హైదరాబాద్ : తెలంగాణలోని మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట హైవేపై వెళ్తున్న బైక్ ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది. చనిపోయిన వారిలో కూర్మ లింగయ్య (45), సాయవ్వ(40), సాయిలు (18), మానస(8). మృతులు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగి గ్రామానికి చెందినవారిలో ఉన్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఆదివారం జరగబోయే రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి తమ స్వగ్రానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. గతంలో కూడా పెద్దశంకరంపేటలో రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (ఏజెన్సీలు)
एक ही परिवार के चार लोगों की मौत
हैदराबाद: तेलंगाना के मेदक जिले में एक भयानक हादसा हुआ है। पता चला है कि मेदक जिले के पेद्दा शंकरमपेट हाईवे पर एक अनजान वाहन ने एक ही परिवार के चार लोगों की बाइक को टक्कर मार दी। इससे उनकी मौके पर ही मौत हो गई। मरने वालों की पहचान कुर्मा लिंगय्या (45), सायव्वा (40), सायुलू (18) और मानसा (8) के रूप में की गई है। माना जा रहा है कि मरने वाले कामारेड्डी जिले के निज़ामसागर मंडल के मागी गांव के रहने वाले थे।

पता चला है कि पुलिस ने केस दर्ज कर लिया है और घटना की जांच कर रही है। यह हादसा तब हुआ जब वे रविवार को होने वाले पंचायत चुनाव के दूसरे फेज में वोट डालने के लिए हैदराबाद से अपने होमटाउन जा रहे थे। परिवार के सदस्यों और गांव वालों को जब इस घटना के बारे में पता चला तो वे मातम के दुख में डूब गए। स्थानीय लोगों ने यह भी बताया कि पेद्दा शंकरमपेट के पास पहले भी इसी तरह के सड़क हादसे हो चुके हैं।
