ఆత్మహత్యలు చేసుకోవద్దు.
బిసి రిజర్వేషన్లు సాధించి తీరుతాం.
టీపీసీసీ అధ్యక్షలు మహేష్ కుమార్ గౌడ్.
హైదరాబాద్ : ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఈశ్వరచారి కుటుంబానికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం.
ఎక్స్ గ్రేషియా చెక్ ను కుటుంబానికి అందజేసిన మహేష్ కుమార్ గౌడ్ బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం. కార్యక్రమంలో పాల్గొన్న బిసి కమిషన్ చైర్మన్ నిరంజన్, టీపీసీసీ సంవిధాన్ బచావో కమిటీ చైర్మన్ డా.వినయ్, కార్పొరేషన్ చైర్మన్లు ఈరవత్రి అనిల్, నూతి శ్రీకాంత్, మెట్టు సాయి, బిసి సంఘం నాయకులు గణేష్ చారి తదితరులు పాల్గొన్నారు.
Also Read-
ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఈశ్వరచారి ఆత్మహత్య అత్యంత దురదృష్టకరమని, ఏ ఒక్కరు ఆత్మహత్య చేసుకోవద్దని, ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదని అన్నారు. బిసి రిజర్వేషన్లు కోసం కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నదని అన్నారు. ఎవ్వరు అధర్యపడొద్దని, బిసి రిజర్వేషన్లు సాదించుకుంటామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా జగద్గిరిగుట్ట లో ని ఈశ్వరచారి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం చెక్ ను అందజేశారు. దీనితోపాటు కుటుంబం లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని చెప్పారు.. బిసి సమాజం రిజర్వేషన్లు సాధన కోసం కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి అండగా నిలబడాలని ఆయన కోరారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
బీసీ బిడ్డ ఈశ్వరచారి ఆత్మహత్య బాధాకరం
మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్,సీనియర్ నాయకులు వినయ్ కుమార్ ఇతర నాయకులు ఈశ్వర చారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈశ్వరచారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి భవిష్యత్ కోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం. ఇలాంటి సంఘటనలు జరగకూడదు.
కాంగ్రెస్ పార్టీ బీసీ లకు రావలసిన రిజర్వేషన్లకు కట్టుబడి ఉంది. ఆ విషయంలో రాహుల్ గాంధీ గారి ఆశయం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేబినెట్ అంత తుది వరకు పోరాటం చేస్తాం. యువకులు తొందర పడవద్దు బీసీ లకు మంచి రోజులు వస్తాయి. ఈశ్వరచారి కుటుంబానికి ప్రభుత్వం, పార్టీ అండగా ఉంటుంది.
