గురు పూర్ణిమ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు: టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్ : గురు పూర్ణిమ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, గురువులకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం ఉందని, అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానమార్గాన్ని చూపే మహనీయులు గురువులని ఆయన పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో గురువు పాత్ర అమూల్యమని, గురువుల బోధనలు సమాజ నిర్మాణానికి, దేశాభివృద్ధికి బలమైన పునాదులని అన్నారు.

గురు పూర్ణిమ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ గురువులను స్మరించుకొని వారి ఆశీర్వాదాలు పొందాలని, గురువులు బోధించిన విలువలు, క్రమశిక్షణ, సేవాభావాన్ని జీవితంలో ఆచరించాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.

Also Read-

సమాజంలో జ్ఞానం, నైతిక విలువలు, మానవత్వాన్ని పెంపొందించడంలో గురువుల సేవలు చిరస్మరణీయమని పేర్కొంటూ, రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ మరోసారి గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X