హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయలో బతుకమ్మ పండగా సంభరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి, మహిళాభివృద్ధి విభాగ ఇంచార్జ్ ప్రొ.కె. రాణి రజిత మాధురి ప్రారంభించారు.

అనంతరం మహిళా ఉద్యోగులకు ప్రొ. చక్రపాణి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో బతుకమ్మ పండగ విశిష్టతను వివరించారు. కుల మతాలతో, ప్రాంతాలతో సంబంధం లేకుండా మహిళలు అంతా కలిసి నిర్వహించుకునే పుష్పాలను పూజించుకునే సంభరమే బతుకమ్మ పండగ అని ప్రొ. ఘంటా చక్రపాణి వివరించారు.

విశ్వవిద్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ప్రొ. పల్లవీ కబ్డే; ప్రొ. రజని, ప్రొ. చంద్రకళ, డా. ఎ. రమా దేవి; మంజుల, సులోచన, సుహాసిని, రుశేంద్ర మణి, విశ్వవిద్యాలయ మహిళా ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో అన్ని విభాగాల మహిళా ఉద్యోగులు, అధిపతులు, డీన్స్, అధ్యాపక, అధ్యపకేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల నాయకులు కాంతం ప్రేమ్ కుమార్, డా. యాకేష్ దైద, పాండు తదితరులు పాల్గొన్నారు.

