मेडचल/हैदराबाद: कलवकुंट्ला कविता ने ऐलान किया कि वह मां बनकर तेलंगाना के लोगों को शासन देंगी। उन्होंने शनिवार सुबह मेडचल जिले के मुनिराबाद में प्रोफेसर जयशंकर परिसर (अद्वय सम्मेलन) में तेलंगाना राष्ट्र सेना (TRS) पार्टी का ऐलान किया। उन्होंने कहा कि वह कर्कोटक और राक्षस रेवंत रेड्डी सरकार को हटाने के लिए TRS पंचजन्यम पूरा कर रही हैं। उन्होंने बड़ी संख्या में फैंस के हंगामे के बीच पार्टी के नाम का ऐलान किया। उन्होंने उनके लिए आए सभी लोगों का शुक्रिया अदा किया।
इस मौके पर कविता ने कहा कि उनकी पार्टी फ्री शिक्षा, फ्री दवा, खेती, रोजगार और सामाजिक न्याय के पांच सिद्धांतों पर काम करेगी। उन्होंने कहा कि अब राज्य में मुख्य विपक्ष के तौर पर वह इन पांच सेक्टर में लोगों की समस्याओं पर कैंपेन करेंगी। उन्होंने कहा कि ढाई साल बाद सत्ता में आने के बाद वह उन समस्याओं का समाधान करेगी। आंदोलन के दौरान लोगों के लिए काम करने वाले KCR अब गीदड़ों और भेड़ियों के हाथों कैदी बन गए हैं। उन्होंने कहा कि वह हमारे KCR नहीं हैं, बल्कि कठपुतली हैं। उन्होंने कहा कि वह TRS पार्टी इसलिए बना रहे हैं क्योंकि वह एक ऐसी पार्टी चाहते हैं जो तेलंगाना में कुछ होने पर कड़ी मेहनत करे।
మేడ్చల్/హైదరాబాద్ : అమ్మనై తెలంగాణ ప్రజలకు పరిపాలన అందిస్తానని కల్వకుంట్ల కవిత ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లోని ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణం (అద్వయ కన్వెన్షన్)లో శనివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పార్టీని ప్రకటించారు. కర్కోటక, రాక్షస రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమేసేందుకు టీఆర్ఎస్ పాంచజన్యాన్ని పూరిస్తున్నానని అన్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానుల కోలాహలం మధ్య పార్టీ పేరును ప్రకటించారు. తన కోసం తరలివచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ఉచిత విద్య, ఉచిత వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం అనే పంచ సూత్రాలే ఇరుసుగా తమ పార్టీ పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఈ ఐదు రంగాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమిస్తామని.. రెండున్నరేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చి ఆయా సమస్యలకు పరిష్కారం చూపిస్తానని తెలిపారు. ఉద్యమకాలంలో ప్రజల కోసం పరితపించిన కేసీఆర్ ఇప్పుడు గుంటనక్కలు, తోడేళ్ల చేతిలో బంది అయ్యారని.. ఆయన మన కేసీఆర్ కాదు మరబొమ్మ అన్నారు. తెలంగాణాకు ఏదైనా జరిగితే ప్రాణం పెట్టి పని చేసే పార్టీ కావాలని అందుకోసమే తాను టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేస్తున్నానని తెలిపారు.
రేవంత్ రెడ్డి కర్కోటకుడు.. నియంత
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…కర్కోటక, నియంత సీఎం అని మండిపడ్డారు. వెలుగుమట్లలో అన్ని పర్మిషన్లు ఉన్న సరే అక్కడి ప్రజల ఇళ్లను కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధతో ఒక గర్భిణీకి అబార్షన్ అయితే ఆమె తండ్రి రోదన కళ్ల ముందు ఇంకా మెదులుతుందని చెప్పారు. రెండు నెలల చిన్నారిని కాళ్లతో తన్ని చంపితే ఇప్పటికీ కూడా కేసు పెట్టలేదన్నారు. గురుకులాల్లో విషం పెట్టి విద్యార్థులను చంపుతుంటే ఈ ప్రభుత్వం స్పందించటం లేదని విమర్శించారు. కర్ల రాజేష్ అనే యువకుడిని లాకప్ డెత్ చేస్తే ఇప్పటికీ కూడా చర్యలు తీసుకోలేదన్నారు. అందుకే ఈ ముఖ్యమంత్రిని కర్కోటక, నియంత ముఖ్యమంత్రి అంటున్నానని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడున్న మూడు పార్టీలు కుటుంబ పాలన, అవినీతి, బంధుప్రీతితో నిండిపోయాయని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయటం కాంగ్రెస్ అజెండా అయితే పెద్ద సార్ ఫామ్ హౌస్ లో ఉండి…చిన్న సార్ ను సీఎం చేయాలన్నది బీఆర్ఎస్ అజెండా అని చెప్పారు. ఇక సామాజిక న్యాయాన్ని ఖతం పట్టించటమే బీజేపీ సింగిల్ అజెండా అని కవిత అన్నారు. ఈ మూడు పార్టీల మీద అలుపెరగని పోరాటం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సేన సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Also Read-
అమ్మగా పరిపాలన అందిస్తా
తెలంగాణలో 3.50 కోట్ల మంది ప్రజలకు అమ్మనై పరిపాలన అందిస్తానని కవిత చెప్పారు. అమ్మతనంతో పాలన చేస్తేనే బిడ్డల కష్టం తెలుస్తుందన్నారు. తెలంగాణలో ఏళ్ల తరబడి నడిచిన భూస్వామ్య వ్యవస్థపై ఎందరో మహానుభవులు పోరాడితేనే సమానత్వం వచ్చిందన్నారు. మలిదశలో కేసీఆర్, ఉద్యమకారులు పోరాడితే కొత్త రాష్ట్రం వచ్చిందన్నారు. ఇప్పుడు తాము రాజకీయ శక్తితో పాటు ప్రజా పోరాటాలను మిళితం చేసి సామాజిక తెలంగాణ సాధిస్తామని చెప్పారు. తల్లి జేబు చూడదని, కడుపు చూస్తుందని కవిత చెప్పారు. కచ్చితంగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా తామే ఉంటామని… మరో రెండేళ్లలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
పాంచజన్యం పేరుతో ఐదు హామీలు
తెలంగాణ రాష్ట్ర సేన అజెండాను కవిత వివరించారు. పాంచజన్యం పేరుతో ఐదు అంశాలపై హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతు సంక్షేమం, ఉపాధి, సామాజిక న్యాయం అనే అంశాలపై దృష్టి పెడతామని ప్రకటించారు. కేజీ నుంచి పీజీ వరకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో చదివిన కూడా ప్రజలపై రూపాయి భారం పడనివ్వమని చెప్పారు. ఎంత పెద్ద ఆరోగ్య సమస్యకైనా కార్పొరేట్ వైద్యం చేయించుకున్న సరే ప్రజలకు ఆ వైద్యాన్ని ఉచితంగానే అందించే బాధ్యత తనదని కవిత స్పష్టం చేశారు. ఇక రైతు సంక్షేమం అంటే రైతుకు గౌరవం వచ్చేలా కృషి చేయటమేనన్నారు. తాము రైతులమని గర్వంగా చెప్పుకునేలా చేస్తామన్నారు. 24 గంటల ఉచిత కరెంట్, యూరియ సహా రైతు సంక్షేమానికి చేయాల్సివన్నీ చేస్తామని స్పష్టం చేశారు. రైతును రాజు చేయటమే లక్ష్యమన్నారు. ఇక ఉపాధి విషయంలోనూ తమకు స్పష్టమైన విజన్ ఉందని కవిత చెప్పారు.
యువతకు ఉపాధి
యువతకు ఉపాధి అంటే కేవలం ఉద్యోగం మాత్రమే కాదన్నారు. వారి వద్ద మంచి వ్యాపార ఆలోచన ఉంటే 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు ప్రభుత్వమే రుణం అందించి వారిని ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. అదే విధంగా తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఒకటే నోటిఫికేషన్ లో 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారులు తమ యవ్వనాన్ని ఉద్యమంలో కోల్పోయారని చెప్పారు. వారి కోసం జూన్ 2, 2014 ను కటాఫ్ తేదీగా నిర్ణయిస్తూ లక్ష సూపర్ న్యూమరీ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇక సామాజిక న్యాయం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు. హిందీలో తియ్యగా మాట్లాడి బీఆర్ఎస్, కాంగ్రెస్ లు మైనార్టీలను మోసం చేశాయని కవిత చెప్పారు. మైనార్టీలతో పాటు అన్ని వర్గాలకు రాజకీయ అధికారం కోసం తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. మహిళ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వటంతో పాటు చిరు ఉద్యోగులు, వ్యాపారులు, కాంట్రాక్టర్లను కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు.
కేసీఆర్ పాలనలో దారి తప్పిన తెలంగాణ రథ చక్రం
తెలంగాణ సాధించుకున్న తర్వాత కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రథ చక్రం దారి తప్పిందని కవిత అన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆర్తిని అర్థం చేసుకోవటంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందన్నారు. సామాజిక తెలంగాణ రథ చక్రం పూర్తిగా విరిగి ముక్కలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ కలలతో తెలంగాణ తెచ్చుకున్నామో అవి నిజం కాలేదన్నారు. తెలంగాణ వస్తే బానిస సంకెళ్లు పోతాయని భావిస్తే…రైతులకు బేడీలు వేశారన్నారు. ఇసుక దందా మీద ప్రేమతో దళితుల మీద లాఠీలు విరిగాయని గుర్తు చేశారు. ఫోన్లు ఎక్కడ వింటారోనని వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా బతకాల్సి వచ్చిందని…దారుణమైన నిఘా నీడలో తెలంగాణ అంతా బతికిందని చెప్పారు. ఆనాడు తెలంగాణ కోసం ఆస్తులు అమ్ముకున్న వాళ్లంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు అన్యాయం జరిగిందన్నారు. ఉద్యమకారులు ఒక హోదా మాత్రమే కోరుకున్నారని…పదేళ్లు అధికారంలో ఉండి కనీసం వారికి నామినేటేడ్ పోస్టులు కూడా ఇవ్వలేదని కవిత చెప్పారు.
బీఆర్ఎస్ ఆత్మను కోల్పోయినందుకే తెలంగాణ రాష్ట్ర సేన
ఉద్యమంలో మనల్ని అవహేళన చేసి లాఠీలతో కొట్టించిన వారే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పెత్తనం చెలాయించారన్నారు. ఆనాడు పరిపాలన చేసిన కుటుంబంలో తాను కూడా భాగమేనని అందుకు క్షమాపణ మాత్రమే చెబితే సరిపోదని కవిత అన్నారు. సామాజిక తెలంగాణలో కోసం కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని…తమ పనితీరు ఎలా ఉంటుందో ముందు ముందు ప్రజలు చూస్తారన్నారు. ప్రజలకు మంచి చేయాలంటే రాజకీయ అధికారం కావాల్సి ఉంటుందన్నారు. రాజ్యాంగ పరంగా ప్రజా ఉద్యమాలను మిళితం చేసి రాజకీయాలు చేస్తామన్నారు. ఏ పార్టీకైనా ఆత్మ నేపథ్యం ఉండాలని…బీఆర్ఎస్ దాన్ని కోల్పోయిందని చెప్పారు. బీఆర్ఎస్ ఆత్మను కోల్పోయినందుకే తెలంగాణ రాష్ట్ర సేన వచ్చిందన్నారు.
ఆత్మలేని మరబొమ్మ, మారిన మనిషి కేసీఆర్
తన తండ్రి కేసీఆర్ మీద కవిత తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆనాటి కేసీఆర్, నేటి కేసీఆర్ వేరని చెప్పారు. ఆ నాటి కేసీఆర్ చేనేత కార్మికులు చనిపోతే బిక్షాటన చేసి సాయం చేశారని గుర్తు చేశారు. కానీ మారిన, మర మనిషి కేసీఆర్ ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్న బయటకు రావటం లేదన్నారు. వెలుగుమట్లలో, హైడ్రా పేరుతో ఇళ్లు కూల్చేస్తుంటే అయ్యా కేసీఆర్ అని ప్రజలు పిలుస్తుంటే కూడా సార్ బయటకు రావటం లేదన్నారు. ఎక్కడ ఎవరికీ చిన్న కష్టం వచ్చిన ఆ సార్ బయటకు రారు. ఎందుకంటే ఆయన ఆత్మలేని మర బొమ్మ అంటూ కవిత తీవ్ర పదజాలం వాడారు. ఆనాడు సింగరేణిలో కార్మికుడు చనిపోతే వెళ్లి పరామర్శించిన ఆయన…నేడు చేవెళ్లలో బస్సు ప్రమాదంలో చాలా మంది చనిపోయిన సరే పట్టించుకోలేదని విమర్శించారు. అధికారం వచ్చిన తర్వాత ప్రేమ, మమకారం పోయిందా అంటూ ప్రశ్నించారు. అవినీతి చేస్తే కొడుకునైనా, కూతురినైనా సరే వదలనని కేసీఆర్ గతంలో చెప్పారని కవిత గుర్తు చేశారు. కానీ తాను కాళేశ్వరంలో అవినీతి జరుగుతుందని చెబితే ఆ అవినీతి చేసిన పందికొక్కులను పక్కన పెట్టుకొని తననే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటనక్కలు, తోడేళ్ల చేతుల్లో కేసీఆర్ బందీ
గుంటనక్కలు, తోడేళ్ల చేతుల్లో కేసీఆర్ బందీ అయ్యారన్నారు. ఆర్డీఎస్ ద్వారా నీళ్ల కోసం ఆనాడు పాదయాత్ర చేసిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కేంద్రంతో గొడవ పెట్టుకోకపోయింటే పాలమూరు-రంగారెడ్డి పూర్తయ్యేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన పదేళ్లలో నీళ్ల కోసం లక్షా 89 వేల కోట్లు ఖర్చు చేసి 14 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లిచ్చారని చెప్పారు. రాష్ట్రంలో ఏదో పీకి కట్టలు కట్టారని పంజాబ్, గుజరాత్, బీహార్ వెళ్లి జాతీయ పార్టీ పెట్టాలని చూశారని విమర్శించారు. పైగా ప్రజలే తప్పు చేశారన్నట్లుగా కేసీఆర్ గారు రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతున్నారని కవిత అన్నారు. తాను ఎన్ని మాట్లాడిన సరే బీఆర్ఎస్ నేతలకు సమాధానం చెప్పటం చేతకావటం లేదన్నారు. ఇప్పుడు కూడా సమాధానం చెప్పకపోతే ప్రజలే బయకు లాగి సమాధానం చెప్పేలా చేస్తారన్నారు.
సామాజిక న్యాయానికి బద్ద వ్యతిరేకి బీజేపీ
బీజేపీ అంటేనే సామాజిక న్యాయానికి బద్ద వ్యతిరేకి అని కవిత విమర్శించారు. ఆ పార్టీ పెద్దలకు అసలు తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదని చెప్పారు. ఒకరు తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని అంటే మరొక తలకాయ లేని ఎంపీ తెలంగాణ ఏర్పాటును ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోల్చడని గుర్తు చేశారు. తెలంగాణను అవమానించేలా మాట్లాడిన సరే ఇక్కడి బానిస ఎంపీలు నోరు మెదపటం లేదన్నారు. తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వకపోయిన సరే ప్రశ్నించటం లేదన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపారని చెప్పారు. పోలవరం కారణంగా భద్రాచలం వద్ద ఐదు గ్రామాలు మునిగిపోయే పరిస్థితి ఉందని ఆ గ్రామాలను తెలంగాణకు తేవాలని బీజేపీ ఎంపీలను కవిత డిమాండ్ చేశారు. ఈ అంశంపై జాగృతి పోరాటం చేసిందని కేంద్రానికి, ఆంధ్రా ప్రభుత్వానికి లేఖ రాసిందని ఆమె గుర్తు చేశారు. బీజేపీ ఎంపీలు 8 మంది తెలంగాణ బిడ్డలైతే రాముని గుడి మునిగిపోకుండా ఐదు గ్రామాలను తెలంగాణకు తేవాలని సవాల్ విసిరారు. మొదటి నుంచి కూడా బీజేపీ సామాజిక న్యాయానికి బద్ద వ్యతిరేకి అని కవిత అన్నారు. మహిళ బిల్లును, కుల గణన, బీసీ బిల్లును తొక్కి పెట్టారన్నారు. పేదలకు కూడు పెట్టే ఉపాధి హామీ పథకాన్ని కూడా లేకుండా చేశారని విమర్శించారు.
అమర వీరులకు నివాళులు.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు
తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పార్టీ ప్రకటనకు ముందు బంజారాహిల్స్ లోని నివాసంలో కవిత, అనిల్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గన్ పార్క్ లోని అమర వీరుల స్తూపం వద్దకు వెళ్లి నివాళులర్పించారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా మునీరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకున్నారు. కన్వెన్షన్ సెంటర్ ప్రధాన ద్వారం (కాళోజీ ద్వారం) వద్ద తెలంగాణలోని అన్ని కళారూపాలకు చెందిన కళాకారులు, తెలంగాణ జాగృతి ఘన స్వాగతం పలికారు. కాళోజీ ద్వారం నుంచి సభా వేదిక వరకు కళాకారులతో కలిసి ర్యాలీగా తరలివచ్చారు. వేదికపైకి చేరుకొని కార్యకర్తలకు పిడికిలి బిగించి అభివాదం చేశారు. అనంతరం పార్టీ పేరును ప్రకటించారు. పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో పార్టీ జెండాను రూపొందించారు. సౌభాగ్యానికి ప్రతీక అయిన పసుపు, బడుగు, బలహీన వర్గాల సంపూర్ణ వికాసానికి ప్రతీక అయిన నీలం, పాడిపంటలతో అలరారే గ్రామసీమలకు, రైతన్నలకు ప్రతీకగా ఆకుపచ్చ రంగులను జెండాలో పొందుపరిచారు. పసుపు రంగు మధ్యలో నీలిరంగులో తెలంగాణ మ్యాప్ ముద్రించి ఇంగ్లిష్ అక్షరాల్లో టీఆర్ఎస్ అని ముద్రించారు. కింద ఆకుపచ్చ రంగు పట్టీలో తెలంగాణ రాష్ట్ర సేన పేరును ప్రింట్ చేశారు.
తెలంగాణ సాధన జాగృతి పిడికిలి బిగించి కొట్లాడింది
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, సాంస్కృతిక వికాసం కోసం తెలంగాణ జాగృతి అహర్నిశలు పిడికిలి బిగించి కొట్లాడిందని గుర్తు చేశారు. తెలంగాణ సాంస్కృతిక దీపాన్ని తెలంగాణ జాగృతి కార్యకర్తలు పదిలంగా కాపాడుకున్నారని గుర్తు చేశారు. కాళరాత్రిలో కాగడా మాదిరిగా తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ జాగృతి వెలుగునిచ్చిందన్నారు. బతుకమ్మ పండుగ ద్వారా తెలంగాణ సంస్కృతి ఇది అని ప్రపంచానికి జాగృతి చాటిచెప్పిందని ఆమె చెప్పారు. ఐతే ఏ లక్ష్యం కోసం తెలంగాణ సాధించుకున్నామో ఆ లక్ష్యాలు నేరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవిష్యత్ ను రాసుకోవటానికి తాను కొత్త పార్టీతో ముందుకు వచ్చానని చెప్పారు. తన జీవితంలో ఇది మరుపురాని రోజు అన్నారు.
భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు
కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ప్రకటన సభకు తెలంగాణ నలుమూలల నుంచి జాగృతి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 1,500 బస్సులు, 2 వేలకు పైగా ఇతర వాహనాల్లో మునీరాబాద్ కు చేరుకున్నారు. సుమారు 40 వేల మంది కార్యకర్తలు తరలిరావడంతో సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. సభ అనంతరం కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. పార్టీ ప్రకటన అనంతరం క్యాడర్ తో కలిసి కల్వకుంట్ల కవిత భారీ ర్యాలీగా హైదరాబాద్ కు తిరిగివచ్చారు.
K. Kavitha Invokes Lord Krishna’s Panchajanyam, Launches Telangana Rashtra Sena (TRS), Promises to Establish “Amma’s Rule”
“Power Corrupted KCR; I Will Wage War Against Him” “Revanth Reddy is Telangana’s Hitler” “BJP Fit for Nothing”
Hyderabad: The political landscape of Telangana was altered forever as Kalvakuntla Kavitha launched her new, much-awaited political party, the Telangana Rashtra Sena (TRS), on April 25th in Hyderabad. At a massive public meeting in Medchal’s Muneerabad, Kavitha revealed the party’s name and vision during a high-octane speech spanning over an hour. Emphasizing the imminent need for a new political force, she said, “We fought hard and sacrificed everything we could to make Telangana a reality, but in vain. We didn’t really achieve what we intended to. Twelve years in, the dreams which were the foundation of the agitation remain unfulfilled. ‘Samajika Telangana’ continues to elude us. The ‘Telangana Chariot’ has gone off track. We all believed that getting a separate state would free us of our chains. Instead, farmers are suffering, Dalits are suffering, and even personal freedom is under constant threat; every single citizen of Telangana is being subjected to the brutality and negligence of those in power. To realize our dreams and give wings to our aspirations, political power is necessary.”
Acknowledging the fact that she was part of the family that ruled the state, Kavitha tendered an unconditional apology to the people of Telangana. She said, “I feel bad for being part of it. I ask for the forgiveness of the people of Telangana. Having said that, I am proud to have contributed to the Telangana agitation which made statehood a reality. While I accept that mistakes and crimes were committed by certain people, I believe an apology isn’t enough. To make up for it, we need to work hard once again to achieve ‘Samajika Telangana.’ I, therefore, am launching the Telangana Rashtra Sena.”
Speaking about the kind of governance Telangana deserves, she said, “I seek to establish a ‘Mother’s Rule.’ A mother’s rule is unconditional, considerate, and giving. Nothing can be as unconditional as a mother. A mother doesn’t just consider problems; she looks at the child’s needs. When governance is carried out with the spirit of motherhood, the heart breaks when people suffer. I want to stand by and uplift every single person in Telangana like a mother would.”
She refused to pull any punches and took the Congress, BRS, and BJP head-on, exposing their “true faces.” Sparing none—including former CM and BRS President K. Chandrashekhar Rao and current Chief Minister Revanth Reddy—she elaborated on the BJP’s anti-Telangana traits: “The BJP was always against the formation of Telangana. The statements of their national leadership prove that. Recently, a brainless Member of Parliament compared the bifurcation of Telangana and Andhra Pradesh to the Indo-Pak partition. While the BJP leadership continues to insult Telangana and ridicule our emotions, the eight MPs from Telangana remain silent. When seven mandals of Telangana were snatched from us, they didn’t speak a word. When Telangana is deprived of funds, they do not speak a word. They remain silent on unfulfilled promises made during the bifurcation as well. The BJP as a party is against the upliftment of all. The way they cheated women with respect to the Women’s Reservation Bill is the most recent example. The OBC Bill and Caste Census have been shelved as well. Despite all of this, the BJP MPs stay silent. I challenge those eight MPs to get back the five villages of Bhadrachalam that
were given to AP. Our Ram Mandir is in danger of being submerged.”
Regarding the BRS and KCR, she said, “KCR isn’t the same anymore. The KCR of the past cared about people, fought for the people, and got their problems solved. His heart was in the right place. Power corrupted him. I do not say this out of pain. The KCR we knew protested when artisans died and took up every single issue. Today’s KCR is nowhere to be seen when the houses of the poor are demolished in Velugumatla. When farmers were facing enormous losses and HYDRAA unleashed brutality on the poor, among innumerable other instances, KCR was invisible. If it were the KCR we knew during the agitation, he would have secured the Palamuru-RR project, which has been stalled for 10 years, no matter what. Instead, he went to Bihar, Bengal, and other states to establish a national party as if he had already done something great in Telangana. What was KCR doing when the houses of the poor were demolished overnight? What did KCR say in the past? He said even if his own children resort to corruption, he would disown them. Now, he has kicked me out for calling out corruption in the Kaleshwaram project but is happily enjoying the company of the ‘pigs’ who were responsible for that corruption. KCR has lost control of his political statements. Therefore, I will fight him. I will wage war for the people of Telangana, and that is non-negotiable. If KTR speaks that way, it is understandable, as he is naive.”
Then came Revanth Reddy’s turn. Speaking about the Chief Minister, she said, “He is evil. He is Telangana’s Hitler. The cries of a pregnant woman who lost her child due to stress after her house was demolished still ring in my ears. I will say he is evil; I will say he is Telangana’s Hitler. The Government did not even file a case when a child died in Kummera; therefore, he is evil. In Gurukuls, kids are being killed, yet he doesn’t do anything; therefore, he is evil. When a Dalit dies in custody and nothing is done, he is evil. We will fight the Congress tooth and nail. We will transform into the principal opposition and eventually the ruling party in just two years.”
Having driven home the need for a new political party, Kavitha unveiled her five flagship initiatives which she calls Panchajanya, named after the “Shankha” of Lord Krishna: Education, Health, Agriculture, Livelihood, and Samajika Telangana.
Kavitha announced these five revolutionary initiatives that TRS promises to implement when voted in:
Education: Free education for the poor and middle class across both government and private institutions.
Health: Free healthcare for the poor and middle class across both government and private hospitals.
Agriculture: Farmers will be treated like true kings and given the respect they deserve. While continuing all existing support systems, steps will be taken toward transforming agriculture into a full-fledged industry and creating exclusive, farmer-only spaces in government institutions.
Livelihood: Youth will be given access to capital. Depending on the idea, funds ranging from ₹2 lakh to ₹20 crore will be directly sanctioned to youngsters who want to set up businesses. Additionally, 400,000 jobs will be released via a single notification within one year of coming to power.
Samajika Telangana: No section of society will be left behind. Corporations will be set up for all necessary communities. SC/ST/OBC/Minorities and all other marginalized groups will reap the benefits of exclusive bodies set up to handle their needs, whether regarding representation in power, access to funds, education, or healthcare. We will take on the onus of solving all these problems.
