నీ బిడ్డ ఏమైనా స్వాతంత్ర్య సమరయోధురాలా? సారా స్కాంలో అరెస్ట్ చేస్తే తెలంగాణ అంతా ఎందుకు ధర్నా చేయాలే?: బండి సంజయ్

లక్ష కోట్లతో కేసీఆర్ బిడ్డ లిక్కర్ దందా.

-నమ్మి నీకు అధికారమిస్తే తెలంగాణ ప్రజలకు చిప్పచేతికిస్తవా?

-మీ కుటుంబం లెక్క లిక్కర్, గ్రానైట్, క్యాసినో, డ్రగ్స్ దందా నేను చేయలే.

-దేశం, ధర్మం కోసం జైలుకు వెళ్లిన చరిత్ర నాది.

-నిజాయితీగా పనిచేసే వ్యాపారస్తులు, సామాన్యలపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేసిందా?

-లంగ దందాలతో రాష్ట్రాన్ని దోచుకుంటున్న వారిపై విచారణ సంస్థలు దాడి చేయాలా? వద్దా?

-వ్యవస్థలన్నీ ధ్వంసం చేసిన దుర్మార్గుడు.

-ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయని మోసగాడు.

-ట్రిపుల్ ఐటీసహా విద్యా వ్యవస్థను నీరుగార్చిన కేసీఆర్.

-ఇక్కడి మంత్రి అవినీతి తిమింగలం.

-2 వేల ఎకరాలు దోచుకుని వేలకోట్లు సంపాదించిన కబ్జాకోర్.

-ఈ అల్లకల్లోల అవినీతి మంత్రి అంతు చూస్తాం.

-స్వీపర్ ఉద్యోగాల కోసం లక్షలు లంచం తీసుకున్న నీచుడు.

-జనవరి 10లోపు ఆ డబ్బులియ్యకపోతే ఈ భూమ్మీద ఎందుకు బతికానా? అనుకుంటావ్.

-డబుల్ బెడ్రూం ఇండ్లను ఒకే వర్గానికి ఇస్తవా?

-40 శాతం ఇండ్లను ఆ వర్గానికే ఇస్తే… 80 శాతం జనాభా ఉన్న హిందువుల పరిస్థితి ఏంది?

-హిందువులను మోసం చేస్తే ఒక్కొక్కడి బట్టలూడదీస్తా…

-బొట్టుపెట్టుకున్నంత మాత్రాన హిందువులు కాలేరు…

-దేశం, ధర్మం, దేవుడి కోసం పనిచేసే వాళ్లే హిందువులు.

-శాంతినగర్ లో పేదోళ్లు ఇల్లు కూల్చిన మీరు.. పెద్దోళ్ల విల్లాల జోలికి ఎందుకు పోరు?

-లవ్ జిహాదీల పేరుతో హిందూ అమ్మాయిలను వేధించే లుచ్చా నాకొడుకులను బట్టలూడదీయిస్తా.

-బీజేపీకి అధికారమిస్తే… బుల్డోజర్లు తీసుకొస్తా.

-కేసీఆర్… నిన్ను ఎవడూ కాపాడలేడు

-నీ అవినీతి కుటుంబాన్ని జైలుకు పంపి తీరుతాం.

-క్రిష్ణా జలాల వాటాలో 299 టీఎంసీలకే సంతకం చేసిన నెంబర్ వన్ తెలంగాణ ద్రోహి కేసీఆర్.

-బీజేపీని, మోదీని తిట్టడమే కేసీఆర్ పని…. తెలంగాణ ద్రోహి ఎవరో తేల్చుకుందామా?

  • బీజేపీ బిక్షతోనే తెలంగాణ ఏర్పడి సీఎం పీఠంపై కూర్చున్నావని గుర్తుంచుకో.

-ఉద్యమ ద్రోహులు, తెలంగాణ వ్యతిరేక పార్టీల సంకనాకే పార్టీ టీఆర్ఎస్.

-సీఎం కేసీఆర్ కుటుంబం, జిల్లా మంత్రిపై నిప్పులు చెరిగిన బండి సంజయ్.

-అంతా కాషాయ జెండా పట్టి పోరాడండి… కండకావరమెక్కిన సీఎంను గద్దె దించుదాం.

-తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానే.

-బీజేపీ అధికారంలోకొస్తే అందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తాం.

-అర్హులందరికీ పక్కా ఇండ్లు కట్టిస్తాం… రైతులకు పంట నష్టపరిహారం అందిస్తాం.

-ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తామని హామీ.

నిర్మల్ : ‘‘కేసీఆర్…. నీ బిడ్డ ఏమైనా స్వాతంత్ర్య సమరయోధురాలా? ఝాన్సీ లక్ష్మీబాయినా? ప్రజల సొమ్ముతో లక్ష కోట్ల సారా (లిక్కర్) దందా చేసింది. అట్లాంటామెను అరెస్ట్ చేస్తే తెలంగాణ ప్రజలెందుకు ధర్నా చేయాలె?’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. నిర్మల్ జిల్లా అల్లకల్లోల మంత్రి అవినీతి వేలాది ఎకరాలను కబ్జా చేసి వేల కోట్లు దోచుకున్న తిమింగలంలా మారారని మండిపడ్డారు. నిర్మల్ పట్టణంలోని ఛత్రపతి శివాజీ విగ్రహం చౌరస్తా హాజరైన భారీ జన సందోహాన్ని ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగంచారు.

డబుల్ బెడ్రూం ఇండ్లలో 40 శాతం ఒక వర్గానికే కేటాయిస్తే 80 శాతం జనాభా ఉన్న హిందువుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఊరుకోబోనని, హిందువులను మోసం చేసి దాడులు చేస్తే నిర్మల్ కు వచ్చి ఒక్కొక్కరిని బట్టలూడదీసి తరిమితరమి కొడతామని హెచ్చరించారు.

అవినీతి అనకొండ కేసీఆర్ కుటుంబంతోపాటు అవినీతి తిమింగల అల్లకల్లోల మంత్రిని సైతం వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఊచలు లెక్క పెట్టిస్తామని ప్రకటిెంచారు. నిర్మల్ లో ప్రభుత్వ భూములనే సాకుతో శాంతి నగర్ లో పేదల ఇండ్లను కూల్చేసిన అధికారులు… అవే ప్రభుత్వ భూముల్లో బడా బాబుల విల్లాలను ఎందుకు కూల్చివేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే నిర్మల్ కు బుల్డోజర్లను పంపి బడా బాబుల ఇండ్లను కూల్చివేయిస్తామని హెచ్చరించారు.

లవ్ జిహాదీల పేరుతో హిందూ అమ్మాయిలను వేధించే లుచ్చా నాకొడుకుల బట్టలూడదీయిస్తామని వార్నింగ్ ఇచ్చారు. హిందూ అమ్మాయి శ్రద్దావాకర్ ను 36 ముక్కలు చేయడంతోపాటు 20 మంది అమ్మాయిలను మోసం చేసిన ఆ అప్తాబ్ విషయంలో లౌకిక శక్తుల నోళ్లు ఎందుకు మూతపడ్డాయని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X