हैदराबाद : अभिनेत्री समंता इन दिनों सोशल मीडिया पर काफी एक्टिव हैं। खासकर मायोजिटिस से प्रभावित होने के बाद समय-समय पर वह अपने प्रशंसकों के साथ अपने स्वास्थ्य अपडेट, उद्धरण, कठिनाइयों और बीमारी का सामना करने वाली कठिनाइयों को साझा करती रही हैं। हाल ही में समंता ने ऑक्सीजन मास्क पहने अपनी एक फोटो शेयर कर सभी को चौंका दिया है। अब वह फोटो वायरल हो रही है। लेकिन उन्होंने उस मास्क को पहनने के पीछे की वजह भी शेयर की। समंता ने खुलासा किया कि उन्होंने हाइपरबेरिक थेरेपी के लिए मास्क पहना है।
ఆక్సీజన్ మాస్క్ అభినేత్రి సమంతా… ఇంకా కోలుకోలేదా?
హైదరాబాద్ : సమంత ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉంటుంది. ముఖ్యంగా మయోసైటిస్ బారిన పడిన తర్వాత ఎప్పటికప్పుడు తన హెల్త్ అప్‌డేట్స్, కోట్స్, వ్యాధి వల్ల ఎదుర్కొన్న కష్టాలు, ఇబ్బందులను గురించి అభిమానులతో పంచుకుంటూ వస్తుంది. తాజాగా సమంత ఆక్సీజన్ మాస్క్ పెట్టుకున్న ఫోటోను షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే ఆ మాస్క్ పెట్టుకోవడం వెనుక ఉన్న రీజన్‌ను కూడా షేర్ చేసింది. హైపర్బేరిక్ థెరపీ కోసం సమంత ఆ మాస్క్ పెట్టుకున్నట్లు వెల్లడించింది.
అంతేకాకుండా సామ్ దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి గూగుల్‌లో సర్చ్ చేసిన స్క్రీన్ షాట్‌ను కూడా పంచుకుంది. పాడైన కండరాలను బాగుచేయడం, కండరాల వాపు, ఇన్ఫెక్షన్స్ వంటి వాటి నుంచి హైపర్బేరిక్ థెరఫీ కాపాడుతుందని తెలుస్తుంది. మయోసైటిల్ వల్ల కణాలు, కండరాలు, బోన్స్ దెబ్బ తిని ఉంటాయని, దాని కోసం బ్లెడ్ సర్క్యూలేషన్ సరిగ్గా అవ్వడానికే ఇలా థెరపీ చేయించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి సమంత మాత్రం ఇంకా ఆ మయోసైటిస్ నుంచి బయట పడలేదని కనిపిస్తోంది.
ఇక సమంత ఇటీవలే నటించిన శాకుంతలం బాక్సాఫీస్ దగ్గర బెడిసి కొట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఆశలన్నీ ఖుషీ సినిమాపైనే ఉన్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. దీనితో పాటు సిటాడెల్ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తుంది. వరుణ్ ధావణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను ది ఫ్యామిలీ మ్యాన్ రూపకర్తలు రాజ్&డీకే రూపొందిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో సామ్ పోలీస్ అధికారిగా కనిపించనుంది. (ఏజెన్సీలు)