“పెన్షన్ విద్రోహ దినం” : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఉద్యోగుల ఆందోళన

హైదరాబాద్ : ఉద్యోగు “పెన్షన్ మ హక్కు – భవిష్యత్ భద్రతకు హామీ! ఐక్యమత్యమే మన బలం – పెన్షన్ సాధనే మన లక్ష్యం! అంటూ డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉద్యోగులు నినాదాలు చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయాల బోధనేతర ఉద్యోగుల సంఘం (తుంటీయ), తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు “పెన్షన్ విద్రోహ దినం” సందర్బంగా మంగళవారం డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల సభ్యులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో పరిపాలన భవనం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి పాత పెన్షన్ విధానం (OPS) అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు.

ప్రస్తుత కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (CPS/NPS) రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేసి, భవిష్యత్ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత నిశ్చితమైన నెలవారీ పెన్షన్ ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా, పి.ఆర్.సి. వెంటనే అమలు చేయాలని, ఉద్యోగులు వారి కుటుంభ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ జరిగేలా హెల్త్ కార్డ్‌లు జారీ చేయాలని, ఉద్యోగులు నిరసన చేశారు.

Also Read-

ఈ నిరసన కార్యక్రమంలో తుంటీయ సెక్రటరీ జనరల్, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కాంతం ప్రేమ్ కుమార్, తుంటియా వర్కింగ్ ప్రెసిడెంట్ డా.యకేష్ దైడా, విశ్వవిద్యాలయ ఉద్యోగ సంఘం సభ్యులు విశ్వనాథ్, మియాజాని, పాండు, అశోక్, భరత్ రెడ్డి, కె. మంజుల, జి. జ్యోతీ శ్రీ,, రజనికాంత్, మహమ్మద్ షబ్బీర్; అన్ని ఉద్యోగుల సంఘాల నాయకులు, ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X