తెలంగాణ ఉద్యమంలో మనం లాఠీ దెబ్బలు తిని, జైల్లోకి పోయి, ఒక మూర్ఖుడి చేతిలో రాష్ట్రాన్ని పెట్టినం
కెసిఆర్ బిడ్డ లిక్కర్ దందా లో ఉంది
క్యాసినో లో పెట్టుబడులు పెట్టింది
కెసిఆర్ దొంగ పనులు, లంగ దందాల కోసం విచారణ జరపొద్దు అంట
విచారణ జరిపితే… తెలంగాణ ప్రజలు రోడ్డెక్కి ఉద్యమం చేయాలంట
కెసిఆర్ కుటుంబాన్ని జైలుకు పంపే అద్భుత దృశ్యాన్ని చూసేందుకు తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు
టిఆర్ఎస్ నేతల కబ్జాల చిట్టా అంతా… మా వద్ద ఉంది
ఇంకా ఆరు నెలలు మాత్రమే మీ ప్రభుత్వం ఉంటుంది
మీరు చేసిన కబ్జాలను తిరిగి స్వాధీనం చేసుకుని, పేదలకు పంచుతాం
దళితులు ఏం తప్పు చేశారు?
దళితులకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదంట కేసీఆర్ అంటున్నాడు
అంబేద్కర్ జయంతి, వర్ధంతికి కేసీఆర్ బయటికి రాడు
దళితుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు కేసీఆర్
దళితులు కేసీఆర్ కి గుణపాఠం చెప్పాలి
చిలుక, రాజమ్మ అక్కల పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపుతారా?
అమాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి, కెసిఆర్ ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్న పోలీసుల లిస్టును తయారు చేస్తున్నాం
బిజెపి ప్రభుత్వం వచ్చాక వదిలే ప్రసక్తే లేదు
దమ్ముంటే ఇక్కడ సిఐ… ఇంద్రకరణ్ రెడ్డి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి
టిఆర్ఎస్ నాయకులు, సిఐ పై పక్కా ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిస్తా
పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం బిజెపి పని చేస్తోంది
12 మంది ఎస్సీ ఎంపీలను కేంద్ర మంత్రులను చేసిన ఘనత మోడీ దే
ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసిన ఘనత మోడీది
అంబేద్కర్ జన్మస్థలాన్ని పంచ తీర్థాల పేరుతో అభివృద్ధి చేస్తున్నాం
బిజెపిలో ఛాయమ్ముకునే వ్యక్తి మోదీ… ప్రధాని అయ్యాడు
వివిధ పథకాల కింద ఈ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేసింది
ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ప్రాంతానికి ఎన్ని కోట్ల నిధులను తెచ్చారో సమాధానం చెప్పాలి
ప్రశ్నిస్తాం… ఎదిరిస్తాం… అవసరమైతే అడ్డగిస్తాం
నిర్మల్ జిల్లాలో డబుల్ బెడ్రూంలు ఎందుకు ఇవ్వడం లేదో ప్రగతి భవన్ కు వెళ్లి ఇక్కడి టిఆర్ఎస్ నేతలు కేసీఆర్ ను ప్రశ్నించాలి
చేవలేని, చేతకాని దద్దమ్మలు టిఆర్ఎస్ నేతలు
ప్రజల కోసం… ప్రశ్నించడానికి ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాం
కెసిఆర్ లాఠీ దెబ్బలు తినేందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు
రామరాజ్యం స్థాపించి తీరుతాం
గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తాం
తెలంగాణ కోసం కెసిఆర్ ఏం త్యాగం చేశాడు?
పేదోళ్ల ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో… పెద్దోడు రాజ్యమేలుతున్నాడు
బడుగు బలహీన వర్గాలకు అధికారం లేదు
ఎవడు త్యాగం చేస్తే… ఎవడు రాజ్యమేలుతున్నాడు?
శ్రీకాంతాచారి ఆత్మ బలిదానంతోనే తెలంగాణ ఏర్పడింది
నా చావుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని భావించి… పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు శ్రీకాంత్ చారి
తెలంగాణ కోసం ‘నీళ్లు, నిధులు,నియామకాల’ కోసం పోలీస్ కిష్టయ్య, సుమన్ లు ఆత్మహత్యలు చేసుకున్నారు
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి , రుణమాఫీ, జీతాలు , పెన్షన్ లు ఇయ్యడానికి మాత్రం కేసీఆర్ దగ్గర పైసలు లేవు
కానీ, ఢిల్లీ లిక్కర్ స్కాం… క్యాసినో లో మాత్రం పెట్టుబడులు పెట్టడానికి కేసీఆర్ కుటుంబానికి పైసలు వస్తున్నాయి
ఉద్యోగాలు రాక, నిరుద్యోగ భృతి లేక నిరుద్యోగుల ఆత్మహత్య చేసుకుంటున్నారు
రుణమాఫీ అమలు కాక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
ఉద్యమ సమయంలో కేసీఆర్ బిచ్చపోడు
ఇప్పుడు లక్షల కోట్లకు ఎదిగాడు
పేదోడు బికారి అవుతున్నాడు
తెలంగాణ రాష్ట్రం వచ్చాక వడ్ల కుప్పలమీద రైతన్నలు చనిపోతున్న పరిస్థితి
కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వకుండా నాశనం చేస్తున్నారు
తెలంగాణ రాష్ట్రానికి ముందు… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు
27 మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు
కేసీఆర్ పాలన వల్ల 37 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు
కేసీఆర్ ప్రభుత్వ నిర్వాకం వల్ల, మూల్యాంకనంలో తప్పిదం వల్ల, సిరిసిల్లలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది
విద్యార్థుల తల్లిదండ్రులపై లాఠీ ఛార్జ్ చేసిన మూర్ఖుడు, బట్టేబాజ్ ఈ ముఖ్యమంత్రి కేసీఆర్
ఏయ్… మిస్టర్ ఖాసిం చంద్రశేఖర్ రజ్వి… తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన పార్టీ భారతీయ జనతా పార్టీ
పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు బిజెపి మద్దతు తెలపకుంటే… తెలంగాణ వచ్చేదా?
సుష్మా స్వరాజ్ మద్దతు ఇవ్వకుంటే… తెలంగాణ వచ్చేదా?
తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న తెలంగాణ ద్రోహి కేసీఆర్
కెసిఆరే అసలైన సమైక్యవాది
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన లుచ్చా పార్టీ అయిన ‘ఎంఐఎం’తో చట్టాపట్టాలేసుకుని తిరిగిన కేసీఆర్… ఈరోజు బీజేపీని విమర్శిస్తాడా?
అసలైన ఉద్యమకారులంతా… ఇప్పుడు బిజెపితోనే ఉన్నారు
ఖమ్మంలో దొంగ దీక్ష చేసిండు. సినిమాలో వేణుమాధవ్ లా సెలైన్ పెట్టుకుని మందు తాగిండు
ఉద్యమ సమయంలో ఢిల్లీలో బాత్రూంలోకి వెళ్లి మందు తాగిన ఘనత కేసీఆర్ ది
తెలంగాణ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిండు
తెలంగాణలో జరిగిన అభివృద్ధి అంతా కేంద్రం ఇస్తున్న నిధులతోనే
అప్పుచేసి, ఏ సంక్షేమ పథకాలు ఇచ్చాడో…. కేసీఆర్ సమాధానం చెప్పాలి
ప్రజల కోసమే భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంది
ఉచిత విద్య, ఉచిత వైద్యం అమలు చేస్తాం
కెసిఆర్ కబంధ కష్టాల్లో తెలంగాణ తల్లి బందీ అయింది
తెలంగాణ తల్లిని బంధ విముక్తురాలిని చేద్దాం
తెలంగాణలో రామరాజ్యం… కాషాయరాజ్యం స్థాపిద్దాం
మీకు అండగా బిజెపి ఉంటుంది
తెలంగాణలో వచ్చేది బిజెపి ప్రభుత్వమే
సోయం బాపూరావు, ఆదిలాబాద్ ఎంపీ కామెంట్స్:
సాలు దొర… సెలవు దొర అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు. బండి సంజయ్ రాకతో… ఇంద్రకరణ్ రెడ్డి భయపడుతుండు. తెలంగాణలో బిజెపి ఇంత ఎదగడానికి కారకుడు బండి సంజయ్. రాబోయే రోజుల్లో బండి సంజయ్ ఆధ్వర్యంలో… తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాబోతోంది. మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి ‘భారత్ మాతాకీ జై’ అంటే అర్థమేమిటో కూడా తెలియదు. భారతీయ జనతా పార్టీ భారత్ మాతాకీ జై అంటే… దేశంలో ఉన్న మనుషులు, చెట్లు, జంతువులు అంతా మంచిగా ఉండాలని కోరుకోవడమే. కచ్చితంగా రెడ్డి అవినీతిని ఎండగట్టేందుకే బండి సంజయ్ ఇక్కడికి వచ్చారు. బండి సంజయ్ పాదయాత్రతో టిఆర్ఎస్ నేతల్లో వణుకు మొదలైంది. దళితులను బెదిరిస్తే… ఢిల్లీకి పిలిచి, గుంజీలు తీయిస్తా అని స్థానిక సీఐకి సోయం బాపురావు హెచ్చరిక. ఇంద్రకరణ్ రెడ్డి అవినీతిపై వేటాడాలని మీకు పిలుపునిస్తున్నా. నా పార్లమెంటు నియోజకవర్గంలో ఏడుకు ఏడు అసెంబ్లీ స్థానాలను గెలిపించి, బండి సంజయ్ కి గిఫ్ట్ గా ఇస్తాం. టిఆర్ఎస్ ను ఓడించే వరకు నిద్రపోము.
నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలంలోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర. నర్సాపూర్ మండలంలో బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికిన స్థానిక బిజెపి నేతలు, కార్యకర్తలు. నుదుట బొట్టు పెట్టి, హారతులు పట్టి, బండి సంజయ్ కి స్వాగతం పలికిన ఆడపడుచులు. బాణసంచా కాలుస్తూ.. స్వాగతం పలికిన యువత. కాసేపట్లో నర్సాపూర్ కార్నర్ మీటింగ్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న బండి సంజయ్.
BREAKING
లంచ్ అనంతరం తిరిగి ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర. నందన్ గ్రామం నుంచి నర్సాపూర్ మండలం మధ్య దారిలో కొనసాగుతున్న పాదయాత్ర. బండి సంజయ్ అడుగులో అడుగు వేస్తూ… పాదయాత్రలో నడుస్తున్న, వేలాదిగా తరలివచ్చిన బిజెపి నేతలు, కార్యకర్తలు. కాసేపట్లో నర్సాపూర్ మండలానికి చేరుకోనున్న బండి సంజయ్ పాదయాత్ర. నర్సాపూర్ కార్నర్ మీటింగ్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న బండి సంజయ్. ఇప్పటికే నర్సాపూర్ కు భారీ సంఖ్యలో చేరుకున్న ప్రజలు, బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్ రాకకై ఎదురు చూస్తున్న యువత.
BREAKING
బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జన్మదినం సందర్భంగా… నిర్మల్ జిల్లా నందన్ గ్రామంలోని లంచ్ శిబిరం వద్ద పాఠశాల విద్యార్థులకు బుక్స్, పెన్సిల్స్ & పెన్నులను పంపిణీ చేసిన తెలంగాణ బిజెపి నేతలు.
విద్యార్థులకు బుక్స్, పెన్సిల్స్ & పెన్స్ పంపిణీ చేసిన వారిలో… ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.వి సుభాష్ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి దీపక్, గిరిధర్, సుధాకర శర్మ, ఇతర ముఖ్య నేతలు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ జన్మదినోత్సవం సందర్బంగా నందన్ గ్రామంలో మహిళలకు చీరలు పంపిణి చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్
హవ్వ… తెలంగాణ చెక్కులు బౌన్స్ చేస్తారా?
- కేసీఆర్ ను చూసి దేశమంతా నవ్వుకుంటోంది
- ధరణి పోర్టల్ లోపాల పుట్ట… రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది
- లిక్కర్, క్యాసినో దందాల్లో కేసీఆర్ బిడ్డ వేల కోట్ల పెట్టుబడులు
- బీజేపీ అధికారంలోకొస్తే గత సంక్షేమ పథకాలన్నీ మరింత మెరుగ్గా కొనసాగిస్తాం
ముఖ్యమంత్రి కేసీఆర్ పంజాబ్ రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో దేశమంతా నవ్వుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమర్ వ్యాఖ్యానించారు. ధరణి పోర్టల్ లోపాల పుట్ట అని… ప్రభుత్వ పొరపాట్లతో లక్షలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. సర్కార్ తీరువల్ల భూమి ఉన్నా రైతు బంధు, రైతు బీమా, పంట నష్టపరిహారం అందడం లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను రద్దు చేశారనే ఆరోపణలను తిప్పికొట్టారు. ‘‘గత పాలకులు ప్రవేశపెట్టిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని రద్దు చేయబోంది. మరింత మెరుగ్గా అమలు చేసి తీరుతాం’’అని పునరుద్టాటించారు. రాష్ట్రాన్ని దివాళా తీయించి వేల కోట్లు దోచుకున్న కేసీఆర్ కుటుంబం ఆ సొమ్మును లిక్కర్, క్యాసినో దందాల్లో పెట్టుబడులు పెట్టారని అన్నారు. 5వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కుమార్ నందన్ గ్రామస్తులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు…
కాలాలకతీతంగా సంవత్సరం నుంచి పాదయాత్ర చేస్తున్న
ఇప్పుడు ఓట్లు లేవు.. ఎలక్షన్స్ లేవు
పేదోళ్ల సమస్యలు, బాధలను తెలుసుకోవాలని మోడీ ఆదేశిస్తేనే… పాదయాత్ర చేస్తున్నా
తెలంగాణలో పేదోళ్ల ప్రభుత్వం రావాలి
తెలంగాణకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 2,40,000 ఇండ్లను మోడీ మంజూరు చేశారు
4000 కోట్ల రూపాయలను విడుదల చేశారు
మహారాష్ట్రలో సంవత్సరం లోపు ఇండ్లను కట్టి, పేదలతో దసరా రోజు గృహప్రవేశం చేయించిన ఘనత మోదీదే
కెసిఆర్ కు పేదలకు కట్టించాల్సిన ఇండ్లు ముఖ్యం కాదు. ఆయనకు కావాల్సింది ఓట్లు మాత్రమే
ప్రజలను మభ్యపెడుతూ ఓట్లు దండుకుంటున్నాడు
ఒక్కరికి కూడా ఇండ్లు ఇచ్చిన దాఖలాలు లేవు
కెసిఆర్ పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నాడు
ఇక్కడున్నవి బెల్ట్ షాపులు కాదు.. అవి కేసీఆర్ షాప్ లు
కెసిఆర్ కూతురు అక్రమంగా సంపాదించిన వేలకోట్ల సొమ్మును, ఢిల్లీలో పెట్టుబడి పెట్టింది
క్యాసినో లో కూడా పెట్టుబడులు పెట్టింది
ఈ ఊరికి బస్సు లేదు, రోడ్లు లేవు, ఇండ్లు లేవు
స్కూల్స్ ఉంటే… టీచర్లు ఉండరు. టీచర్స్ ఉంటే… స్కూలు ఉండదు. స్కూల్ బిల్డింగులు అసలే ఉండవు
పాఠశాలల్లో 70 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడే ఉన్నాడు
8 ఏళ్లుగా ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు
తన కుటుంబంలో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు
రైతు రుణమాఫీ చేయలేదు
24 గంటలు ఉచిత కరెంటు ఇవ్వడం లేదు
కరెంట్ ఎప్పుడు వస్తుందో… ఎప్పుడు పోతుందో కూడా తెలియదు
కరెంట్ బిల్లుల మోత మోగిస్తున్నారు
ఇప్పుడు మరోసారి కరెంటు బిల్లులను పెంచేందుకు చూస్తున్నారు
బస్సు చార్జీలను కూడా పెంచుతారు
కేసీఆర్ 100 రూములతో ఇండ్లు కట్టుకున్నాడు. 300 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. కోటీశ్వరుడు అవుతున్నాడు.
రైతులు మాత్రం అప్పుల పాలవుతున్నారు
కెసిఆర్ దృష్టిలో… పేదోడు పేదోడిలానే ఉండాలి. పెద్దోడు ఇంకా పెద్దోడు కావాలి
ధరణి పోర్టల్ తో ప్రజల ఉసురు తీసుకుంటున్నారు
ధరణిలో పేదల భూములు కనిపించవు
హైదరాబాద్ చుట్టుపక్కల కోట్ల రూపాయల విలువైన జాగాలను కబ్జా చేసేందుకే ‘ధరణి’ తెచ్చిండు
బిజెపి ప్రభుత్వం ఏర్పడితే…. ఉచిత విద్య, ఉచిత వైద్యం, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తాం
ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలను ఇంకా మంచిగా అమలు చేస్తాం
తెలంగాణ రైతులను పట్టించుకోని కేసీఆర్…. పంజాబ్ రైతులకు మాత్రం మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసిండు
1400 మంది పేదోళ్ల ఆత్మబలి దానాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది
కెసిఆర్ కుటుంబం వేలకోట్లు సంపాదించుకోవడానికా… మనం తెలంగాణ రాష్ట్రం సాధించింది?
ఉచిత బియ్యం ఇస్తున్నది మోడీ ప్రభుత్వమే
కిలో కు రూ.29 భరిస్తోంది మోదీ ప్రభుత్వమే
గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా… కేంద్రం ఇస్తున్న నిధులతోనే
ఉపాధి హామీ పథకం నిధులను ఇస్తున్నది మోదీనే
తెలంగాణకి ఏం చేశావో చెప్పమంటే చెప్పకుండా… మోదిని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు కేసీఆర్
ఓట్లప్పుడు కేసీఆర్ ఇచ్చే పైసలు తీసుకోండి… ఆలోచించి ఓటు వేయండి
మునుగోడులో ఒక్క ఓటుకు 70 వేల రూపాయలు పంచిండు
మాయ మాటలు, మోసపూరిత వాగ్దానాలను నమ్మకుండా… ఆలోచించి ఓటు వేయండి
ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ప్రజలంతా ఆలోచించి ఓట్లు వేయండి
అంతకుముందు గ్రామస్థులు బండి సంజయ్ ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు…
• చిన్నోళ్లకు చిన్న చూపు, పెద్దోళ్లకు పెద్దచూపు చూస్తున్నారు. కొంగు పట్టుకుని ఏడ్చే పరిస్థితి ఉంది. మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు. మొగుడు చచ్చిపోయినా… ఇన్సూరెన్స్(రైతు బీమా) రావడం లేదు – ఓ వితంతు వేదన
• మా ఆయన సూసైడ్ చేసుకున్నాడు. నాకు ఎకరం భూమి ఉంది. నాకింకా ‘రైతు బీమా’ రాలేదు. మీరు ఏమైనా చేయండి. మీ కాళ్ళు మొక్కుతా. మాకు న్యాయం చేయండి – భర్తను కోల్పోయిన భార్య ఆవేదన
• హైవే కి 1km దూరంలో ఉన్నా… మాకు కనీస రోడ్డు పరిస్థితి లేదు. వనపడితే చెప్పులు వేసుకునే పరిస్థితి కూడా లేదు. మాజీ మంత్రి గడ్డెన్న అతని కొడుకు, ప్రస్తుత TRS ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మమ్మల్ని, మా గ్రామాన్ని ముథోల్ నియోజకవర్గం నుంచి డిలీట్ చేశా అంటున్నారు. మమ్మల్ని పట్టించుకోకుండా, తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు – నందన్ గ్రామంలో ఓ పెద్దాయన
• నాకు రేకుల కొంప ఉన్నది. నా కొడుకు పెండ్లికి వచ్చిండు. నా కొంప చూసి నా కొడుకుకి బిడ్డని ఇచ్చే వాళ్ళు కూడా లేరు. నాకు ఇండ్లు ఇప్పించండి. నా కొడుకుకు పెళ్లి జరిగేలా చూడండి. ఓ అమ్మ ఆవేదన
• మాకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లేవు, పెన్షన్లు రావడం లేదు, కనీస రోడ్డు సౌకర్యం కూడా లేదు – నందన్ గ్రామస్తులు
సోయం బాపూరావు, ఆదిలాబాద్ ఎంపీ కామెంట్స్:
• కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నరేగా నిధులతో.. ఇక్కడ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేసిఆర్ ప్రభుత్వంపై ఉంది. కెసిఆర్ సర్కార్ గ్రామాలను పట్టించుకోవడం లేదు. నరేగా నిధులను పక్కదారి పట్టిస్తున్నాడు కేసీఆర్
• గ్రామ పెద్దలు చెప్పిన సమస్యలను, పరిష్కరించేందుకు కృషి చేస్తాను
అన్ని గ్రామాల్లో వీధి దీపాలను ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే
నందన్ గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండిసంజయ్ కుమార్.
BREAKING
నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలంలోని బాంనీ, నందన్ గ్రామాల మధ్య కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర
పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ని చూసి, బండి సంజయ్ వద్దకు వచ్చి, తమ సమస్యలు చెప్పుకుంటున్న పలువురు అన్నదాతలు
24 గంటల ఉచిత కరెంట్ ఉత్తి మాటే అంటూ… బండి సంజయ్ కి చెప్పిన రైతన్నలు
కేసీఆర్ ‘రైతు రుణమాఫీ’ ఇంకా అమలు చేయలేదు… ఈ విషయంలో మీరు ప్రభుత్వం పై వత్తిడి తెచ్చి, రైతన్నలకు రుణమాఫీ అమలు చేసేలా చూడండి – బండి సంజయ్ తో అన్నదాతలు
రైతన్నలకు అండగా నిలబడుతుంది ఒక్క మోదీ ప్రభుత్వమే- బండి సంజయ్ తో అన్నదాతలు
అన్నదాతలకు ఎరువులపై సబ్సిడీ ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే- బండి సంజయ్ తో అన్నదాతలు
‘కిసాన్ సమ్మాన్ యోజన’ కింద కర్షకులకు పెట్టుబడి సాయం చేస్తున్నది కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే – బండి సంజయ్ తో అన్నదాతలు
రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమే – బండి సంజయ్ తో అన్నదాతలు
అన్నదాతల ఉసురు తీసుకుంటున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం – బండి సంజయ్ తో అన్నదాతలు
అన్నదాతలకు కనీస మద్దతు ధర ఇస్తున్నది మోడీ ప్రభుత్వమే – బండి సంజయ్ తో అన్నదాతలు
అన్నదాతలకు అండగా నిలబడతాం – బండి సంజయ్ తో అన్నదాతలు
వచ్చేది బిజెపి ప్రభుత్వమే – బండి సంజయ్ తో అన్నదాతలు
బిజెపి అంటేనే రైతు పక్షపాతి ప్రభుత్వం – బండి సంజయ్ తో అన్నదాతలు
BREAKING
నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో ముగిసిన బండి సంజయ్ పాదయాత్ర
ముథోల్, నిర్మల్ జిల్లాల సరిహద్దు అయిన నందన్ తండా వద్ద బండి సంజయ్ కి ఘనంగా వీడ్కోలు పలికిన ముథోల్ నియోజకవర్గ కార్యకర్తలు
వీడ్కోలు సందర్భంగా బండి సంజయ్ కి ‘ఛత్రపతి శివాజీ ఖడ్గాన్ని’ బహుకరించిన ముథోల్ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు
నందన్ తండా వద్ద బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికిన నిర్మల్ జిల్లా బిజెపి శ్రేణులు
నందన్ తండా వద్ద బిజెపి జాతీయ అధ్యక్షుడు ‘జేపీ నడ్డా’ పుట్టినరోజు వేడుకలను జరిపిన బండి సంజయ్
‘జేపీ నడ్డా బర్త్ డే’ సందర్భంగా స్వీట్లు పంచి, సంబరాలు జరుపుకున్న తెలంగాణ బిజెపి కేడర్
BREAKING
బాంనీ గ్రామంలో దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర
పాదయాత్రలో భాగంగా… ఓ ఇంట్లో బీడీలు చుడుతున్న కార్మికులను చూసి, వారి వద్దకు వెళ్లి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్న బండి సంజయ్
మాకు ‘బీడీ కార్మికులకు వచ్చే పెన్షన్’ రావడంలేదని బండి సంజయ్ దృష్టికి తెచ్చిన పలువురు బీడీ కార్మికులు…
మేము వెయ్యి బీడీలు చుడితే… మాకు వచ్చే కూలీ రూ. 200 మాత్రమే
వెయ్యి బీడీ లు చుట్టాలంటే.. కనీసం 2 రోజుల సమయం పడుతుంది సార్..
మా కష్టాన్ని గుర్తించి, మాకు కూడా బీడీ కార్మికులకు వచ్చే ‘పెన్షన్’ ను ఇప్పించండి సార్…
మీ సమస్య పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని.. బీడీ కార్మికులకు బండి సంజయ్ హామీ
బీడీ కార్మికులకు తప్పకుండా బిజెపి అండగా ఉంటుంది – బండి సంజయ్
మీరెవరు అధైర్య పడకండి – బండి సంజయ్
వచ్చేది బిజెపి ప్రభుత్వమే – బండి సంజయ్
బిజెపి ప్రభుత్వం వచ్చాక తప్పకుండా అందరికీ న్యాయం చేస్తాం – బండి సంజయ్
Breaking:
నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలంలోని బాంనీ గ్రామంలోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర.
బాంనీ గ్రామంలో బండి సంజయ్ కి ఘనస్వాగతం పలికిన స్థానిక బిజెపి శ్రేణులు.
బండి సంజయ్ పై పూల వర్షం కురిపిస్తూ… తమ అభిమానాన్ని చాటుకున్న గ్రామస్తులు.
పాదయాత్రలో భాగంగా.. ప్రజలతో మమేకమై, వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ.. వారికి భరోసా కల్పిస్తూ.. ముందుకు సాగుతున్న బండి సంజయ్.
Breaking:
మీరేం బాధపడకండి… మీకు అండగా మేమున్నాం.
బీజేపీ అధికారంలోకి రాగానే పంట నష్టపరిహారం అందిస్తాం.
రైతు బీమా అందిస్తాం.
మహిళా వితంతు రైతుకు బండి సంజయ్ భరోసా.
5వ రోజు జోరుగా కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర.
కాషాయ జెండాలు చేతపట్టి కదం తొక్కుతున్న గిరిజనులు.
బీజేపీ అధికారంలోకి రాగానే పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంతోపాటు రైతు బీమాను కూడా అందజేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. పంట నష్టపరిహారంతోపాటు రైతు బీమా అందని రైతులకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
• ఈరోజు ఉదయం ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభానికి ముందు నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం, కుంటాల మండలం, అంబకంటి గ్రామంలోని పాదయాత్ర రాత్రి శిబిరం వద్ద బండి సంజయ్ ని కలిసిన అంబకంటి తండాకు చెందిన మహిళా వితంతు రైతు శ్యాముకాబాయి తన గోడు వెళ్ళబోసుకున్నారు.
• తన భర్త(రాథోడ్ రవీందర్) ఈ ఏడాది జూలై 25న మరణించాడని బండి సంజయ్ కి చెప్పిన శ్యాముకా బాయ్ తనకు 2 ఎకరాల పట్టా భూమి ఉన్నప్పటికీ ‘రైతు బంధు’ రావడం లేదని వాపోయారు. పట్టా భూమి కలిగి ఉన్నప్పటికీ ఆన్లైన్లో మాత్రం మా భూమిని చూపించడం లేదని వాపోయారు. దీంతో తన భర్త చనిపోయి 5 నెలలు గడిచినా ఇంతవరకు ‘రైతు బీమా’ కూడా అందలేదన్నారు.
బండి సంజయ్ కు తన గోడును వెళ్లబోసుకుంటున్న గిరిజన వితంతు మహిళ శ్యాముకా భాయి
• అకాల వర్షాలతో పంట నష్టపోయినప్పటికీ పరిహారం కూడా అందలేదన్నారు. అదికారులు, ఎమ్మెల్యే చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. ‘రైతుబంధు’, ‘రైతు బీమా’ వచ్చేలా… మీరే చూడాలి సారూ అని ప్రాథేయపడ్డారు. చాలా పేదదాన్ని నేను… నా కుటుంబాన్ని ఆదుకోండి సారూ.. అంటూ వేడుకున్నారు.
• వెంటనే స్పందించిన బండి సంజయ్ ‘‘అమ్మా… మీరేం బాధపకండి.. మీకు అండగా మేమున్నాం. మీ తరపున బీజేపీ పోరాడుతుంది. మీకు రైతు బీమా, రైతు బంధు, పంట నష్టపరిహారం’ అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా’’అంటూ భరోసా ఇచ్చారు. ఒకవేళ ప్రభుత్వం పట్టించుకోకపోవతే… రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని… తమ పార్టీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా రైతు బీమా, రైతు బంధు, పంట నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.
• మరోవైపు బండి సంజయ్ 5వ రోజు చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర జోరుగా కొనసాగుతోంది. పాదయాత్రకు భారీగా జనం, కార్యకర్తలు తరలివచ్చారు. ముఖ్యంగా గిరిజన మహిళలు, యువకులు తండోపతండాలుగా తరలివచ్చారు. కాషాయ జెండా చేతపట్టి సంజయ్ అడుగులో అడుగు వేస్తూ భారత్ మాతాకీ జై…. జై శ్రీరాం… జైజై బీజేపీ అంటూ కదం తొక్కుతున్నారు.
Breaking:
5వ రోజు ప్రారంభమైన బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర”. నిర్మల్ జిల్లా అంబకంటి గ్రామ శివారులోని రాత్రి శిబిరం నుంచి ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర. బాంనీ, నందన్, నర్సాపూర్, కుస్లీ గేట్, నసిరాబాద్ మీదుగా రాంపూర్ వరకు కొనసాగనున్న పాదయాత్ర. నర్సాపూర్ లో కార్నర్ మీటింగ్ లో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న బండి సంజయ్. నేడు మొత్తం 12.1 కిలోమీటర్ల మేరకొనసాగునున్న బండి సంజయ్ పాదయాత్ర. ఈరోజు రాంపూర్ సమీపంలో బండి సంజయ్ రాత్రి బస.
Breaking:
ఇవాళ నిర్మల్ జిల్లా అంబకంటి గ్రామ శివారులోని రాత్రి శిబిరం నుంచి ప్రారంభం కానున్న బండి సంజయ్ పదయాత్ర. బాంనీ, నందన్, నర్సాపూర్, కుస్లీ గేట్, నసిరాబాద్ మీదుగా రాంపూర్ వరకు కొనసాగనున్న పాదయాత్ర. నర్సాపూర్ లో కార్నర్ మీటింగ్ లో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న బండి సంజయ్. నేడు మొత్తం 12.1 కిలోమీటర్ల మేరకొనసాగునున్న బండి సంజయ్ పాదయాత్ర. ఈరోజు రాంపూర్ సమీపంలో బండి సంజయ్ రాత్రి బస
… continue update…