: మాజీ జిల్లా జడ్జి, రచయిత మరియు కవి ‘జింబో’ మంగారి రాజేందర్ యొక్క ‘సాహిత్య రంగంలో నా జీవన ప్రయాణం’ అనే అంశంపై ఒక సాహిత్య చర్చా కార్యక్రమాన్ని అక్టోబర్ 8న బంజారా హిల్స్ లోని లమకాన్ (Lamakaan) లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత, రచయిత మరియు కవి డా. బి. నర్సింగరావు నిర్వహించారు.

అలాగే కార్యక్రమాన్ని ప్రముఖ చరిత్రకారుడు డి. సత్యనారాయణ నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ జడ్జి రాజేందర్ తో ఆయనకు ఉన్న పరిచయం మరియు ఆయన సాహిత్యంపై వివరించారు. ఆ తర్వాత మంగారి రాజేందర్ చిన్నతనంలో గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఒక జడ్జిగా, కవిగా మరియు రచయితగా ఎలా చేశారో వివరంగా తెలిపారు.

ఒకసారి తన రచనను పఠిస్తూ తన పిల్లలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా సభలో ఉన్న కవులు మరియు రచయితల ప్రశ్నలకు జడ్జి రాజేందర్ సమాధానం ఇచ్చారు.
