మహిళా రిజర్వేషన్ పై కవిత రౌండ్ టేబుల్ సమావేశానికి అపూర్వ స్పందన

13 పార్టీలు మరియు ఆయా సంఘాల నేతలు హాజరయ్యి మద్దతు

ఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి అపూర్వ స్పందన లభించింది. 13 రాజకీయ పార్టీలు మర్రియు వివిధ ప్రజా, మహిళా సంఘాల నేతలు హాజరయ్యి మద్దతు పలికారు. చర్చా వేదికలో పాల్గొని ఎంపీలు, నేతలు మాట్లాడారు.

శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ… ఓటు వేయడంలో రాజ్యాంగ నిర్మాతలు మహిళలకు సమాన హక్కు కల్పించినప్పుడు… చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచడానికి అధికారంలో ఉన్న ప్రభుత్వం మహిళలకు ఎందుకు రిజర్వేషన్ కల్పించదని ప్రశ్నించారు. ఈ అంశంపై చట్టసభల్లో ఉన్న మహిళలు ప్రభుత్వాలను మరింతగా డిమాండ్ చేయాలని సూచించారు.

ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ… రిజర్వేషన్ బిల్లుకు తాము మద్దతిస్తమని ప్రకటించారు. అయితే, రిజర్వేషన్ లో రిజర్వేషన్ కోటా ఉండాలి అని ప్రతిపాదించారు. పార్లమెంటుతో పాటు బయటా లేవనెత్తాల్సిన అంశాలపై మోహన్ ఉండాలని అన్నారు. ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతంగా నిర్మించాల్సిన అవసరం తెలిపారు.

సీపీఐ ఎంపీ బినాయ్ బిశ్వం మాట్లాడుతూ… మహిళా రిజర్వేషన్ బిల్లు కు పితృస్వామ్య వ్యవస్థలు అడ్డొచ్చాయని విమర్శించారు. 21వ దశాబ్దంలో కూడా మహిళా హక్కులను సరికాదని సూచించారు. కల్వకుంట్ల కవిత ప్రారంభించిన ఈ ఉద్యమంలో తాము భాగస్వాములు అవుతామని ప్రకటించారు.

ఆర్ఎల్డీ పార్టీ మహిళా విభాగం చేసి ప్రతిభా సింగ్, ఆ పార్టీ నేత భూపేంద్ర చౌదరి మాట్లాడుతూ… రిజర్వేషన్లపై మహిళల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందనీ తెలిపారు. ముఖ్యంగా బిల్లుపై జరుగుతున్న చర్చల గురించి గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు అవగాహన లేదని చెప్పారు.

జేఎంఎం ఎంపీ మౌహ మాఝి మాట్లాడుతూ… ఒకవైపు ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్న ఈ తరుణంలో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువ ఉండడం మంచిగా అనిపించడం లేదని అన్నారు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం కోసం రిజర్వేషన్ బిల్లు రావాల్సిందే, కవిత చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని తెలిపారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ద మాట్లాడుతూ… మహిళా రిజర్వేషన్ల కోసం కవిత లేవనెత్తిన డిమాండ్ కు తాము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని ప్రకటించారు. ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని, దాన్ని సంస్కరణలు తీసుకురావడం కోసంతో పాటు ప్రజలకు మంచి చేసే బిల్లులను తీసుకురావడానికి ఉపయోగించాలని సూచించారు.

సమాజ వాది పార్టీ ఎంపీ ఎస్టీ హాసన్ మాట్లాడుతూ… మహిళలకు తగిన వాట కల్పించకుండా, గౌరవం ఇవ్వకుండా ఏ దేశం కూడా సూపర్ పవర్ కాబోదని స్పష్టం చేశారు. దేశం అభివృద్ధి కావాలంటే చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలి అని అన్నారు.

వీసీకే ఎంపీ తిరుమావలవన్ మాట్లాడుతూ… మహిళా రిజర్వేషన్ బిల్లు తక్షణ అవసరమని తెలిపారు. ఆలస్యం చేస్తే దేశానికి , ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అని స్పష్టం చేశారు.

డీఏంకే ఎంపీ తమిళ్ సై తంగపంద్యాన్ మాట్లాడుతూ… వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో మహిళల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కార్యరూపం దాల్చడానికి కవిత చేసే పోరాటంలో తాము కలిసి నడుస్తామని అన్నారు.

MLC Kalvakuntla Kavitha holds round table discussion to discuss the way forward for the tabling of Women’s Reservation Bill

13 political parties and several civil society organisations join MLC Kalvakuntla Kavitha led Bharat Jagruthi’s round table dicussion for the Women’s Reservation Bill

New Delhi : MLC Kalvakuntla Kavitha led Bharat Jagruthi organised a round table discussion for the passage of Women’s Reservation Bill in New Delhi, today with over 12 opposition parties and several civil society organisations.

Several Members of Parliament from 13 political parties, joined the discussion on the way forward for the women’s reservation bill. MLC Kavitha called for greater participation of MPs in the Parliament to ensure that the ruling Government makes way for the tabling of the Bill. After, holding a protest at Jantar Mantar on March 10, Kavitha held another round of discussions where she said that building pressure on a Government which has a clear majority for the long-pending Women’s Reservation Bill is the need of the hour. She thanked all the dignitaries for their presence, while opening the house for a conversation with students.

The event was attended by MPs from BRS Party, JMM, DMK, RJD, Samajwadi Party, CPI, Shiv Sena, AAP, RLD, RSP (Kerala), CPM, VCK Party, Azad Samaj Party, farmer union leaders, women’s organisations and students.

Several leaders spoke on the Women’s Reservation Bill. Rajya Sabha MP, Priyanka Chaturvedi said that ‘when the makers of Indian Constitution could ensure that Women were given an equal right to vote..why the Government in power cannot table the Women’s Reservation Bill to ensure greater participation of Women in legislative affairs.’ She requested more women in legislative discourse to start demanding for the same. RJD Leader and MP Prof Manoj Jha, was heard saying that, ‘We stand in solidarity of the bill..we must look for reservation within reservation….We must have a strategy whereby issues are raised in parliament as well as outside, mass movement on the road brings the parliament on its knees.’

CPI MP and senior leader, Binoy Biswam said, ‘the patriarchal tendencies have come in the way of the women’s reservation bill. The right of the women, at this stage in the 21st century are denied even on matters of giving birth, and even with respect in the Parliament. We view this initiative by K Kavitha as a movement.’

RLD Women’s Wing Chief Pratibha Singh and leader Bhupinder Chaudhary, echoed the sentiment of empowering women and most importantly the women in the rural belts who are even unaware of the discussions taking place around the bill right now.

Mahua Maji, Member of Parliament, Rajya Sabha from the JMM said, ‘On one end, we are celebrating Azadi ka amrit mahotsav and on the other hand, in today’s time the representation of women in the parliament is abysmally low.’

Rajya Sabha MP from Aam Aadmi Party, Raghav Chaddha extended support to MLC Kavitha’s initiative demanding the Women’s Reservation Bill and said, ‘The Govt has a clear majority, it must be put to use to ensure reforms and bills of greater good are taken care of by the Govt.’

MP from Samajwadi Party and senior leader Dr. S T Hassan said, ‘A country cannot be a superpower if the women of the country are not given their due share and respect and most importantly adequate representation’, while extending their support for the Women’s Reservation Bill.

Thol Tirumavalan, MP from VCK Party said, “Women’s Reservation Bill is the need of the hour and the delay is grave injustice towards the people of this nation.”

The discussion was also attended by DMK MP Thamizhachi Thangapandian who said, ‘women needed in strategic decision making, we assure Kavitha ji we will use all the interventions to make women’s reservation bill a reality.’

The discussion was also attended by Farmer Union Leaders Sri Gurnam Singh Chaduni & Rajewal Ji, who affirmed that women’s participation during the farmers protest played a key role that later forced the Government to roll back the 3 Farm Laws and delay in the Women’s Reservation Bill is not the solution.

MLC Kavitha, daughter of Telangana CM KCR and founder of Bharat Jagruthi, held a round table conference in Delhi today to discuss the way forward for tabling of Women’s Reservation Bill in the Parliament.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X