हैदराबाद : टी20 वर्ल्ड कप 2026 के पहले सेमीफाइनल में साउथ अफ्रीका बनम न्यूजीलैंड के बीच कोलकाता के ईडन गार्डन्स पर खेला गया। यह मैच न्यूजीलैंड ने 9 विकेट जीता। इसके साथ ही वह फाइनल में पहुंच गया।

न्यूजीलैंड के कप्तान मिचेल सैंटनर ने टॉस जीतकर गेंदबाजी करने का फैसला किया। पहले बल्लेबाजी करते हुए साउथ अफ्रीका ने 8 विकेट खोकर 169 रन बनाये। 170 रनों का पीछे करने उतरी न्यूजीलैंड ने 12.5 ओवर में 1 विकेट खोकर 173 रन बनाये। फिन एलन ने 33 गेंदों में यादगार शतक बनाया।
गौरतलब है कि न्यूजीलैंड रनरेट के आधार पर सेमीफाइन में प्रवेश किया। अब न्यूजीलैंड का मुकाबला 5 मार्च को जीतने वाली भारत या इंग्लैंड के साथ खेला जाएगा। यह मुकाबला 8 मार्च को खेला जाएगा।
Also Read-
న్యూజిలాండ్ జట్టు 9 వికెట్ల తేడాతో సంచలన విజయం
హైదరాబాద్ : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ఫస్ట్ సెమీఫైనల్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన న్యూజిలాండ్ జట్టు 9 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. సౌతాఫ్రికాతో జరిగిన పోరులో కివీస్ సేన అద్భుత ప్రదర్శనతో విక్టరీ కొట్టి అహ్మదాబాద్‌లో జరగనున్న ఫైనల్ పోరుకు అర్హత సాధించింది.
అంతకు ముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో కోల్ మెక్కాన్చీ, రచిన్ రవీంద్ర, మ్యాట్ హెన్రీ రెండేసి వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశారు.

170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇస్తూ హాఫ్ సెంచరీలు చేశారు. పవర్‌ప్లేలోనే 84 పరుగులు రాబట్టి మ్యాచ్‌ను ఏకపక్షం చేశారు. ఫిన్ అలెన్ 33 బంతుల్లో శతకం బాదేశాడు. ఇక మరో ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ 33 బంతుల్లో 58 పరుగులు చేసిన అవుటయ్యాడు. అనంతరం వచ్చిన రచిన్ రవీంద్ర 13 పరుగులు చేశాడు. దీంతో న్యూజిలాండ్ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. సౌతాఫ్రికా బౌలర్లలో కగీసో రబాడ ఒక వికెట్ పడగొట్టాడు. (ఏజెన్సీలు)
