An additional ₹300 crore burden imposed solely on Hyderabad residents.
Managing the increased power load is the government’s responsibility, not the citizens
Hyderabad: Bharat Rashtra Samithi (BRS) Working President K.T. Rama Rao (KTR) has strongly criticized the government for its decision to burden apartment residents with the cost of installing transformers to manage the increasing power load in Hyderabad. Addressing this issue in a statement, KTR lambasted the government for issuing notices through TSSPDCL, asking apartment complexes with power consumption exceeding 20 kW to set up their own transformers at their expense.
KTR described this as yet another “Tughlaq move” by the government, stating that such actions stem from its inability to manage power supply efficiently. Despite public outcry against this decision, the government remains indifferent. KTR emphasized that the responsibility to install new transformers and upgrade the power supply system lies entirely with the government, not with the citizens.
KTR highlighted that installing a transformer for an apartment complex costs approximately ₹3 lakh. This translates to an additional burden of ₹30,000 to ₹50,000 per household. In total, Hyderabad residents will bear a ₹300 crore burden if this policy is implemented.
KTR pointed out the irony of the Congress government, which came to power promising free electricity up to 200 units, now attempting to empty the pockets of citizens with a ₹300 crore expense. “People are already paying electricity bills based on their usage. The government must enhance infrastructure to meet growing demand instead of transferring this burden onto the public,” KTR remarked.
KTR questioned the rationale behind this new policy, asking why such a rule is being introduced now. “If increased electricity usage is a reason to impose such burdens on citizens, will the government tomorrow ask people to install their own pipelines and roads if usage increases?” he quipped.
This policy, he stated, reflects the government’s inefficiency and lack of planning. He called it shameful that the administration is evading its responsibilities to provide essential infrastructure.
KTR accused the Congress government of punishing citizens for its own mismanagement. He pointed out that the same authorities who approved construction projects without ensuring adequate transformer capacity are now passing the blame onto the residents. Instead of targeting middle-class families, the government should hold builders and officials accountable for these lapses, he added.
KTR demanded that the government bear the full cost of installing transformers wherever required. He urged the government to immediately withdraw this anti-people policy and warned that any attempt to shift this financial burden onto residents would be met with strong protests. “If the government does not reverse this decision, I will join the affected citizens in their fight,” KTR declared.
KTR also highlighted the growing unrest among citizens due to unannounced power cuts. He criticized the government’s apathetic response, stating that instead of addressing these issues, it is burdening residents with unnecessary costs.
KTR called on the Chief Minister, who also oversees the Municipal and Electricity Departments, to respond immediately and withdraw the decision. “Governments exist to serve the people, not to impose unfair burdens on them,” he concluded.
Also Read-
లోడ్ పెరిగిందంటూ ట్రాన్స్ ఫార్మర్ల భారం అపార్ట్ మెంట్ వాసులపైన వేస్తారా?- కేటీఆర్
కరెంట్ నిర్వహణ, సరఫరా చేతకాక ప్రజలను ఇబ్బంది పెట్టేలా మరో తుగ్లక్ చర్య
ఒక్కో అపార్ట్ మెంట్ లో ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు కోసం రూ. 3 లక్షలు కావాలి.
మధ్యతరగతి కుటుంబాలపై ఇది భరించలేని భారమవుతుంది.
ఒక హైదరాబాద్ నగర వాసుల పైననే అదనంగా 300 కోట్ల భారం
పెరిగిన విద్యుత్ లోడ్ ను సరిగా నిర్వర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
లోడ్ పెరిగిందని కారణం చూపుతూ అపార్ట్ మెంట్ వాసులపై భారం వేస్తామంటే ఊరుకునేది లేదు.
ప్రభుత్వమే కొత్తగా అవసరమైన ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేయాలి.
హైదరాబాద్ : నగరంలో అదనంగా విద్యుత్ వినియోగం పెరిగిందంటూ దానికి ప్రజలే వ్యక్తిగతంగా ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలని పెద్ద ఎత్తున జనంపై భారం మోపే ప్రభుత్వ చర్యపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నగరంలోని అపార్ట్ మెంట్ సముదాయాల్లో విద్యుత్ వినియోగం 20 కిలో వాట్ (KW) దాటితే ఆయా అపార్ట్ మెంట్ వాసులు సొంతంగా ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేసుకోవాలని TSSPDCL నోటీసులిస్తుండటంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన విద్యుత్ వినియోగానికి అనుగుణంగా నిర్వహణ చేతగాక ఈ ప్రభుత్వం ప్రజలపై భారం వేసే తుగ్లక్ చర్య కు పూనుకుందని ధ్వజమెత్తారు.
దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవటమేమిటనీ ప్రశ్నించారు. విద్యుత్ ట్రాన్ ఫార్మర్ల విషయంలో ప్రజలపై ఎలాంటి భారం మోపకుండా వాటిని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఎప్పుడు లేని ఇలాంటి నిబంధన ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారంటూ నిలదీశారు. విద్యుత్ వినియోగం పెరిగితే ఆ భారం ప్రజలపై వేసే ఆలోచన చేయటమంటే…భవిష్యత్ లో వినియోగం కూడా పెరిగిందంటూ పైప్ లైన్లు, రోడ్లను కూడా ప్రజలనే వేసుకోమంటారా అని ప్రశ్నించారు. పెరిగిన అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని రేవంత్ రెడ్డి సర్కార్ మరిచిపోయినట్లుందని ఎద్దేవా చేశారు.
20 కేవీల విద్యుత్ లోడ్ దాటిన అపార్ట్ మెంట్ లో సొంతంగా ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసుకోవాలంటే ఒక్కో అపార్ట్ మెంట్ కు దాదాపు రూ. 3 లక్షలు అవసరమవుతాయని కేటీఆర్ చెప్పారు. అంటే ఒక్కో కుటుంబంపై 30 నుంచి రూ. 50 వేలు భారం వేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. అంటే మొత్తం హైదరాబాద్ లో 20 కేవీ పైగా విద్యుత్ వినియోగం చేసే అపార్ట్ మెంట్ లలో కొత్తగా ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసుకుంటే ప్రజలపై రూ. 300 కోట్ల భారం పడుతుందని చెప్పారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్…ఇప్పుడు ప్రజల జేబులకు రూ. 300 కోట్లు చిల్లు పెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. విద్యుత్ వినియోగం పెరిగితే అందుకు అనుగుణంగా ప్రజలు విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. పెరిగిన లోడ్ కు అనుగుణంగా సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై వేయటమేటనీ కేటీఆర్ ప్రశ్నించారు. పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య…పూర్తిగా ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తుందన్నారు. వినియోగం పెరిగితే దానికి అనుగుణంగా చేపట్టాల్సిన చర్యల నుంచి ప్రభుత్వం తప్పించుకోవటమంటే అంతకన్నా సిగ్గు పడాల్సిన విషయం మరొకటి లేదన్నారు. ఈ సంప్రదాయం ఏ ప్రభుత్వానికి కూడా మంచిది కాదని సూచించారు. భవిష్యత్ లో రహదారు వినియోగం, నీళ్ల వినియోగం, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వినియోగం పెరిగితే ఆ భారం కూడా ప్రజలపైనే వేస్తారా అని ప్రశ్నించారు. అలా అయితే ఇంకా ప్రభుత్వాలు ఉండి ఏం లాభమని కేటీఆర్ నిలదీశారు. ప్రజలకు మౌలిక వసతుల కల్పన బాధ్యత ప్రభుత్వానిదేనన్న విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆనాలోచిత చర్య కారణంగా ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తారని ఆశపడి ఓట్లేసినందుకు ప్రజలకు షాక్ ఇస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రూ. 300 కోట్లు ప్రజల జేబులకు చిల్లు పెట్టాలన్న దుర్మార్గపూరిత ఆలోచనను వెంటనే విరమించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ప్రజలకు శిక్ష వేస్తున్నారని ధ్వజమెత్తారు. మూసీ, హైడ్రా విషయంలోనూ ఇదే ప్రభుత్వ అధికారులు, బిల్డర్లు చేసిన తప్పుకు పేదలు, సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టారని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేయకుండానే అనుమతించిన అధికారులను, వాటిని అమ్మిన బిల్డర్లను వదిలేసి ఇప్పుడు అపార్ట్ మెంట్ వాసులపై భారం మోపుతారా అని మండిపడ్డారు. ఎవరో చేసిన తప్పునకు మధ్య తరగతి ప్రజల జేబులకు చిల్లు పెట్టే ఆలోచన మానుకోవాలని కేటీఆర్ ప్రభుత్వానికి సూచించారు.
ఇప్పటికే లోడ్ పెరిగిందంటూ అప్రకటిత కరెంట్ కోతలతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఈ సందర్భంగా ప్రజల సమస్యను కేటీఆర్ ప్రస్తావించారు. కరెంట్ కోతలపై ప్రశ్నిస్తే ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని…నోటీసులు కూడా ఇస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం చర్యకు సమర్థించలేదని కేటీఆర్ అన్నారు. మున్సిపల్ శాఖ, విద్యుత్ శాఖ తన వద్దనే పెట్టుకున్న ముఖ్యమంత్రి వెంటనే ఈ అంశంపై స్పందించాలని కేటీఆర్ కోరారు. ప్రజలపై భారాన్ని మోపే నిర్ణయాన్ని తీసుకోకపోతే బాధిత ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.