सांसद वड्डीराजू रामचंद्र ने बीआरएस वर्किंग प्रेसिडेंट केटीआर को गुलदस्ता दिया और मिठाई खिलाई, जानें वजह…

हैदराबाद : कालेश्वरम मल्टी-स्टेज सिंचाई योजना के बारे में जस्टिस पी. सी. घोष कमीशन की रिपोर्ट पर हाई कोर्ट के फैसले पर खुशी जताते हुए, राज्यसभा मेंबर वड्डीराजू रविचंद्र ने बीआरएस वर्किंग प्रेसिडेंट के. टी. रामा राव को फूलों का गुलदस्ता दिया और मिठाई खिलाई।

रविचंद्र ने बुधवार शाम हैदराबाद में तेलंगाना भवन में केटीआर से मुलाकात की। इसी तरह, सांसद रविचंद्र ने पूर्व मंत्री पोन्नाला लक्ष्मैया, विधायक के. पी. विवेकानंद, कलेरू वेंकटेश, डॉ. कलवकुंट्ला संजय, पूर्व सांसद मालोथु कविता, पार्टी के नेता अल्लिपुरम वेंकटेश्वर रेड्डी, चिरुमल्ला राकेश, गेलू श्रीनिवास यादव, कोती किशोर गौड़, तुंगबालू, बोइंडला विद्यासागर, डॉ. कुरवा विजय कुमार और अन्य लोगों को मिठाई बांटी और हाई कोर्ट के फैसले पर अपनी खुशी जाहिर की।

यह भी पढ़ें-

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి పుష్పగుచ్ఛం అందజేత

హైదరాబాద్ : కాళేశ్వరం బహుళ దశ సాగునీటి పథకానికి సంబంధించి జస్టిస్ పీ.సీ.ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై హైకోర్టు వెలువరించిన తీర్పు పట్ల హర్షం ప్రకటిస్తూ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. టీ. రామారావుకు పుష్పగుచ్ఛం అందజేసి మిఠాయి తినిపించారు.

హైదరాబాద్ తెలంగాణ భవన్ లో బుధవారం సాయంత్రం కేటీఆర్ గారిని రవిచంద్ర కలిశారు. అలాగే, ఎంపీ రవిచంద్ర మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు కే.పీ.వివేకానంద, కాలేరు వెంకటేష్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎంపీ మాలోతు కవిత, నాయకులు అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి,చిరుమళ్ల రాకేష్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, కోతి కిశోర్ గౌడ్, తుంగబాలు, బోయిండ్ల విద్యాసాగర్, డాక్టర్ కురవ విజయ్ కుమార్ తదితరులకు మిఠాయిలు పంచి హైకోర్టు తీర్పు పట్ల తన సంతోషాన్ని పంచుకున్నారు.

హైకోర్ట్ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రపూరిత రాజకీయాలకు చెంపపెట్టు…

మరోవైపు చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి స్వీట్లు తినిపించుకొని సమురాల నిర్వహించుకున్న బిఆర్ఎస్ శ్రేణులు

పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పూర్తిగా తప్పని హైకోర్ట్ కొట్టివేయడంతో కుత్బుల్లాపూర్ లోని బిఆర్ఎస్ శ్రేణులు చింతల్ లోని ఎమ్మెల్యే గారి కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చి స్వీట్లు తినిపించుకుంటూ సంబురాలను నిర్వహించుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….అవిభాజ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అన్నీ రంగాలలో అడుగడుగున వివక్షకు గురై ఎడారిగా మారిన తెలంగాణ ప్రాంతాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుతో సస్యాశ్యామలం చేసిన మహా నేత బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర సాధకులు పెద్దలు కేసీఆర్ గారని అన్నారు.

కాళేశ్వరంతో తెలంగాణ రాష్ట్రాన్ని సస్యాశ్యామలం చేసి తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న కేసీఆర్ గారని అవమానించేందుకు, అబాసుపాలు చేసేందుకు నేటి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ పేరుతో దొంగ కమిషన్లను వేసి పెద్దలు కెసిఆర్ గారిని, హరీష్ రావు గారిని మరియు అధికారులను ఇబ్బందులకు గురిచేయడం తప్పా ఆ నివేదికలో ఎటువంటి వాస్తవం లేదు.

ఇదే విషయాన్ని పదే, పదే మా పార్టీ నాయకులు స్పష్టం చేశారని, ఇదే విషయాన్ని నేడు హైకోర్ట్ కూడా తమ తీర్పుతో స్పష్టం చేసిందని, ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష్య పూరిత రాజకీయాలకు చెంపపెట్టన్నారు.

ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల పేరుతో చిల్లర రాజకీయాలు చేయడం మానుకొని ఇకనైనా ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి పై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X