వికలాంగులకు బ్యాటరీ వాహనాలను పంపిణీ చేసిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని రావి భద్ర రెడ్డి ఫంక్షన్ హాల్‌లో మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణముల పంపిణీ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరై, అర్హులైన దివ్యాంగులకు బ్యాటరీ వాహనాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ చామల గారు మాట్లాడుతూ దివ్యాంగుల సాధికారతకు ప్రభుత్వం మరియు సంస్థలు అందిస్తున్న తోడ్పాటు అభినందనీయమని కొనియాడారు. బ్యాటరీ వాహనాల ద్వారా దివ్యాంగుల ప్రయాణం సులభతరం అవుతుందని, తద్వారా వారు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయగలరని ఆకాంక్షించారు. సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Also Read-

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర రావు, వికలాంగుల సంఘం చైర్మన్ ముత్తినేని వీరయ్య, యాదాద్రి జిల్లా గ్రంధాలయం చైర్మన్ అవాయి ఛిస్తీ, అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) ప్రతినిధులుగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి. సుధాకర్ రావు మరియు జనరల్ మేనేజర్ జి. వి. సత్యనారాయణ మరియు వివిధ శాఖల అధికారులు, దివ్యాంగుల సంఘం ప్రతినిధులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X