“BJP WOULD OPPOSE ANY HATE SPEECH BILL OF TELANGANA GOVT”

Hyderabad : Telangana state BJP President N Ramchander Rao today strongly opposed inclination of the state Congress government led by chief minister Revanth Reddy to bring a hatred bill on par with Karnataka government.

Rao accused Congress leaders of indulging in hatred campaign by making anti-sanatan remarks. Is it no hate speech when CM Revanth Reddy had commented on Hindu gods and made remarks stating that “Congress is Muslims and Muslims is Congress” during Jubilee Hills bye-elections, he questioned. The state BJP chief alleged that Telangana government is trying to bring a bill on par with Karnataka government only to harass BJP workers and target BJP.

The BJP would oppose any such move by Telangana Congress government, he said and condemned the move. Rao said BRS president and ex-CM K Chandrasekhar Rao after a long time coming out and involving in politics which will not make any difference. It was like OTP, he quipped and said that the BRS has no credibility among the people as they have experienced and realised that BRS leaders have involved in deep neck of corruption during its regime.

Also Read-

హేట్ స్పీచ్ చట్టం

కర్ణాటకలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించిన హేట్ స్పీచ్ బిల్లు–2025 తరహాలోనే, తెలంగాణలో కూడా సారూప్యమైన చట్టాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఈ ప్రతిపాదనను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఈ హేట్ స్పీచ్ చట్టం అనేది వాస్తవానికి బీజేపీ కార్యకర్తలను, బీజేపీ నాయకులను వేధించడానికి, వారిని తిరగకుండా చేయడానికి, మాట్లాడకుండా నోరు మూయించడానికి మాత్రమే తీసుకువస్తున్న చట్టంగా భావిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులను తిట్టేవాళ్లకు మద్దతుగా బిల్లు తెస్తోంది. హిందువులపై, సనాతన ధర్మంపై విమర్శలు చేసే వారిని, హిందూ ధర్మాన్ని, దేవీదేవతలను హేళన చేసే వారిని కాపాడేందుకు ఈ బిల్లు తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. అందుకే బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఈ చట్టం యొక్క అసలు లక్ష్యం హిందువులు ఏం మాట్లాడకుండా చేయడం, హిందూ ధర్మ స్వరాన్ని అణచివేయడమే. “ముస్లిం ఈజ్ కాంగ్రెస్… కాంగ్రెస్ ఈజ్ ముస్లిం” అని మాట్లాడింది కూడా కాంగ్రెస్ నాయకులే. హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, హిందూ దేవీదేవతలను హేళనగా, అసభ్యంగా మాట్లాడింది కూడా కాంగ్రెస్ పార్టీ, ఇండీ అలయెన్స్ పార్టీలే.

వాస్తవానికి హేట్ స్పీచ్ ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ, విద్వేషాన్ని పుట్టిస్తున్నది కాంగ్రెస్, ఇండీ అలయెన్స్ పార్టీలే. అలాంటి పార్టీ ఇప్పుడు విద్వేషాలకు వ్యతిరేకంగా హేట్ స్పీచ్ చట్టం తీసుకొస్తామంటూ మాట్లాడటం సిగ్గుచేటు. తెలంగాణలో రాజకీయాలు మారుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని నెలల తర్వాత మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వచ్చారని, రాజకీయాల్లో మళ్లీ మార్పు వస్తుందని చెబుతున్నారు. కానీ తెలంగాణలో ఓటీపీ పాలిటిక్స్ నడవవు.

గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని, ఫ్యూడలిజాన్ని, వారి పాలనా పనితీరును తెలంగాణ ప్రజలు స్పష్టంగా చూశారు. అందుకే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మర్చిపోయారు. కాబట్టి ఓటీపీ పాలిటిక్స్‌ను ప్రజలు నమ్మరు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం ఒక్క బీజేపీ పార్టీయే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X