‘ఇందిరమ్మ సూక్తులు’ తెలుగు పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముందుమాట రాసిన శ్రీమతి సోనియా గాంధీ

హైదరాబాద్‌ : గాంధీ భవన్‌లో ఈరోజు కాంగ్రెస్ అగ్రనాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ ముందుమాట రాసిన ‘ఇందిరమ్మ సూక్తులు’ తెలుగు పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పుస్తకాన్ని తెలుగులో ప్రచురింపజేయగా, ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బి.ఎం. సందీప్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి , ఇతర పీఏసీ సభ్యులు పాల్గొన్నారు.

ఇంగ్లిష్ లో వచ్చిన ఇందిరా గాంధీ సెలెక్టెడ్ సేయింగ్స్ ని తెలుగులో ఇందిరమ్మ సూక్తులు పేరుతో డా. పొన్నం రవిచంద్ర, డా. మామిడి హరికృష్ణ, శ్రీలక్ష్మి అనువదించగా మంత్రి పొన్నం ప్రభాకర్ వెలువరించారు. తొలుత ఈ పుస్తకాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కన్నడ భాషలో వెలువరించారు.

Also Read-

తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా యువతకు దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆలోచనలు, సందేశాలు, సూక్తులను చేరువ చేయాలనే ఉద్దేశంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పుస్తకాన్ని తెలుగులో ప్రచురింపజేశారు.

ఇందిరా గాంధీ ఆలోచనలు, ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తిని భావితరాలకు పరిచయం చేసే దిశగా ‘ఇందిరమ్మ సూక్తులు’ పుస్తకం ఒక మంచి ప్రయత్నంగా నిలవనుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ పుస్తకానికి శ్రీమతి సోనియా గాంధీ రాసిన ముందుమాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar