“ప్రొఫెషనల్స్‌ను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయాలి”

న్యూఢిల్లీ: ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (AIPC) చైర్‌పర్సన్‌గా నియమితులైన మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సోమవారం ఢిల్లీలోని 10 జన్‌పథ్‌లో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా AIPC భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత విస్తరణ, దేశవ్యాప్తంగా ప్రొఫెషనల్స్‌ను ఏకం చేయడం, పాలసీ మేకింగ్‌లో నిపుణుల భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించారు.

రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా ప్రొఫెషనల్స్‌ను రాజకీయాలు, పాలసీ రూపకల్పన, ప్రజా సమస్యలు, దేశ నిర్మాణంతో అనుసంధానం చేయడమే AIPC ప్రధాన లక్ష్యమని మధుయాష్కీ గౌడ్ తెలిపారు. ఇందుకోసం వచ్చే ఏడాది కాలానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు చెప్పారు.

దేశవ్యాప్తంగా AIPC కమిటీలు

ఆరు నెలల కాలంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో AIPCను బలోపేతం చేయడంతో పాటు జిల్లా, నియోజకవర్గం, నగరం, స్థానిక స్థాయిల వరకు కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు మధుయాష్కీ గౌడ్ గారు తెలిపారు. ప్రతి ప్రాంతంలోని ప్రొఫెషనల్స్‌ను సంస్థతో అనుసంధానం చేసి, వారి సమస్యలు, సూచనలు, నిపుణుల అభిప్రాయాలను పాలసీ రూపకల్పనలోకి తీసుకురావడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు.

అన్ని రంగాల నిపుణులకు ప్రాతినిధ్యం

డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆర్కిటెక్టులు, టీచర్లు, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, ఐటీ నిపుణులు, ఆర్టిస్టులు, స్పోర్ట్స్ ప్రొఫెషనల్స్, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలు, స్కిల్డ్ వర్కర్స్, గిగ్ వర్కర్స్ సహా అన్ని రంగాల నిపుణులను AIPCలో భాగస్వాములను చేయాలని రాహుల్ గాంధీ సూచించారని మధుయాష్కీ గౌడ్ తెలిపారు.

“ప్రొఫెషనల్స్ కేవలం రాజకీయాల్లోకి రావడం మాత్రమే కాదు.. వారి నైపుణ్యం, అనుభవం దేశ విధాన రూపకల్పనకు ఉపయోగపడాలి” అని ఆయన అన్నారు.

మిడిల్ క్లాస్ సమస్యలపై ప్రత్యేక దృష్టి

మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై AIPC ప్రత్యేకంగా అధ్యయనం చేస్తుందని మధుయాష్కీ గౌడ్ గారు చెప్పారు. విద్య, వైద్యం, ఉద్యోగాలు, గృహ నిర్మాణం, జీవన వ్యయం, పన్నుల భారం, ఉద్యోగ భద్రత, పిల్లల భవిష్యత్ వంటి అంశాలపై వాస్తవాలు, డేటా ఆధారంగా అధ్యయనం చేసి ప్రత్యామ్నాయ విధానాలను రూపొందిస్తామన్నారు. యువత, గ్రాడ్యుయేట్లు, ఉద్యోగార్థులు, స్టార్టప్‌లకు చెందిన యువ ప్రొఫెషనల్స్‌తో విస్తృతంగా సంభాషించి వారి సమస్యలను తెలుసుకుంటామని తెలిపారు.

Also Read-

ప్రొఫెషనల్స్‌తో నిరంతర సంభాషణ

దేశంలోని ప్రతి రాష్ట్రంలో Professionals Dialogue కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు మధుయాష్కీ గౌడ్ తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, టెక్నాలజీ, పన్నులు, జీవన వ్యయం, ఉద్యోగ భద్రత, గిగ్ వర్కర్ల సామాజిక భద్రత వంటి అంశాలపై నిపుణులతో చర్చించి పాలసీ ప్రతిపాదనలు రూపొందిస్తామన్నారు.

క్వాలిటీ పాలిటిక్స్.. క్వాలిటీ పాలసీ మేకింగ్

ప్రతి రంగానికి Expert Committees, Policy Research Groups, Advisory Panels ఏర్పాటు చేసి ప్రొఫెషనల్స్ నైపుణ్యాన్ని ప్రజా విధానాల రూపకల్పనలో వినియోగిస్తామని మధుయాష్కీ గౌడ్ తెలిపారు. క్వాలిటీ పాలిటిక్స్‌తో పాటు క్వాలిటీ పాలసీ మేకింగ్ అవసరం. నిపుణుల ఆలోచనలు, పరిశోధన, అనుభవం ప్రజలకు ఉపయోగపడే విధానాలుగా మారాలి అని ఆయన పేర్కొన్నారు.

రాజ్యాంగ విలువల పరిరక్షణలో ప్రొఫెషనల్స్ పాత్ర

భారత జాతీయోద్యమంలో న్యాయవాదులు, వైద్యులు, విద్యావేత్తలు, ఇతర నిపుణులు కీలక పాత్ర పోషించిన విషయాన్ని మధుయాష్కీ గౌడ్ గారు గుర్తుచేశారు. 1885లో కాంగ్రెస్ స్థాపన నుంచే విద్యావంతులు, న్యాయవాదులు, సామాజిక నాయకులు ప్రజా జీవితంలో కీలకంగా పనిచేశారని తెలిపారు.

మహాత్మా గాంధీ, మోతీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ తదితరులు కాంగ్రెస్‌ను ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించారని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం పరిరక్షణలో నేటి ప్రొఫెషనల్స్ కూడా చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు.

100 మందితో మన్మోహన్ సింగ్ ఫెలోస్ రెండో బ్యాచ్

AIPC ఆధ్వర్యంలో డా. మన్మోహన్ సింగ్ ఫెలోస్ ప్రోగ్రామ్ రెండో బ్యాచ్‌ను 100 మంది ప్రొఫెషనల్స్‌తో విస్తరించినట్లు మధుయాష్కీ గౌడ్ తెలిపారు. ప్రొఫెషనల్స్‌ను రాజకీయాలు, పాలసీ మేకింగ్, దేశ నిర్మాణంతో అనుసంధానం చేయడంలో ఈ కార్యక్రమం కీలకంగా ఉంటుందన్నారు.

దేశవ్యాప్తంగా నేషనల్ ప్రొఫెషనల్స్ కన్వెన్షన్

ఏడాది పాటు రాష్ట్రాల పర్యటనలు, స్థానిక కమిటీల ఏర్పాటు, ప్రొఫెషనల్స్ సమావేశాలు, పాలసీ డైలాగ్స్ నిర్వహించి, చివరగా దేశవ్యాప్తంగా ప్రతినిధులతో AIPC National Professionals Convention నిర్వహించనున్నట్లు మధుయాష్కీ గౌడ్ వెల్లడించారు.
ఈ సమావేశంలో దేశానికి అవసరమైన జాతీయ స్థాయి Professionals Policy Agendaను రూపొందించి, ప్రజా సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలను సూచించే దిశగా AIPC ముందుకు సాగుతుందని తెలిపారు.

Professionals – Politics – Policy – Nation Building మధ్య వారధిగా AIPCను తీర్చిదిద్దడమే మా లక్ష్యం. దేశంలోని ప్రతిభావంతులైన ప్రొఫెషనల్స్ శక్తిని ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు, ప్రజా సంక్షేమం, దేశ నిర్మాణం కోసం వినియోగిస్తాం అని మధుయాష్కీ గౌడ్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar