हैदराबाद: नामपल्ली कीस्पेशल कोर्ट ने गुरुवार को तेलंगाना धर्मस्व मंत्री कोंडा सुरेखा के खिलाफ नॉन-बेलेबल वारंट जारी किया। बीआरएस के कार्यकारी अध्यक्ष और पूर्व मंत्री केटीआर की ओर से दायर या मानहानि मामले में मंत्री कोंडा सुरेखा के खिलाफ नॉन-बेलेबल वारंट जारी किया है। इसके बाद नामपल्ली की स्पेशल कोर्ट ने केस की सुनवाई अगले साल 5 फरवरी तक के लिए स्थगित कर दिया।
Also Read-
మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్
హైదరాబాద్ : తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు గురువారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అనంతరం ఈ కేసు విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తేదీకి నాంపల్లి ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది.
తెలంగాణ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో న్యాయస్థానం ఆమెపై నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది. గురువారం (డిసెంబర్ 11, 2025) ఈ కేసు విచారణకు రాగా, నిందితురాలి గైర్హాజరును న్యాయమూర్తి తీవ్రంగా పరిగణించారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కోర్టుకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే ఆమెను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించారు.
కేసు వివరాల్లోకి వెళితే.. కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు (C.C. No. 307 of 2025) విచారణ దశకు చేరుకుంది. గురువారం రోజున విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా, నిందితురాలైన కొండా సురేఖ కోర్టుకు రాలేదు. ఆమె గైర్హాజరుకు సంబంధించి న్యాయస్థానానికి ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం, మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేయకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. కోర్టు ప్రొసీడింగ్స్‌కు సహకరించకుండా నిరంతరం గైర్హాజరవుతున్న తీరును సీరియస్‌గా తీసుకున్న న్యాయమూర్తి, ఆమెపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.
నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. సాధారణ వారెంట్ లాగా ఇందులో బెయిల్ పొందే హక్కు నిందితులకు ఉండదు. ఈ వారెంట్ అమలు చేసి నిందితురాలిని హాజరుపరిచే బాధ్యతను పోలీసులకు అప్పగించిన కోర్టు, తదుపరి విచారణను 2026, ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. తాజా పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
