“నర్సింగ్ సిబ్బందిని క్రెడిట్ పాయింట్ల పేరుతో వేధించొద్దు” Stop harassing Nurses in the name of credit points: K. Kavitha

రిజిస్ట్రేషన్ల రెన్యూవల్ కు 150 క్రెడిట్ పాయింట్ల విధానం రద్దు చేయాలి నర్స్ లకు కనీస వేతనం రూ.20 వేలు అమలు చేయాలి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ : నర్సింగ్ సిబ్బంది మనో వేదనను అర్థం చేసుకోవాలని, క్రెడిట్ పాయింట్ల పేరుతో వారిని వేధింపులకు గురి చేయొద్దని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. క్వాలిఫైడ్ నర్స్ ల రిజిస్ట్రేషన్ రెన్యూవల్ కు ఐదేళ్లలో 150 క్రెడిట్ పాయింట్లు సాధించి ఉండాలని కొర్రీలు పెట్టడం సరికాదన్నారు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఈ నిబంధనలు తెచ్చిన తర్వాత తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ వాటిపై కనీస అవగాహన కల్పించే ప్రయత్నాలు చేయలేదని గుర్తు చేశారు. తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో 80 వేల మంది నర్సింగ్ సిబ్బంది తమ రిజిస్ట్రేషన్ల రెన్యూవల్ కు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

క్వాలిఫైడ్ నర్స్ లు తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకోవడానికి ఐదేళ్లలో 150 గంటల కంటిన్యూయింగ్ నర్సింగ్ ఎడ్యుకేషన్ క్రెడిట్ అవర్స్ కలిగి ఉండాలనే నిబంధన తెచ్చినట్టు కూడా చాలా మందికి అవగాహన లేదన్నారు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ తీసుకువచ్చిన ఈ కొత్త నిబంధనపై తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ అవగాహన కల్పించలేదని తనను కలిసిన పలువురు నర్సింగ్ సిబ్బంది వాపోయారని తెలిపారు. 150 రిజిస్ట్రేషన్ లు రెన్యూవల్ చేస్తామంటూ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ ఉత్తర్వులు ఇవ్వడం పూర్తిగా ఏకపక్షమే. నర్సింగ్ కేవలం వృత్తి మాత్రమే కాదు సేవ చేయడం. రాత్రి, పగలు తేడా లేకుండా ప్రజల ప్రాణాల రక్షణ కోసం సేవలందించే నర్సింగ్ సిబ్బంది రిజిస్ట్రేషన్ ల రెన్యూవల్ విషయంలో ఇలాంటి కఠిన నిబంధనలు సరికాదు.

ఉద్యోగాలు చేస్తూ నర్సింగ్ సిబ్బంది నెలకు కనీసం రెండు కాన్ఫరెన్స్ లకు హాజరయితే తప్ప నర్సింగ్ కౌన్సిల్ నిబంధనల మేరకు క్రెడిట్ పాయింట్స్ సాధించడం సాధ్యం కాదన్నారు. కరోనా కాలంలో నర్సింగ్ కాన్ఫరెన్స్ లు నిర్వహించలేదనే విషయం తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ కు తెలియదా అని ప్రశ్నించారు. ఐదేళ్లకు 150 క్రెడిట్ పాయింట్ల విధానంపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో పని చేస్తున్న నర్స్ లకు కనీస వేతనం రూ.20 వేలు అమలు చేస్తూ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. నర్సింగ్ సిబ్బందిపై వేధింపులు ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Also Read-

Stop harassing Nurses in the name of credit points – K. Kavitha Nursing is a service, not a punishment, withdraw Credit Points Condition Implement ₹20,000 minimum Salary for Nurses without delay

Hyderabad: K. Kavitha, President of Telangana Jagruthi, has strongly condemned the continued harassment of nursing staff under the pretext of credit points and demanded an immediate end to this unjust practice. She asserted that the mandatory requirement of securing 150 credit points within five years for renewal of nurses’ registrations is irrational, impractical, and deeply insensitive to the realities of the nursing profession.

She stated that after the Indian Nursing Council introduced these regulations, the Telangana Nursing Council utterly failed to create even basic awareness among nurses. As a direct result of this administrative negligence, nearly 80,000 nursing professionals in Telangana are now struggling to renew their registrations, putting their livelihoods at risk.

Kavitha said it is unacceptable that many qualified nurses are still unaware of the requirement to complete 150 hours of Continuing Nursing Education (CNE) within five years. Nurses who met her expressed anguish that the Telangana Nursing Council never adequately informed them about these new rules. Issuing unilateral orders insisting on 150 credit points for renewal is arbitrary, authoritarian, and shows complete disregard for the nursing community.

She emphasized that nursing is not just a job but a selfless service. Nurses work relentlessly—day and night, often under extreme pressure—to protect human lives. Subjecting such dedicated professionals to harsh, impractical, and poorly communicated conditions for registration renewal is nothing short of injustice.

Kavitha pointed out that for nurses who are already overburdened with long shifts, attending two conferences every month just to earn credit points is simply impossible. She questioned whether the Telangana Nursing Council has conveniently forgotten that no nursing conferences were held during the COVID-19 pandemic. She demanded an immediate review and rollback of the five-year, 150-credit-point policy.

She further demanded that the state government enact a law to strictly implement a minimum monthly salary of ₹20,000 for nurses working in private hospitals, in accordance with the directions of the Supreme Court of India. Kavitha issued a clear warning that if the harassment and exploitation of nursing staff continue, Telangana Jagruthi will not hesitate to launch a massive statewide agitation in support of nurses’ rights.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X